Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.10.2023
Share:

By Village Missionary Movement

Friday, 13-Oct-2023

దిన ధ్యానము(Telugu) 14.10.2023

 

అంశం: లోతులను గ్రహించినవారు

 

"ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును; వెలుగుయొక్క నివాసస్థలము ఆయనయొద్దనున్నది" - దానియేలు 2:22

 

మనుషుడైతే ముఖమును చూస్తాడు కానీ దేవుడైతే మా హృదయములను పరిశీలించి చూస్తాడు. హన్న తనకు పిల్లలు లేరు అని మిక్కిలి వేదన చెందింది. దుఃఖము ఆమెను అణిచివేసింది, ఆమె చుట్టూ ఎలాంటి అనుకూలమైన పరిస్థితులు లేవు దేవుని సన్నిధిలో ఆమె హృదయాన్ని, హృదయములో గల దుఃఖపు లోతును అంతటినీ కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఒంపివేసింది. కానీ దానిని చూసిన ఏలి ఈమె మద్యం సేవించిన వెర్రి దాని వలే ఉన్నది అని ఆమె పై భాగాన్ని చూసి చెబుతున్నారు. కానీ హన్న యొక్క హృదయాన్ని చూసిన ప్రభువు ఆమెను గుర్తించి సమూయేలును ఇచ్చారు. 

 

1 సమూయేలు 17వ అధ్యాయంలో సమూయేలు రాజుని అభిషేకించుటకు వెతుకుతూ యెష్షయి ఇంటికి వెళ్లి అతని కుమారుల శరీర ఆకారమును బట్టి అభిషేకించుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఇలా అంటున్నారు మనుషులు ముఖాన్ని చూస్తారు వాడు చూసినట్లు నేను చూడను. నేనైతే హృదయాన్ని చూస్తాను అని చెబుతున్నారు. కాబట్టి దేవుడు అరణ్య స్థలంలో గొర్రెలను కాచి వాటిని మేపే దావీదుని ఏర్పరచుకొని అభిషేకించి రాజుగా చేసిన దాన్ని మనం చూస్తున్నాం. అవును హృదయ లోతులను గ్రహించినవాడు దేవుడు మాత్రమే. 

 

ప్రియమైన వారలారా! మీరు వెళ్తున్న మార్గము బయట చూచుటకు అనేకులకు హేళనకరముగా ఉండవచ్చు లేక మిమ్మల్ని విమర్శించే విధంగా ఉండవచ్చు కానీ బలపరుచుకోనుడి దేవుడు మీ హృదయాలను చూస్తూ ఉన్నాడు. మీరు ఒక కఠినమైన పరిస్థితి గుండా వెళ్లేటప్పుడు మనుషులు దానిని చూసి తాము అర్థము చేసుకున్న మీ యొక్క మైండ్ లో గల ముగింపును చూస్తారు. కానీ దేవుని నమ్మే వ్యక్తులు నడిచే అగ్ని గుండాలు కావచ్చు, సింహాల బోనులు కావచ్చు అది వ్యత్యాసమైనదే అనే దాన్ని తర్వాత గ్రహించుకుంటారు. అగ్నిజ్వాలలు మనలను కాల్చలేవు, ప్రవహించే నీరు మన పైన పొర్లినప్పుడు అవి మనల్ని ఏమీ చేయలేవు. అవును నా హృదయ అంతరంగాన్ని గ్రహించిన దేవుడు ఇచ్చే జవాబు ఆశ్చర్య రీతిగా ఉండబోతుంది. హల్లెలూయ! 

- శ్రీమతి. దివ్య బెర్నార్డ్ గారు 

 

ప్రార్థన అంశం:

కరపత్రికల పరిచర్య ద్వారా దర్శించబడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet holiganbet giriş casibom giriş bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino