Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.10.2023
Share:

By Village Missionary Movement

Monday, 16-Oct-2023

దిన ధ్యానము(Telugu) 16.10.2023

 

అంశం: వెతికి వచ్చే దేవుడు

 

"అందుకు యేసు నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను" - యోహాను 11:40

 

అమెరికా దేశంలో ఒక వైద్యుడు క్యాన్సర్ కొరకు ఒక మందును కనిపెట్టాడు. ఆయనకు ప్రభుత్వము బిరుదు ఇవ్వాలని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయనను పిలిపించారు. వరదలు, తుఫానులు, వర్షము వలన ఆయన వెళ్ళవలసిన విమానము రద్దు చేయబడింది. కాబట్టి వారు కారులో బయలుదేరారు కొంత దూరం వెళ్లేసరికి ఆ కారు కూడా ముందుకు వెళ్ళలేక ఒక ఇంటి ముందు ఆగిపోయింది. ఆ ఇంటి తలుపు కొట్టి త్రాగడానికి నీళ్లు ఇమ్మని అడిగారు. వెంటనే ఆ ఇంటిలో గల తల్లి ఆయన లోపలికి పిలిచి కూర్చోబెట్టి త్రాగటకు నీళ్లు ఇచ్చారు. తరువాత తలుపు వేసి లోపల ఉన్న తన కుమారుడి యొక్క రోగము కొరకు ఆమె కన్నీటితో ప్రార్థించడం మొదలుపెట్టింది. ఆ తల్లిగారు బయటకు వచ్చి నా కుమారుడు రోగం కొరకు మందును కనిపెట్టిన ఒక డాక్టర్ విదేశంలో ఉన్నారు. ఆయనను వెళ్లి కలవమని మా డాక్టర్ మాకు చెప్పారు కానీ నేను అక్కడికి వెళ్ళడానికి మా దగ్గర అంత తో స్తోమత లేదు అందువల్ల మా పరమ తండ్రి అయిన దేవునితో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను అన్నారు. ఆయన రిపోర్ట్ ను తీసి చూసేసరికి ఆ డాక్టర్ నేనే. నేను మీ కుమారుని తీసుకుని వెళ్లి వైద్యం చేయిస్తాను అని అన్నారు. దేవుడు ఆ తల్లి ప్రార్థన విని ఆ వైద్యుడ్ని అక్కడికి వచ్చినట్లు చేశారు. 

 

 బైబిల్లో కూడా యేసు క్రీస్తు ప్రభువు లోకంలో పరిచర్య చేసిన దినాల్లో విశ్వాసముతో ఆయన దగ్గరికి వచ్చిన అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చి సంతోషంతో పంపించారు. ఆయనను పిలిచిన వారందరికీ అద్భుతం చేశారు. పేతురు ఇంటికి వెళ్లి ఆమె అత్తయ్యను జ్వరం నుండి స్వస్థత ఇచ్చారు. మరణించిన కుమార్తెను మరలా తిరిగి బ్రతికించారు. జక్కయ్య ఇంటికి వెళ్లి రక్షణ సంతోషాన్ని ఇచ్చారు. అలాగే విశ్వాసంతో వేచి ఉన్నవారికి వెతుకుతూ వెళ్లి ఆరోగ్యం దయచేసి 38 సంవత్సరములు అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి ఆరోగ్యం ఇచ్చారు. నడవలేని వారిని గ్రుడ్డివారిని ఆయన స్వస్థపరిచారు. విశ్వాసముతో సైన్యాధిపతి పనివాడికి ఆరోగ్యం ఇచ్చారు. ఎందుకు మరణించి నాలుగు దినములు అయినా లాజరు కూడా ప్రాణంతో లేపారు. 

 

ప్రియమైన వారలారా! మన జీవితంలో కూడా ఎలాంటి బలహీనత, అనారోగ్యము ఎలాంటి లోపాలైన అంత అయిపోయింది అనే పరిస్థితికి వచ్చినప్పటికీ ఆయన విమోచన ఇవ్వగలరు. మన ప్రభువు సముద్రములో త్రోవ కలుగజేయువాడును వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును (యెషయా 43:16) అని బైబిల్ చెబుతుంది. కాబట్టి మీ విశ్వాసము పాతి పెట్టబడినను దాన్ని మరలా తీయుడి. విశ్వాసముతో ఆయన దగ్గర ప్రార్ధించుడి ఆయన వెతికి వచ్చి అద్భుతం చేస్తారు. హల్లెలూయ! 

- శ్రీమతి. బ్యూలా గారు 

 

ప్రార్థన అంశం:-

మన ఫీల్డ్ లో 30 రోజులు 30 గృహాల్లో ప్రార్థన కూడికలు జరిగేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet