Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.09.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 17-Sep-2023

దిన ధ్యానము(Telugu) 17.09.2023 (Kids Special)

 

అంశం: సుందరమైన ఆశ

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు

 

"అపహాసకులను ఆయన అపహసించును దీనునియెడల ఆయన దయ చూపును" - సామెతలు 3:34

 

12వ తరగతి చదువుతున్న ఆశ ఆమె చాలా అందంగా ఉండేది. ఆమె ధనవంతురాలు కూడా. క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ పేరు కొరకు మాత్రమే క్రైస్తవునిల జీవించింది. ఆశ ఎదుగుతున్న కొలది అందము కూడా ఎక్కువైంది. మరియు తాను ఒక అందగత్తెను అనే గర్వము ఎదుగుద వచ్చింది. తనతో చదువుతున్న ఇతర విద్యార్థులకంటే నేను అందంగా ఉన్నానా అని తరచూ అందరిని అడుగుతూ ఉండేది. వారు కూడా ఈమెకు తగినట్టుగా మాట్లాడుతుండేవారు. కారణం ఆమె తరుచుగా చాక్లెట్, పెన్ను, పెన్సిల్ ఏదో ఒకటి వాళ్లకి ఇస్తూ ఉండేది. ఈ ఆశ అయితే పేదవాళ్లును గాని నల్లగా ఉండేవారిని గానీ అస్సలు నచ్చదు. వాళ్లను చూస్తే హేళనగా మాట్లాడేది. ఈమె యొక్క తల్లిదండ్రులు ఎంత నచ్చచెప్పిన ఆమె వినేది కాదు. 

 

ఒక దినం ఆశ ల్యాబ్ లో జరుగుతున్న సైన్స్ క్లాస్ కి వెళ్ళింది. అక్కడ ఆమె టెస్ట్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా ఆశ యొక్క టెస్ట్ ట్యూబ్ పేలింది. చాలా భయంకరం. దాంట్లో ఒక గల యాసిడ్ ఆమె ముఖము పైన పడి ముఖము మీద అక్కడక్కడ పొంగిపోయింది. వెంటనే ఆమెను హాస్పిటల్కు తీసుకుని వెళ్లారు. ఆమె రెండు రోజులు హాస్పిటల్ ఉండి మరల ఇంటికి వచ్చింది. ఇంట్లో అద్దం ముందు నిలబడి తన మొఖాన్ని చూసుకుంది. అందగత్తెగా ఉన్న ఆశ ఇప్పుడు చాలా భయంకరమైన పరిస్థితికి వచ్చింది. ఆమె దానిని తట్టుకోలేకపోయింది. తర్వాత బడికి వెళ్లింది. మొదటిరోజు ఆమెను చూసి బాధపడిన కొందరు కొన్ని దినాల తర్వాత ఆమెకు దూరమయ్యారు. ఆమెను నీవు అందగత్తె అని మునుపు చెప్పిన వారు కూడా ఇప్పుడు లెక్క చేయలేదు. ఆశ యొక్క హృదయము పగిలిపోయింది. అప్పుడే ఆశ తాను హేళనగా మాట్లాడిన మాటలు పేద విద్యార్థులను ఎంతగా బాధపెట్టి ఉంటుందో ఆలోచించింది. తన తప్పిదమును గ్రహించి యేసుప్రభు దగ్గర క్షమాపణ అడిగి ప్రార్థించడం ప్రారంభించింది. ఆ దినము నుండి ఆమెలో ఒక మార్పు వచ్చింది. మంచి బిడ్డగా జీవించడం ప్రారంభించింది. 

 

 ప్రియ తమ్ముడు చెల్లి నీవు కూడా ఈ ఆశ వలె గర్వంగా ఉంటున్నావా? అలాగ ఉండిన యెడల దానిని ఈ దినమే విడిచి తగ్గింపు గల గుణముతో యేసయ్యను అడుగు. సరైన పిల్లలు బాయ్! 

- శ్రీమతి. సారాల్ సుభాష్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al