By Village Missionary Movement
Friday, 13-Oct-2023దిన ధ్యానము(Telugu) 13.10.2023
అంశం: సమాధానపడుడి
ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు” - రోమీయులకు 12:16
ఒకసారి ఒక స్త్రీ తన వృద్ధాప్యంలో గల బలహీనమైన తన తల్లిని తన చేదైనా గుణాతిశయం వలన చాలా కఠినంగా నడిపిస్తూ ఉండేది. చాలు చాలు తినడానికి ఇంత సరిపోతుందిగా అని చావడానికి సిద్ధముగా ఉన్న అమ్మమ్మకు బట్టలు మార్చి మంచిగా శుభ్రం చేయాలా అని రోజు ఆ మాటలు చేత వృద్ధురాలైన తల్లిగారు వేదన చెందారు. ఒక దినం ఆ కుమార్తె పరిశుద్ధాత్ముడు చేత హెచ్చరించబడింది. తన తల్లి మీద చూపిస్తున్న చేదైనా మనస్తత్వము ఎలా తనకు కీడును కలిగిస్తుంది అని పరిశుద్ధాత్ముడు తనకు హెచ్చరించినందున తన కళ్ళల్లో కన్నీళ్లతో తన తల్లి వద్దకు వెళ్లి క్షమాపణ అడిగి సమాధాన పడింది. ఆ దినము ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఒక బుకే కొనుక్కుని తన తల్లి వద్దకు వచ్చి అమ్మా నన్ను క్షమించండి అనేకసార్లు మీ మనసును దుఃఖపరిచాను అని ఏడ్చింది. తల్లి, కుమార్తె సమాధానపడ్డారు. పక్కింటి వాళ్ళతో ఆ తల్లిగారికి ఉన్న చేదైనా మనస్తత్వాన్ని గుర్తు చేసింది. తనని క్షమించమని ఒక లేఖ రాసి తన కుమార్తెకిచ్చి పంపించారు. యనలేని విధముగా అందరూ వచ్చి సమాధానపడ్డారు. క్రీస్తు ప్రేమ వీధి అంతా ప్రవహించింది అందువలన అందరు యేసుప్రభును అంగీకరించారు. మనసులో ఏర్పడిన మార్పు వలన శరీర బలహీనతలను విడిచిపెట్టి అనేకులు స్వస్థత పొందుకున్నారు. సమాధానపడుట ఎంత మేలైన కార్యమో చూడండి.
బైబిల్లో పాత నిబంధనలో యోసేపును ఎరుగుదుము. యోసేపు యొక్క అన్నదమ్ములు తనకు అనేక కీడైన కార్యములు చేశారు. కాని యోసేపు ఆ దేశంనకు అధిపతిగా మారినప్పటికీ తన సహోదరుల పైన పగ తీర్చుకోవాలి అనే కక్ష లేనివాడిగా కనబడ్డాడు. యోసేపు సమాధానపడుట మరియు క్షమించే గుణం కలిగిన వాడు.
ప్రియమైన వారలారా! సమాధానపడుట అన్నది పరలోకం యొక్క గొప్ప సంతోషమును రుచి చూడగలిగిన మనస్తత్వం కలిగినదని ఇతరులు క్షమించుట అనేది లోకంలో పరలోకంలో చూడగలం. కాబట్టి మనం అందరితో సమాధానం పడి క్రీస్తు యొక్క మనస్తత్వముతో ప్రేమను వ్యక్తపరిచి దైవిక సమాధానం పొందుకుందాం. యేసుక్రీస్తు మరణం వరకు తమ్మును తాము తగ్గించుకున్న (ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8) విధముగా మనలను మనము తగ్గించుకొని ఇతరులను క్షమించి సమాధానం ఇచ్చే మేలు మనం పొందుకుందాం.
- శ్రీమతి. జాస్మిన్ పాల్ గారు
ప్రార్థన అంశం:
మన దిన ధ్యాన పరిచర్యలో రాస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మతో నింపబడి పని చేసినట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250