Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.10.2023
Share:

By Village Missionary Movement

Monday, 09-Oct-2023

దిన ధ్యానము(Telugu) 10.10.2023

 

అంశం: అరణ్యము

 

"యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలె నగు నట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును" - యెషయా 51:3 

 

జీవితంలో అరణ్యం అన్నది ఎవరు లేని ఒంటరితనమైన కఠినమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు అందరి జీవితాల్లో వస్తాయి. దీనిని ఏ ఒక్కరు కూడా తిరస్కరించలేరు. ఇలాంటి పరిస్థితిని ఎలాగ దాటుతున్నామో దానినిబట్టే మన జీవితం ముందుకు వెళుతుంది. దీనిలో సనుగుకొనుట లేదా ఏదైనా సొంత ప్రయత్నం చేసి మనము దాటడానికి ప్రయత్నించిన యెడల నిరుత్సాహ పడిపోతాం. అనేకులు ఈ పరిస్థితిని దాటలేక జీవితాన్ని ముగించుకొని నరకానికి వెళ్తున్నారు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి హెచ్చింపునకు తర్ఫీదు ఇవ్వడానికి అరణ్యము వస్తుంది. 

 

దావీదు రాజుగా హెచ్చింపబడుటకు అరణ్యంలో ఆయన పొందుకున్న అనుభవమే సహాయపడింది. దావీదు యొక్క సహోదరులు పొందుకున్నంత తర్ఫీదు దావీదు పొందుకోలేదు. ఎందుకంటే నరుల సంచారం లేని అరణ్యంలో దేవుని ఆరాధించి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని జీవించుటకు దావీదు నేర్చుకున్నాడు. హాగరు అరణ్యములో నన్ను చూచుచున్న దేవుడవు అని అంటున్నది. అబ్రహాము యెహోవా ఈరే అన్నాడు. అలానే మీరు కూడా దేవున్ని రుచి చూడగలరు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన వైపు చూచిన యెడల మన పరిస్థితికి తగ్గట్టుగా ఆయన మనకు బయలుపరచుకుంటారు. మనం అలానే ఆయన పైన ఆనుకోని అరణ్య మార్గంలో దేవుని తోట వలె దాటిపోవచ్చు. దేవుని తోటలో ఆదాము హవ్వ ఎలా సంచరించారో అలా మీరు కూడా దేవునితో నడవవచ్చు ఆ విధముగా మీరు కూడా అరణ్యను దాటిపోవచ్చు. 

 

అరణ్యము అనేది హెచ్చింపునకు సిద్ధపడే స్థలము అనేది మర్చిపోకుడి. మీరు ఇలాంటి అనుభవంలో ఉండిన యెడల మిమ్మల్ని మీరు చూసుకొని ఈ విధముగా చెప్పుకొనుడి హేచ్చింపునకు తర్ఫీదు ఇస్తున్న దేవున్ని చూడు చుట్టూ చూడకము. ఆయనే నిన్ను తీర్చిదిద్దుతారు అని చెప్పుకొనుడి. మోషే గొప్ప నాయకుడిగా ఎన్నుకొనబడినప్పటికీ ఆయనను ఎన్నుకున్నది అరణ్య జీవితంలోనే. క్రీస్తు తన పరిచర్యలో వాడబడడాని కంటే ముందు ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడ్డారు. హెచ్చింపును కోరుకోకపోతే మీరు సహనాన్ని విసిరి వేయండి మారుగా సనుగుకొనుటను విసిరివేసి సహనముతో దీర్ఘశాంతముతో ఆయనను తేరిచూచిన ఎడల అరణ్య దినాలు ఆశీర్వాదకరముగా మార్చబడతాయి. మీరు కచ్చితంగా హెచ్చింపబడతారు. 

- శ్రీమతి. అంబు జ్యోతి స్టాలిన్ గారు

 

ప్రార్థన అంశం:-

ఆకలి గల వారికి ఆహారం పెట్టే పరిచర్యలో సహాయం చేసే అనేక కుటుంబాలు లేచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al