Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.10.2023
Share:

By Village Missionary Movement

Friday, 06-Oct-2023

దిన ధ్యానము(Telugu) 07.10.2023

 

అంశం: మేలు కలుగుటకై

 

"దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము" - రోమీయులకు 8:28 

 

యేసుక్రీస్తును వెంబడించే వారు, అంగీకరించేవారు అలాగుననే దేవుణ్ణి ప్రేమిస్తున్న చిన్నలు పెద్దలు అందరి జీవితంలో ఏదో ఒక కష్టాలు, నష్టాలు, ఇరుకులు ఉపద్రవాలగుండా వెళ్తూ ఉంటారు. ఇవన్నీ తర్వాత కాలంలో మేలు కలుగుటకై జరిగిందని వాళ్ళు గ్రహిస్తూ ఉంటారు. 

 

డి.యల్ మోడీ అనే ఉజ్జీవపు ప్రసంగికుడు ఇల్లు, చర్చి చికాగో పట్టణంలో ఉన్న ఆస్తులు అన్ని కూడా అగ్నికి ఆహుతి అయిపోయాయి. మిక్కిలి నిరుత్సాహపడిన డి.ఎల్ మోడీ మనుషుల సహాయము కొరకు ప్రయత్నించారు కానీ దేవుడైతే నీకు దేవుడిగా నేను లేనా అని అడిగిన వెంటనే మనుషులను నమ్మకుండా దేవుని పైన అనుకుని గొప్ప పరిచర్య చేయగలిగారు. 

 

విలియం కేరి భారతదేశము యొక్క శ్రేష్టమైన మిషనరీగా ఉండేవారు. ఈయన యొక్క కఠినమైన ప్రయాస వలన ఈయన సిద్దపరిచిన బైబిల్ తర్జుమా భాగాలు అన్నీ కూడా హఠాత్తుగా జరిగిన అగ్నిప్రమాదం వలన కాలిపోయాయి. అందువలన భార్య మతిస్థిమితం లేని దానిగా మారిపోయింది. దీనిలో కూడా నిరుత్సాహపడిపోకుండా తన పనిలో ఆగిపోకుండా ముందుకు వెళ్లారు. మరియు చక్కగా 18 భాషల్లో సంపూర్ణ బైబిల్ ను మరియు ఆత్మీయ పుస్తకాలను, కరపత్రికలను ముద్రించుటకు దేవుడు ఆయనకు సహాయం చేశారు. 

 

బైబిల్లో యోబు భక్తుడు అన్నింటిని కోల్పోయి సమాప్తమైన పరిస్థితికి వచ్చారు. అయినప్పటికీ నా రక్షకుడు సజీవంగా ఉన్నారు అని విశ్వాసముతో మాట్లాడారు. చివరికి రెండంతల మేలును పొందుకున్నారు. నయోమి బెత్లెహేములో వచ్చిన కరువు వలన అన్నింటినీ కోల్పోయిన పరిస్థితిలో ఏమి చేయాలో తోచక మోయాబు దేశంమునకు వెళ్లారు. దేవుడు ఇక్కడైనా ఒక మార్గాన్ని తెరుస్తారు అని నమ్మారు. తర్వాత తన భర్తను పిల్లలను కోల్పోయి తన కోడలితో చీకటి గల పరిస్థితుల్లో యెరుషలేమునకు చేరుకున్నది. అయినప్పటికీ ఏదో ఒక మేలు జరుగుతుంది అని నమ్మకం ఉంచింది వెళ్ళింది. మేలును పొందుకున్నది. తన కోడలు యొక్క కుమారుడిని తన కుమారుడిగా పెంచుకునే భాగ్యం తనకు దొరికింది. 

 

ప్రియమైన వారలారా! దేవుని చిత్తానికి సమర్పించి ఆయన మీద నమ్మకం ఉంచిన వారి యొక్క జీవితంలో ఎన్నడును కీడైన కార్యాలు ముగింపుగా ఉండవు. ఎంతమంది వారికి వ్యతిరేకముగా, కుయుక్తిగా పనిచేసినను సర్వశక్తిమంతుడైన దేవుడు వాటన్నింటినీ మేలు గానే మారుస్తారు. 

- శ్రీమతి. ఫాతిమా సెల్వ రాజు గారు 

 

ప్రార్థన అంశం: 

మన క్యాంపస్లో నడిపించబడుతున్న హాస్పిటల్ కు అవసరమైన మెడికల్ ఉపకరణాలు కొనడానికి అవసరమైన ధన సహాయము దేవుడు అనుగ్రహించేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet