Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.09.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 24-Sep-2023

దిన ధ్యానము(Telugu) 24.09.2023 (Kids Special)

 

అంశం: మోహన్ యొక్క మారుమనస్సు

 

ప్రత్యేకంగా చిన్నపిల్లల కొరకు

 

"మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే" - ఎఫెసీయులకు 2:8

 

హలో పిల్లలు ఎలా ఉన్నారు? పరీక్షలు వస్తున్నాయి కదా చక్కగా చదవండి సరేనా! చదివేటప్పుడు చదువులో టీచర్లకు లోబడుటలో, పరీక్షలు రాయుటలో మీ సమస్త కార్యములోనూ నిజాయితీగా ఉండాలి సరేనా. మీ నిజాయితీని చూచి యేసయ్య మిమ్మల్ని దీవిస్తూ హెచ్చిస్తారు. సరే కథ విందామా? 

 

మోహన్ తల్లికి ముద్దుబిడ్డ. ఆయన అడిగినవన్నీ కూడా తల్లి కొని ఇచ్చేది కాబట్టి చిన్నప్రాయం నుండే అమ్మను మోసగించి అనేక కార్యాలను చేసేవాడు. మోహన్ ఎదుగుతూ స్కూల్ కి వెళ్లడం ప్రారంభించాడు. స్కూల్లో పెన్ను, పెన్సిల్, రబ్బరు ఇలాంటివి దొంగతనం చేస్తూ వచ్చేవాడు. ఐదో తరగతికి వచ్చాడు. ఇతరుల బ్యాగుల నుండి డబ్బులు తీసుకొని తాను కోరుకున్న తినుబండారాలను కొనుక్కునేవాడు. అమ్మ అడిగితే దొంగతనాన్ని దాచుటకు అబద్దాలు చెప్పేవాడు. ఎనిమిదో తరగతికి వచ్చేటప్పుడు చాలా చెడ్డ స్నేహితులు ఆయనకు దొరికారు. వారి ముందు గొప్పగా ఉండుటకు ఇంటిలో నుండి 50 రూపాయలు 100 రూపాయలు తీయడం ప్రారంభించాడు. అమ్మ కనిపెట్టి అడిగితే అమ్మను తిట్టి గొడవపడేవాడు. స్కూల్ కి సరిగా వెళ్ళేవాడు కాదు. ఆయన ఎదుగుతున్న కొలది చెడ్డ అలవాట్లు కూడా ఆయనతోపాటు ఎదిగాయి. ఆయనను బాగు చేయుటకు అమ్మ ఎంత ప్రయత్నం చేసినా అపజయం పాలైంది. 

 

11వ తరగతి చదివేటప్పుడు మోహన్ దొంగల ముఠాతో కలిసి సెల్ఫోన్ దొంగతనం చేయడము దాన్ని అమ్మడం ప్రారంభించాడు. ఒక దినము ఆ ముఠా మోహన్ ని పోలీసులుకు అప్పగించి వాళ్ళు తప్పించుకున్నారు. మోహన్ చెరసాలకు వెళ్ళాడు. అక్కడ దెబ్బలు, ఆకలి అని అనేక విషయాల్లో బాధపడ్డాడు. చదువుని కొనసాగించలేకపోయానే అని యవ్వనప్రాయములో నా పేరు చెడిపోయిందే అని నా భవిష్యత్తు ఏమైపోతుందో అని చింతించాడు. జైల్లో నాలుగు గోడల మధ్యన ఒంటరిగా కన్నీరు కారుస్తూ ఎవరైనా నన్ను చూడ్డానికి వస్తారా అని బాధపడేవాడు. ఆ దినమే మోహన్ యొక్క తల్లి ఒక బోధకుడిని తీసుకొచ్చింది. తల్లి కన్నీరుని చూశాడు చదువు లేని తల్లిని ఎన్నిసార్లు మోసగించానో అని మనసులో బాధపడ్డాడు. బోధకుడు యేసుప్రభువు గురించి ఆయన ఇచ్చే పాప క్షమాపణ, రక్షణ గురించి మాట్లాడారు. దేవుడు మోహన్ యొక్క హృదయాన్ని తెరిచారు. కొన్ని దినాల్లోనే జైలు నుంచి విడుదల పొంది మంచి మనిషిగా మారాడు. 

 

 ప్రియా తమ్ముడు చెల్లి మోహన్ అన్నయ్య వలె చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉన్నావా? నీవు చేసిన దొంగతనములో పట్టుబడలేదు కాబట్టి ధైర్యంగా ఉన్నావా? ఒక దినము తప్పు చేస్తే నీవు కూడా పట్టబడతావు. ఈ దినమే మారు మనసు పొంది నీ దొంగతనాన్ని, అబద్ధాన్ని, చెడు మాటలు మాట్లాడిన, కాపీ కొట్టుట అన్ని కార్యాలు విడిచిపెట్టు. దీన్ని నీ చిన్నతనం నుండి విడిచిపెట్టిన యెడల నీ జీవితం దీవెనకరంగా మారుతుంది. లేనియెడల నీకున్న మంచి పేరు కోల్పోతావ్ కాబట్టి ఈ దినమే ఒక మంచి నిర్ణయం తీసుకో సరేనా! 

- సిస్టర్. దేబోరా గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al