Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.03.2021
Share:

By Village Missionary Movement

Wednesday, 24-Mar-2021

దిన ధ్యానము(Telugu) 24.03.2021

సమస్తము మేలు కొరకే.

"దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము" - రోమీయులకు 8: 28

చైనా దేశంలో గల ఒక గ్రామంలో దేవున్ని వెంబడించిన ఒక కుటుంబం నివసిస్తూఉండేవారు. వాళ్ళ ఇంట్లో ఏమి జరిగినను సమస్తము మేలు కొరకే అని చెబుతుంటారు. ఒక దినము వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక గుఱ్ఱము కనబడకుండా పోయింది. దానికి కూడా అదే జవాబు చెబుతారు అని పొరుగువారు హేళన చేసేవారు. కొన్ని దినముల తరువాత ఆ గుఱ్ఱము 4 గుఱ్ఱములను తీసుకు వచ్చింది. దానిని చూసిన ఆ గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఒక దినము ఒక అడవి గుఱ్ఱము ఆ ఇంట్లో గల యవ్వనస్తుడ్ని తన్నడం వలన వాడి కాలు విరిగిపోయింది. దానిని అడిగితే ఇది కూడా మేలు కొరకే అని చెబుతారని ఎవ్వరు అడగడానికి వెళ్ళలేదు. ఆ పరిస్తిల్లో చైనాలో ఉన్న పరిస్థితిని బట్టి యవ్వనస్తుల అందరిని యుద్ధములో పాల్గొనుటకు బలవంతంగా తీసుకొనిపోబడ్డారు. కాలు విరిగిపోవుట వలన మంచం మీద ఉన్న వీడిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. కొన్ని దినాల్లో ఆ గ్రామం నుండి యుద్ధం కొరకు తీసుకొనిపోబడ్డ యవ్వనస్తులు అందరూ మరణించారు అని సందేశం వచ్చింది. ఆ గ్రామం అంత కూడా దుఃఖంలో మునిగిపోయింది మిగిలినది ఈ యవ్వనస్తుడు మాత్రమే. 

బైబిల్ దేవుని ప్రేమించువారికి సమస్తము మేలు కలుగుటకై జరుగుతుంది అని మనకు చెబుతుంది. దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నరు? దేవున్ని నమ్మి ఆయన యోద్దే సమస్తాన్ని పెట్టి, ఆయన కొరకే సమస్తాన్ని త్యాగము చేయుటకు సిద్ధంగా వుంటున్నారో వాళ్లనే దేవుడు ప్రేమిస్తున్నరు. దేవుని ఆజ్ఞలను, ఆయన మాటలకు లోబడుతూ వస్తున్న వారుగా అందరికి అన్ని పరిస్థితుల్లో మేలు చేస్తు వస్తున్న వారే దేవుని ప్రేమను అర్ధం చేసుకున్నవారు. దేవుడు తన మీద చూపిన ప్రేమను ఇతరులు కూడా గ్రహించేటట్లు ప్రత్యక్ష పరిచే వారు నిజముగా దేవున్ని ప్రేమించే వారు అని పిలవబడతారు. 

నా ప్రియ స్నేహితులరా! దేవున్ని ప్రేమించువారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతుంది దీనిని మనము ప్రారంభంలో మన జ్ఞానం వలన గ్రహించుకోలేము. కాని దేవున్ని నమ్మి  ఆయన పైన అనుకోని ఉండేటప్పుడు చివరిలో అది మనకు అర్థం అవుతుంది. మీ యొక్క జీవితంలో కూడా మేలులు ఆటంకం వలన ఆగిపోయినట్లు కనిపించవచ్చు. ఇది ఎందుకు జరగడం లేదు అని కలత చెందవచ్చు. కాని ఒకటి నిశ్చయం దేవున్ని నమ్మి ఆయనే పైన ఆధారపడి, ఆయన యొద్ద నుండి మాత్రమే కార్యములను ఎదురు చూసిన వారు జీవితంలో సమస్తమును దేవుడు మేలు కొరకే జరిగేటట్లు చేస్తారు. ఆమెన్!
-    బ్రదర్. సి. పాల్ జబాస్టిన్ రాజ్

ప్రార్థన అంశం:-
పంజాబ్ రాష్టంలో ఆటంకపడిన పరిచర్య మరల కొనసాగించబడేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al