By Village Missionary Movement
Tuesday, 19-Sep-2023దిన ధ్యానము(Telugu) 20.09.2023
అంశం: ప్రయాస పడుతున్న రూపవతి
"చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు" - ప్రసంగి 9:10
ధనము, ప్రఖ్యాతి, గర్వముతో నిండిన ఈ ప్రపంచం చాలా పెద్దది. వీటిని చూచి ఈ మత్తులో మునిగిపోయిన వారు అనేకులు. ఈ మధ్యలో పోరాటాలు, నిందలు, అవమానాలలో నిరుత్సాపడిపోయి ఎటువైపు వెళుతున్నామో తెలియక నిలబడుతున్న స్త్రీలు అనేకులు. వాళ్ల మధ్యలో మీరు సంపూర్ణమైన రూపవతిగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే దీనిని చదవండి.
ఆదికాండము 24 అధ్యాయంలో రిబ్కా అనే స్త్రీ గురించి రాయబడి ఉంది. ఆ స్త్రీ రూపవతి గాను కన్యక గాను ఉండేది. ఆమె నీటి బావిలోనికి దిగి తన బిందెను నింపుకొని పైకి వచ్చింది. ఈ రిబ్కా అబ్రహం యొక్క పనివాడికి మారుమాట చెప్పకుండా తన దగ్గర ఉన్న బిందెను దించి ఆ పనివారికిని వారి యొక్క ఒంటెలకు నీళ్లు ఇచ్చి దాహం తీర్చింది. ఆ స్థలములో రిబ్కా చాలా చురుకుగా పనిచేసింది. పనివాళ్లే కదా అని తన మనసులో అశ్రద్ధ చేయకుండా వాళ్లతో మాట్లాడి వాళ్లకు ఉపచారం చేసింది. వీటి నుండి రిబ్కా యొక్క సద్గుణములను మనము నేర్చుకోవచ్చు. పని వాళ్ళ యొక్క ప్రశ్నలకు రిబ్కా జవాబు తగ్గించుకుని ఇచ్చేది. ఈ దినపు యవ్వన స్త్రీలు అందరికీ సవాలుగా రిబ్కా ఉంటుంది. దీనిని చదువుతున్న మీరు యవ్వన స్త్రీగా ఉండి ఉండవచ్చు. నేను ఎక్కువగా చదువుకున్నాను, నా చదువుకు తగ్గట్టు పని దొరకలేదు కాబట్టి నేను ఇంట్లో ఉన్నాను అని చెబుతున్నారా? చింతించవద్దు మీ చదువుకు తగ్గట్టు పని దొరకకపోయినా దొరికిన ఏ పనినైనా దాంట్లో పనిచేయండి. తగిన సమయం వచ్చే వరకు దేవుని యొక్క చిత్తము కొరకు వేచి ఉండండి. మన జీవితంలో ప్రభువుకు లోబడి ఉండటం వలన రిబ్కా జీవితాన్ని మార్చిన దేవుడు మన జీవితాన్ని కూడా దీవెనకరంగా మార్చుట ఖచ్చితం. కాబట్టి మీ జీవితాన్ని కూడా ఆయన మార్చగలరు.
- శ్రీమతి. గ్రేస్ జీవమణి గారు
ప్రార్థనా అంశం:-
ఆమెన్ విలేజ్ టీవీలో వాక్యాలు చెబుతున్న చిన్నారుల కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250