Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.10.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 01-Oct-2023

దిన ధ్యానము(Telugu) 01.10.2023 (Kids Special)

 

అంశం: బింగో

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు

 

"ప్రియుడా, చెడుకార్యమును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు" - 3 యోహాను 1:11

 

హలో పిల్లలు ఎలా ఉన్నారు? స్కూల్ లైఫ్ ఎలా ఉన్నది? హోంవర్క్ రాయడానికి జాలిగా ఆడుకోడానికి చాలా చక్కగా ఉన్నారా? సరే! మీకు ఏనుగు అంటే చాలా ఇష్టమే కదా? పెద్ద పెద్ద చెవులు కలిగి భారీ శరీరంతో నాట్యం చేస్తున్నట్లు కదులుతూ ఉంటుంది. ఈ దినం ఏనుగు గురించి కథ విందామా? 

 

అడవిలో బింగో అనే ఏనుగు పిల్ల ఒకటి ఉండేది. అది తన తల్లితో కలిసి చాలా సంతోషంగా ఉండేది. ఏనుగుకు చెరుకు అంటే చాలా ఇష్టమే కదా. పిల్లలు మరి మీకు కూడా ఇష్టమైన భోజనం ఉంటుంది కదా. బింగో తల్లి ఎక్కడైనా ఎక్కువగా చెరుకు పెట్టిన యెడల అటువైపు వెళ్ళకూడదు అని బింగోతో చెప్పింది. అక్కడ కింద గోతులు తవ్వేసి పైన చెరుకు కట్టలను పరిచి మనల్ని మోసపరిచి ఆ గోతిలో పడే విధంగా చేస్తారు. తర్వాత మనలను బంధించి పట్టుకుపోతారు. అందువలన నీవు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. ఒక దినము బింగో తన ఫ్రెండ్స్ తో జాలీగా ఆడుకుంటున్నప్పుడు దూరంలో ఎక్కువ చెరుకు కట్టలు కట్టి అమర్చబడి ఉంది. ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే బింగోకు చెరుకు తినాలి అని ఆశ కలిగింది. స్నేహితులతో చెప్పకుండా ఒంటరిగా నడవడం ప్రారంభించింది. పిల్లలు మీరు అమ్మా నాన్నకు చెప్పకుండా ఎక్కడికి ఒంటరిగా వెళ్లకూడదు ఎందుకంటే ప్రమాదాలు జరుగుతాయి. తెలియని వారు చాక్లెట్స్ ఇస్తే తీసుకోకూడదు. ఒంటరిగా పిలిచి మాట్లాడితే వెళ్ళకూడదు. సరే ఈ బింగోకు ఏమైందో తెలుసా? చెరుకు కట్టల దగ్గరికి వెళ్లి చూస్తున్న బింగో చాలా సంతోషంగా ఉంది. ఈ దినము తనివి తీరా చెరుకు తినాలి అని ఆలోచిస్తూ తినడం ప్రారంభించింది. హఠాత్తుగా అక్కడ ఉన్న గోతులో పడిపోయింది. బింగోకు తల్లి చెప్పిన విధముగానే అక్కడ గోతులు తవ్వి దానిపైన చెరుకును పరిచి ఉంచారు కాబట్టి ఆ గోతిలో పడిపోయింది. సర్కస్ వాడు వచ్చాడు మంచి వేట మనకు దొరికింది అని తన బండిపై ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. బింగోకు చాలా ఏడుపు వచ్చింది. మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియని భయం అమ్మ చెప్పిన మాట వినకుండా ఫ్రెండ్స్ ని విడిచిపెట్టి ఒంటరిగా వచ్చి ఇలా దొరికిపోయామే అని బాధపడింది. సర్కస్ వాడు సంకెళ్లతో బంధించి చాలా కార్యాలు నేర్పించాడు. అడవిలో స్వతంత్రంగా జీవించిన బింగో సర్కస్ వాడికి బానిస అయిపోయిన విధానాన్ని ఆలోచించి చాలా దుఃఖపడింది. 

 

ఏంటి పిల్లలు బింగో పరిస్థితి చూస్తే కష్టంగా ఉంది కదూ తల్లికి లోబడని బింగో సర్కస్ వాడికి బానిస అయిపోయినట్లు యేసయ్య మాట వినని వారు సాతానుకు బానిస అయిపోయి చాలా బాధలు పడతారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. 

- సహోదరి. బ్యులా గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al matbet matbet giriş grandpashabet hepsibet hepsibet giriş betnano betnano giriş betparibu betparibu giriş