By Village Missionary Movement
Wednesday, 27-Sep-2023దిన ధ్యానము(Telugu) 27.09.2023
అంశం: ఎవరు ఉజ్జీవ సైనికుడు?
"ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను" - ఫిలిప్పీయులకు 3:11
భారతదేశం యొక్క ఉజ్జీవము కొరకు దేవుడు ఎలాంటి వారిని వెతుకుతూ ఉన్నారు అనేదాన్ని చూద్దామా?
1. ప్రార్థన వాళ్లకు ప్రాముఖ్యమైన పనిగా ఉండాలి.
2. ఆత్మల రక్షణ వాళ్లకు గురిగా ఉండాలి.
3. దేవుని సన్నిదే వాళ్లకు సంతోషంగా ఉండాలి.
4. దేవుని పరిచర్య కొరకు భారము కలిగి ఉండాలి.
5. కఠినమైన ప్రయాస వాళ్లకు ప్రియమైనదిగా ఉండాలి.
6. దేవుని కొరకు పడుతున్న శ్రమలు వాళ్లకు సంతోషంగా ఉండాలి.
7. లోకం వాళ్లకు అరణ్యం వలే ఉండాలి.
8. సుఖవంతమైన జీవితం వాళ్లకు చెత్తగా ఉండాలి.
9. నిజాయితీ వాళ్లతో పుట్టినట్టుగా ఉండాలి.
10. వేషధారణ వాళ్లకు అసహ్యంగా ఉండాలి.
11. పాపము వాళ్లకు చేదుగా ఉండాలి.
12. క్షమించే స్వభావము వాళ్ల యొక్క స్నేహితుడు వలే ఉండాలి.
13 . దేవుని వాక్యం వాళ్లకు ఆహారం వలే ఉండాలి.
14. ధనాపేక్ష వాళ్లకు శత్రువు వలే ఉండాలి.
15. కులబేధములు వాళ్లకు వాంతులు పుట్టించే విధంగా ఉండాలి.
16. ప్రేమ వాళ్ళ జీవితంలో జీవపు ఊట వలె ఉండాలి.
17. ఆత్మభిషేకము వాళ్ల కోరిక అయి ఉండాలి.
18. ప్రసంగించుటలో వాళ్లు పౌలు వలె ఉండాలి.
19. ఉపవాసము వాళ్లకు ప్రాణ స్నేహితుని వలే ఉండాలి.
20. దేవుని చిత్తము చేయుట వాళ్లకు విందు వలే ఉండాలి.
21. పరిశుద్ధత వాళ్లకు అలంకరణగా ఉండాలి.
22. పరలోకమే వాళ్ళ యొక్క ఆస్తిగా ఉండాలి.
ఆఖరిగా నరకాన్ని వనికింపజేసి, పాతాళమును బెదిరింపజేసి, పరలోకాన్ని పరవశపరిచి పరమందున్న దేవుణ్ణి కొనియాడుతూ దేశాన్ని దేవుని వైపు త్రిప్పు వాడే ఉజ్జీవపు సైనికుడు. ఉజ్జీవపు సైనికుడు మాటలు కంటే ప్రార్ధన అధికమై ఉంటుంది. వాదన కంటే ఇతరుల యొక్క ప్రేరేపణ ఎక్కువై ఉంటుంది. ప్రణాళికలు కంటే ప్రయాస ఎక్కువగా ఉంటుంది. ఉజ్జీవపు సైనికుడు అగ్గిపెట్టెలో గల ఒక పుల్లే కానీ వాడు వెలిగించేది పొయ్యని కాదు గాని వాములను.
- సెలెక్టెడ్
ప్రార్థన అంశం-
మన పత్రిక పరిచర్య ప్రతిదానిలోనూ దేవుని హస్తము తోడు ఉండేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250