Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.09.2023
Share:

By Village Missionary Movement

Friday, 22-Sep-2023

దిన ధ్యానము(Telugu) 22.09.2023

 

అంశం: తప్పించుకొనుటకు వేగిరిపడుము

 

"యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి" - యెషయా 55:6

 

ఒక కోళ్ల దుకాణంలో అనేక కోళ్లు ఇనుప గూళ్ళలో మూయబడి ఉన్నాయి. ఆ గుళ్ళలో గల కోడి మరియు పుంజు రెండు సంతోషముగా అరుస్తూ ఉన్నాయి. తన యజమానుడైన షాపు వాడు తన కళ్ళ ఎదుట తను పెంచుతున్న కోళ్లను చంపి తన కస్టమర్లకు మాంసముగా ఇచ్చుట తమ సొంత కళ్ళతో అవి చూస్తున్నాయి. మరియొక కోడిని మరిగించిన నీటిలో ముంచి దాని వెంట్రుకలను తీసి దాన్ని కూడా చంపి కస్టమర్లకు ఇస్తున్నాడు. ఇలాంటి సంఘటనలను తనకు కూడా జరగబోతుంది అని ఆ కోడి, కోడిపుంజు ఎరిగియున్నాను ఎంత మాత్రమూ చింత లేకుండా ఆనందంగా ఉన్నాయి. 

 

ఈ కోళ్లు మనకు ఒక లోతైన సత్యాన్ని చెబుతూ ఉన్నాయి. ఈ లోకంలో జీవించే మనిషి తన కళ్ళు ఎదుట అనేక రకములన మరణాలు చూస్తూ తనను ప్రేమించిన వారు ప్రియమైన వారు మరణించడం చూసినప్పటికీ దాని గురించి ఎంత మాత్రం చింతించకుండా తాము మాత్రము మరణించము అనే ఆలోచనలో జీవిస్తూ ఉన్నారు. 

 

సాతానుడు తమ ఆత్మను పతనము చేయుటకు వేస్తున్న ప్రణాళిక యొక్క మరణ ఘోషను గ్రహించని వాడిగా కోళ్ల దుకాణంలో అరుస్తూ ఉన్న ఆ కోడి మరియు కోడిపుంజు వలె సంతోషంతో తమ తలను పైకెత్తి కేక వేస్తూ ఉన్నాడు మనిషి. 

 

దీన్ని చదువుతున్న ప్రియమైన వారలారా! సృష్టికర్తను దేవుని దర్శించుటకు మన కన్నులను మూసినప్పుడు మన ఆత్మ ప్రియమైన దేవుని వద్దకు దర్శించుటకు ఆయనతో కూడా పరలోకంలో నిత్యము సంతోషముగా ఆనందించుటకు దేవుని మాటల హెచ్చరికతో మన జీవితమును పాటించాలి అలా చేయుటకు మనల్ని సమర్పించుకుందాం. బైబిల్లో కూడా మీకు కలిగిన ఈ దినములోనైనా మీకు సమాధానకరమైన కార్యములను గ్రహించిన యెడల నీకు మేలు అని ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్నారు కదా కాబట్టి ఈ వాక్యాన్ని గుర్తుంచుకుందాం వచ్చే ప్రమాదమును తప్పించుకొనుటకు శ్రద్ధ కలిగి ఉందాం.

- శ్రీమతి సెల్వ బెంజిమెన్ గారు 

 

ప్రార్థన అంశం:

గ్రామాల్లో దేవుని మందిరములు కట్టబడుటకు ముందుకు వచ్చిన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet giriş bets10 extrabet royalbet süperbetin jojobet padişahbet holiganbet betcio romabet giriş romabet queenbet bahiscasino markajbet bahiscasino atlasbet casibom matbet matbet giriş