Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.10.2023
Share:

By Village Missionary Movement

Thursday, 19-Oct-2023

దిన ధ్యానము(Telugu) 20.10.2023

 

అంశం: నాలుక కీడైనది

 

"వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచువారందరు తల ఊచుదురు" - కీర్తనలు 64:8 

 

విజయపురి అనే దేశాన్ని విజయ వర్మ అనే రాజు పరిపాలన చేశాడు. ఆయన మంత్రి సభలో మహిబాలన్ అనే పొట్టి మంత్రి ఒకరు ఉండేవారు. ఒకసారి విజయవర్మ పొరుగు దేశమునకు దూతగా ఈ మహిబాలన్ ను పంపించారు. ఈయన పొట్టిగా ఉన్నందున ఆ పోరుగు దేశపు రాజు ఇతను చూసి హేళన చేస్తూ మాట్లాడారు. 

 

నీకంటే శ్రేష్టమైన వాళ్ళు నీ దేశంలో లేరా అని అడిగారు అందుకు ఆ మంత్రి చాలా మనోవ్యాధికి గురయ్యారు. వెంటనే ఆయన రాజా మా దేశమునకు ఒక వాడుక ఉంది వాడుక తగ్గట్టుగా నన్ను మా రాజు దూతగా పంపించారు అన్నాడు. మీ దేశపు వాడుక ఏమిటి అన్నారు రాజు. అందుకు మంత్రి రాజా ఒక దేశం యొక్క పరిస్థితి తగ్గట్టుగానే దూతలు పంపించుట మా రాజుకు అలవాటు. తెలివి గల రాజు పరిపాలించే దేశమునకు తెలివిగల దూతలను పంపిస్తూ ఉంటారు. మూర్ఖుపు రాజు పరిపాలించే దేశమునకు నాలాంటి మూర్ఖుల్ని పంపిస్తారు. మా దేశంలో ప్రధానమైన మూర్ఖుడిని నేనే అందువలన నన్ను దూతగా పంపించారు అన్నాడు. దానివల్ల రాజు అవమానముతో తలదించుకున్నాడు. 

 

క్రీస్తు నందు ప్రియమైన వారలారా! ఈ దినం మన మాటల్లో శ్రద్ధ కలిగి ఉంటున్నామా? ఇతరుల పైన నేరము మోపుటకు, గాయపరచుటకు, మన మాటలు వాడుకుంటున్నమా? కొద్దిగా ఆలోచించి చూద్దాం. 

 

కీడైన నాలుక కలవాడు భూమిలో ఎన్నడూ వర్ధిల్లాడు అటువంటివాడు వాడి యొక్క కీడుతో మనుషులను పాడు చేస్తాడు అని 140వ కీర్తన 11 లో చెప్పబడింది.

 

 బైబిల్లో కూడా తన నాలుక చేత వేదనపరిచిన ఒక మనిషి ఉన్నాడు. ఆయన పేరు నాభాలు. దావీదు పదిమంది యవ్వనస్తులను నాబాలు వద్దకు పంపించాడు. కొంతకాలము నాబాలుకు దావీదు సహాయము చేశాడు. 

 

నాబాలు అయితే దావీదు ఎవడు? యజమానుని యొద్ద నుండి పారిపోయిన వారు అనేకులు కలరు. వాడికి నేను సహాయము చేయను అని చెప్పి వాళ్ళను అవమానపరిచి పంపించాడు. దానిని విన్న దావీదు నాబాలుకు వ్యతిరేకంగా వచ్చాడు. తన కనికరము లేని మాటలు తనకు ప్రమాదము తీసుకు వచ్చాయి అని మన బైబిల్లో చదువుతూ ఉన్నాం. మనము కూడా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కనికరము కలిగిన మాటలతో మాట్లాడదాం. ఇతరుల మనస్సు ఇబ్బంది పడేటట్లు మాట్లాడకుండా ఉందాం. దేవుడు మనకు సహాయం చేయను గాక! 

- శ్రీమతి. దివ్య అలెక్స్ గారు 

 

ప్రార్థన అంశం:

ప్రతి రాష్ట్రంలోనూ 500 మంది మిషనరీలు లేపబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet