By Village Missionary Movement
Thursday, 19-Oct-2023దిన ధ్యానము(Telugu) 19.10.2023
అంశం: ఎంతకాలము వేచి యుందువు
"కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము" - సామెతలు 13:12
పచ్చ రంగులో మెరుస్తున్న మెరుపులతో చిలుక ఒకటి అడవుల్లో గల చెట్లు అన్నింటిని తిరిగి వస్తుంది. ఎత్తుగా ఎదిగిన కొమ్ములతో పెద్ద ఆకులతో పెద్ద పెద్ద కాయలతో ఉన్న పత్తి చెట్టుని ఆశ్చర్యముగా చూసింది. ఎలాగైనా ఈ చెట్టు యొక్క పండ్లు తిని తీరాలి అని ఆశతో ఆకాయ పండే వరకు వేచి ఉంది. చాలా బాధాకరం కాయలు పండకుండా ఎండిపోయి పేలి దానిలో నుండి దూది బయటకు వచ్చింది. వేచి ఉన్న చిలుకకు నిరుత్సాహం మిగిలింది.
బైబిల్లో యోహాను 5:5 లో 38 సంవత్సరాల గల ఒక మనుష్యుని గురించి మనం చదువుతున్నాం. 38 సంవత్సరాలు రోగముతో ఉన్నవాడు నీళ్లు ఎప్పుడూ కదిలింపబడతాయో అని చూస్తూ ఉన్నాడు కాని జరిగినది ఏమి మరియొక ఆయన వచ్చి ఆయనను స్వస్థపరిచరు .ఈయనకు సహాయం చేయుటకు ఎవరూ లేరు కాబట్టి 38 సంవత్సరాలు వేచి ఉన్నారు. మంచిది యేసయ్య వెతుకుతూ వచ్చి ఆ మనిషికి ఆరోగ్యం ఇచ్చారు లేని యెడల ఆయన 38 సంవత్సరాలు వేచి ఉండిన నిరీక్షణ వ్యర్థమై ఉండేది. ఇలానే మన జీవితంలోనూ, వివాహములోనూ, పిల్లలు కొరకు, ఇల్లు కట్టడం కొరకు మరియు మిగిలిన పని కొరకు వేచి ఉంటూనే ఉన్నాం కానీ అనేక సమయాల్లో నిరుత్సాహాన్ని మనం చూస్తున్నాం.
దీన్ని చదువుతున్న సహోదరి, సహోదరుడా మనం వేచి ఉండుట ఎలాగ పత్తి చెట్టు యొక్క నిజమైన పరిస్థితి గ్రహించకుండా ఆ చిలుక పండు కొరకు వేచి ఉన్నదో అలాగే ఉన్నమా? రోగము నుండి సమస్యల నుండి సమాధానం లేకుండా ఉన్న పరిస్థితుల నుండి నిజముగా విడిపించే ప్రభువైపు మనము చూస్తున్నామా? మీయొక్క వేచి ఉండుట ఎవరిమీద ఆధారపడి ఉన్నది ఆలోచించండి. దేవుని కొరకు వేచి ఉండండి ఆయన మీ హృదయాన్ని స్థిరపరుస్తారు. దృఢమైన విశ్వాసం కలిగి దేవుని కొరకు వేచి ఉండండి (కీర్తన 27: 14 ).
- శ్రీమతి. బూవిత ఎబినేజర్ గారు
ప్రార్థన అంశం:-
7000 మంది మిషనరీలు ఒక లక్ష గ్రామాలు అనే గురుని మనం త్వరగా చేరుకున్నట్లు ప్రార్థిద్దాం
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250