Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.10.2023
Share:

By Village Missionary Movement

Tuesday, 03-Oct-2023

దిన ధ్యానము(Telugu) 04.10.2023

 

అంశం: దేవుని దృష్టిలో మీరు

 

"గొఱ్ఱెల దొడ్లమధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది వాటి యీకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్ప బడినట్టున్నది" - కీర్తనలు 68:13

 

నా మక్కల్ జిల్లా తమిళనాడు రాష్ట్రంలో ఉంది. సిత్తన్ పూండి అనే చిన్న గ్రామం బయట కొన్ని ఎకరాల పొలము సాధారణమైన నేల కంటే ఇక్కడ మట్టిలో బండరాయి మట్టి వేరువేరుగా ఉన్నందున ఎవరు దానిని పట్టించుకోలేదు కానీ మట్టిని పరిశోధించిన సైంటిస్టులు కొందరు గొప్ప సత్యాన్ని కనుగొనగలిగారు. అదేమిటి అంటే ఈ ఊరిలో గల మట్టి మరియు బండ రాళ్లు చంద్రుడిలో కనబడుతున్న మట్టి మరియు బండరాళ్లతో 99% సమానంగా ఉంది. దీనిని మన భారతదేశ ఆకాశ పరిశోధన బృందం అయినా ఇస్రో కి తెలిసినప్పుడు సైంటిస్ట్లను పంపి మట్టి మరియు బండరాళ్లను తమ పరిశోధనా కేంద్రమునకు తీసుకుని వచ్చి పరిశోధించి చూశారు. ఇస్రో సుమారు 50 టన్నుల మట్టిని అక్కడి నుండి తీసుకుని వెళ్ళింది. ఇక్కడ ఆశ్చర్యపరిచే కార్యమేమిటంటే గడిచిన దినాల్లో ఇస్రో పంపించిన చంద్రయాన్ 3 ని చంద్రుని పైకి పంపించడానికి అంటే ముందు ఈ నెలలోనే ప్రయోగం చేశారు. ఈ మట్టి మీదే వారు ప్రయోగం చేశారు కాబట్టి వారు విజయం పొందుకున్నారు. ప్రస్తుతం చంద్రయాన్ 3 తన పనిని చంద్రుడుపై చక్కగా చేస్తుంది. ఈ కార్యములను భారతదేశము మరియు ప్రయోగించినటువంటి ఆ తమిళనాడు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. 

 

ప్రియమైన వారులారా దేవుడు ఎప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసే దేవుడు కాడు. పట్టించుకున్న వారు లేరే అని మీరు నిరుత్సాహ పడిపోతున్నారా? తలాంతులు వలన నాకు ఫలితం రాలేదే అని కలత చెందుతున్నారా? మనసు నిండా గాయాలతో ఒక మూలన కూర్చుని ఉన్నారా? దేవుడు మిమ్మల్ని చూసిన విధానమే వేరు, ఎవరూ పట్టించుకోకుండా విడవబడిన మట్టిని సైంటిస్టులు ఈ లోకానికి చూపించే విధముగా చేసిన ఎడల సర్వశక్తి కలిగిన దేవుడు మిమ్మల్ని ఎలా వాడగలరు అని ఆలోచించండి. దేవుడు మీ గురించి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ ప్రణాళిక నెరవేర్చుటకు మన వి.ఎం.ఎం పరిచర్యలో భాగమైన ఆమెన్ విలేజ్ టీవీ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. మీ తలాంతులు చేత పట్టుకుని దానిని దేవుని నామ మహిమార్ధమై వాడబడుటకు మీరు సిద్ధమేనా? మేము దానిని ప్రచురపరచుటకు సిద్ధంగా ఉన్నాం. ఈ దినమే మాతో సంప్రదించండి దేవుని కొరకు ప్రయోజనకరముగా జీవించండి. 

- బ్రదర్. శంకర్ రాజు గారు 

 

ప్రార్థన అంశం:

తమిళనాడులో సంఘాలు లేని వెయ్యి గ్రామాల్లో వెయ్యి సంఘాలు కట్టబడేటట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet