Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.10.2023
Share:

By Village Missionary Movement

Thursday, 05-Oct-2023

దిన ధ్యానము(Telugu) 06.10.2023

 

అంశం: మేలైన అనుగ్రహము

 

"భార్య దొరికినవానికి మేలు దొరికెను అట్టివాడు యెహోవావలన అనుగ్రహము పొందిన వాడు" - సామెతలు 18:22 

 

యవ్వనస్తులైన అనేకులు యొక్క కల మంచి చదువు మంచి పని మంచి జీవిత భాగస్వామ్యము అన్నదే. భార్య దొరుకుట దేవుని వరము అని అందరూ చెబుతూ ఉంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉండాలంటే అది దేవుని ఆశీర్వాదమే. 

 

ప్రభువు దాని కొరకే వివాహము అనే బంధాన్ని ఏర్పరిచారు. ఒకరికొకరు సహాయముతో జీవించి దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించినప్పుడు ప్రభువు మంచి బిడ్డలను వాళ్లకు బహుమానంగా ఇచ్చి కుటుంబము అనే ఆనందాన్ని ఏర్పరుస్తున్నారు. ఆదామును చేసిన దేవుడు ఆయన ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఆయనకు సాటిగా ఉండేటట్లు ఆయన పక్కటముకునుండి హవ్వను ఆయన కొరకు చేసి ఉన్నారు. అబ్రహాముకు తగిన సహాయముగా శారాను, ఇస్సాకుకు తగిన సహాయముగా రిబ్కాను తగిన కాలంలో ఇద్దరినీ కూడా జతపరిచారు. స్త్రీ పురుషులు ఒకరికి ఒకరు అన్నది దేవుడు నియమించిన దీవెన. అది దైవభక్తి గల సంతతితో భూమిని నింపుటయే దేవుని యొక్క ప్రణాళికగా యున్నది. కానీ ప్రస్తుత యవ్వన పిల్లలతో వివాహము అనే పవిత్రమైన జీవిత ఒడంబడిక అవసరం లేదు అనే ఆలోచన. మన కన్ను మన మనసు కోరుకున్న జీవితాన్ని జీవించవచ్చు అనే తలంపు విస్తారంగా ఉంది. ఇది సాధారణమైన, శరీరానుసారమైన మరణ లోయ. వివాహము అన్ని విషయములలో ఘనమైనది (హెబ్రీ 13: 4) అవును వివాహ బంధం లేకుండా ఎవరితోనైనా జీవించినట్లయితే అది దేవుని దృష్టిలో వ్యభిచారముతో సమానము. సాతాను వేసే మరొక ఉచ్చు లివింగ్ టుగెదర్ అనే తంత్రపు ఉచ్చులో చిక్కుకొనేటట్లు చేసి వాళ్లను ఇరికిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా తప్పించుకొనుడి. 

 

కాబట్టి ప్రియ యవ్వనస్తులారా మీరు మీ యొక్క వివాహ జీవితం గురించి ఆలోచించి మీకు తగిన జీవిత భాగస్వామిని తగిన కాలంలో దేవుడు ఇచ్చేటట్లు దేవుని వద్ద ప్రార్ధించి దానిని ఆయన చేతికి అప్పగించుడి. మెరిసేది అంతా కూడా బంగారము కాదు అన్నట్లు కంటికి ఇంపైన వారందరూ కూడా మీ జీవితానికి తగిన వారు కాదు. వివాహ బంధము అన్న బంధానికి బయట మీ జీవితాన్ని ఎవరితో పంచుకొనకండి దానివలన నిత్య జీవము కోల్పోతారు. దేవుడు మీకు మంచి మేలు అయినా బహుమానమునే అనుగ్రహిస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక! 

- శ్రీమతి. భువన ధన బాలన్ గారు 

 

ప్రార్థన అంశం: 

ఆమెన్ విలేజ్ టీవీ శాటిలైట్ టీవీ గా మార్చబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al