Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.09.2023
Share:

By Village Missionary Movement

Friday, 15-Sep-2023

దిన ధ్యానము(Telugu) 16.09.2023

 

అంశం: బ్యాటరీ లో

 

"నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది" - కీర్తనలు 94:19

 

ఇప్పుడు అందరికీ దగ్గరగా ఆత్మీయ బంధువులుగా ఉండి సహాయపడుతున్నది సెల్ఫోన్. ఇంట్లో ప్రతి ఒక్కరికి విడివిడిగా ప్లేట్, గ్లాస్ ఉన్నట్లు ప్రతి ఒక్కరికి విడివిడిగా సెల్ ఫోన్ కూడా పెట్టుకొని ఉన్నారు. దీనిని రోజు చార్జింగ్ పెట్టుకుని చార్జింగ్ తక్కువ కాకుండా చూసుకుంటున్నాం. ఎందుకంటే బ్యాటరీ తగ్గిపోయిన యెడల తొందరగా స్విచ్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి దానిని వాడలేము. రోజు ఇలా స్విచ్ ఆఫ్ అయ్యి మరల చార్జింగ్ పెడుతూ ఉండే తొందరగా బ్యాటరీ పాడై పోతుంది. 

 

ఇలా కొన్ని వేల రూపాయలు ఖర్చుపెట్టి దుకాణంలో కొంటున్న ఈ ఫోన్కు లేదా బ్యాటరీ పట్ల ఇంత శ్రద్ధ చూపిస్తున్నాం కానీ దుకాణంలో దొరకని వెలకట్ట లెని దానికి చార్జింగ్ పెట్టడం రోజు మర్చిపోతున్నాం. అది అందరికీ ఇవ్వబడినది. అది ఏమిటి అని ఆలోచిస్తున్నారా? అదే దేవుడు మనకు ఇచ్చిన ఆత్మ. దానిని రోజు చార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోతున్నాం. దానికి చార్జింగ్ పెట్టకపోతే బలహీనమై చిన్న చిన్న కార్యాలలో కూడ నిరుత్సాహం పొందితే అది మన జీవితాన్ని చీకటిగా చేసేస్తుంది. దీనిని చార్జ్ చేయడం అంటె రోజు బైబిల్ చదవాలి మరియు ప్రార్థించాలి. మనము దేవునికి దగ్గర అవ్వాలి అంటే చార్జింగ్ చాలా అవసరం. యధావిధి క్రమమైన ప్రార్థన గైకొనిన యెడల ఆత్మ బలము పొందుకుంటుంది. అప్పుడు మనము దేవునికి, ప్రజలకు ప్రయోజనకరంగా జీవించగలం. ఫోన్లో చార్జింగ్ అయిపోయినప్పుడల్లా ఎలా ఛార్జింగ్ చేస్తున్నాము అలానే ఆత్మకు కూడా చార్జింగ్ అవసరం. ఇశ్రాయేలు ప్రజలు ఆత్మలో చిన్న చిన్న కార్యములు కొరకు సనుగు గొని కానానును కోల్పోయారు. యెహోషువ కాలేబు దీనిని అధిగమించి దేవుడు చేసిన కార్యాలను తలంచి తమను చార్జింగ్ చేసుకున్నందున విశ్వాసం ద్వారా కానానుకు చేరుకున్నారు. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! ఆత్మ మిక్కిలి విలువ కలిగినది దానిని మిక్కిలి శ్రద్ధగా చూసుకోవాలి. చింత, నిరుత్సాహము కొద్దిగా వచ్చినప్పుడే గమనించండి లేనియెడల బ్యాటరీ లో అయ్యి తర్వాత చీకటిమయం అయిపోతుంది. తరువాత చింత, కన్నీరు ఇవన్నీ మనలను అధిగమిస్తాయి. ఇందుకు సులువుగా రోజు ఉదయాన్నే బైబిల్ చదివి ప్రార్థించి చార్జింగ్ అవ్వాలి. చార్జింగ్ అయినప్పటికీ మధ్యలో చింతలు, నిరుత్సాహాలు వచ్చినప్పటికీ మరల ప్రార్థించి ఆయన చేతులకు అప్పగించండి. అప్పుడు మన జీవితంలో ఒక వెలుగు కలుగుతుంది. 

- శ్రీమతి. అంబు జ్యోతి స్టాలిన్ గారు 

 

ప్రార్థన అంశం:

కన్వీనియేకెల్ కార్యక్రమం ద్వారా దర్శించబడుతున్న యవ్వనస్తులు దేవునియందు నిలిచి ఉండేటట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al