By Village Missionary Movement
Thursday, 05-Oct-2023దిన ధ్యానము(Telugu) 05.10.2023
అంశం: దేవుని యందు బలపరుచుకొనుట
"దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పు కొనగా దావీదు తన దేవుడైన యెహోవానుబట్టి ధైర్యము తెచ్చుకొనెను" - 1 సమూయేలు 30:6
విలియం ఆల్ట్ అనే మిషనరీ (1778-1815) వరకు తన ఏడు సంవత్సరాల వయసులో ఆరుసార్లు సంపూర్ణ బైబిల్ ను చదివి పూర్తి చేశారు. తమిళ భాషను రెండు నెలలు నేర్చుకుని తమిళ భాషలో ప్రసంగం చేశారు. 1778 వ సంవత్సరం ఇంగ్లాండ్లో జన్మించిన ఈయన ప్రభు యొక్క ప్రేమను గ్రహించిని వ్యక్తిగా 17 వ సంవత్సరంలో ఆయన ఉంటున్న ప్రాంతంలో రక్షింపబడి బైబిల్ స్కూల్ ఒకటి ప్రారంభించారు. సముద్రము దాటి మిషనరీ పరిచర్య చేయవలసిన అవసరత ఆసక్తి ఈయనలో ఏర్పడినందున ఆరుగురు తో కలిసి బృందంని ఏర్పాటు చేసి ముద్ర ప్రయాణం చేసి శ్రీలంక దేశం నకు వెళ్లి పరిచర్య చేయుటకు నిర్ణయించుకున్నారు. విలియం ఆల్ట్ మరియు సారా ఈ గుంపులో ఉన్నారు. విలియం ఆల్ట్ తనకు వివాహమైన ఐదు దినములలో భార్యతో మిషనరీ ప్రయాణమును కొనసాగించారు. మరియు ఈయన భార్య సముద్ర ప్రయాణంలో మార్గమధ్యంలో అనారోగ్యానికి గురై వివాహమైన ఐదు వారములకే మరణించారు. సమాధి చేయుటకు ఈమెకు స్థలము లేనందున సముద్రమే ఈమెకు సమాధి స్థలముగా మారింది. ఈ బృందాన్ని నడిపిస్తున్న నాయకుడు కూడా సముద్ర ప్రయాణంలో మరణించారు. ఆరు నెలల తర్వాత శ్రీలంక దేశానికి చేరుకుని అక్కడ పరిచర్య ప్రారంభించినప్పుడు కరువుతో నిండిన భాగము, ఉండుటకు స్థలము లేని పరిస్థితులలో సువార్త పరిచర్యను ప్రారంభించారు. అన్ని కోల్పోయిన ఈ పరిస్థితులలో దేవుని యందు తనను బలపరుచుకొని పట్టి కోలా అనే ప్రాంతంలో ఎనిమిది నెలలు ప్రయాసపడి ఆరు స్కూళ్లను ఒక బైబిల్ కాలేజ్ ని ఒక సంఘమును స్థాపించారు.
దావీదు ఆయన మనుషులు సిగ్లాకు అనే స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న పట్టణము అగ్నితో కాల్చబడి ఉండుటయు తమ భార్యలు తమ కుమార్తెలు తమ కుమారులు చెరపట్టబడి కొనిపోబడుటయు అక్కడ ప్రజలు చూశారు. అటువంటి పరిస్థితుల్లో దావీదు మిక్కిలి ఇరుకునబడ్డారు. అప్పుడు ప్రజలందరూ కూడా దుఃఖము వలన దావీదును రాళ్లతో కొట్టి చంపాలని మాట్లాడుకున్నారు. దావీదు తన దేవునియందు తనను బలపరుచుకున్నారు. తరువాత దావీదు దేవుని వద్ద ప్రార్థన చేసి సమస్తాన్ని మరల పొందుకున్నాడు.
ప్రియమైన వారలారా! మిషనరీ విలియం ఆల్ట్ జీవితమును దావీదు సమస్తమును కోల్పోయిన సందర్భంలో దేవుని యందు బలపరుచుకున్న ఫలితముగా చేయవలసిన కార్యమును చేసి ముగించాడు. మనము దీవెనకరముగా ఉండేటప్పుడు మన హృదయాన్ని బలపరచుకొనుట సులువు కానీ సమస్తము కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు అటువంటి సమయంలో దేవునియందు మనము బలపరుచుకొనుటకు ప్రయాస పడుదాం. కచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తారు.
- శ్రీమతి. శక్తి శంకర్ రాజు గారు
ప్రార్థన అంశం:
మన క్యాంపస్ లో నడిపించబడుతున్న హాస్పిటల్ కు సమర్పించబడిన వైద్యులు మరియు నర్సులు దొరికేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250