Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.09.2023
Share:

By Village Missionary Movement

Friday, 15-Sep-2023

దిన ధ్యానము(Telugu) 15.09.2023

 

అంశం: సమస్తము మేలుకొరకే

 

"దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము" - రోమీయులకు 8:28

 

దోనావుర్ అనే ఊరిలో ఉన్న హోమ్స్ కు తల్లిగా ఉండి అనేకమంది అనాధ చిన్నారులను ఆదరించి వచ్చిన ఏమీ కార్మికేల్ తల్లి గారిని మనము మర్చిపోలేము. ఆమె చిన్నతనములో ఉన్నప్పుడు ఆమె చింత అంత ఏమిటో తెలుసా? సాధారణంగా ఆ దేశంలో జన్మించిన పిల్లలందరికీ కళ్ళు నీలం రంగులో కనబడతాయి కానీ ఆమెకు మాత్రం కనులు నలుపు రంగులో ఉండేవి అదే ఆమె చింత అంతా. కాబట్టి రాత్రి మంచం దగ్గర మోకరించి యేసయ్య నేను ఉదయాన లేచేటప్పటికి నా కనులు నీలం రంగులో మారిపోవాలి ప్లీజ్ యేసయ్య అని దృఢంగా ప్రార్థన చేసి నిద్రపోయారు. ఉదయం లేచిన వెంటనే వేగముగా అద్దం ముందుకు వెళ్లి తన కంటిని బాగా తెరిచి చూసింది కానీ అందులో ఏమాత్రం మార్పు లేదు. అలాగైతే యేసయ్య నా ప్రార్థన ఆలకించలేదా అని మనసులో బాధపడిన ఆ చిన్నారి చాలా దుఃఖించింది.  

 

సంవత్సరాలు గడిచాయి. ప్రభువు ఏమి కార్మికేల్ ను పరిచర్యకు పిలిచారు. ఆమె కూడా తనను సమర్పించుకొని తాను వెళ్ళవలసిన దేశాన్ని చూపించమని దేవుని నడిపింపు కొరకు వేచి ఉన్నప్పుడు ప్రభువు ఆమెకు భారతదేశం చూపించారు. దేవుని మాటకు లోబడి భారతదేశం వచ్చిన ఆమె తమిళనాడులో గల దోనావుర్ లో పరిచర్య ప్రారంభించారు. అప్పుడే ఆమెకు అర్థమైంది భారతీయుల యొక్క కనులు తమ యొక్క కన్ను వలె నలుపుగా కనబడుతుంది అని. నేను భారతీయుల మధ్యలో ఉండాలి అన్నదే దేవుని చిత్తం అన్నది గ్రహించుకున్నారు. ఏమీ కార్మికేల్ పసిప్రాయంలో అతి కష్టమైన పరిస్థితిలో సమస్తాన్ని దేవుడు మేలుకొరకే నడిపిస్తున్నారని గ్రహించి దేవుని మహిమ పరిచారు. 

 

ఈ దినము కూడా మనము మన జీవితంలో ఇన్ని శ్రమలా? ఈ శ్రమలు నన్ను విడిచిపోతే బాగున్ను అని బాధపడుతున్నాం. ఎందుకు నాకు మాత్రం దేవుడు దీనిని అనుమతించారు అని చెప్పి అనేక ప్రశ్నలు వేస్తున్నాం. కానీ మనం చేయవలసిందేమిటో తెలుసా? దేవుని యొక్క పాదముల చెంత కూర్చొని ప్రభువా నీ చిత్తాన్ని చేయుటకు నన్ను సమర్పించుకుంటున్నాను అని చెప్పి మనల్ని మనం సమర్పించుకొవాలి. ఈ దినము చదివిన లేఖన భాగంలో పుట్టుకతోనే గుడ్డివాడిగా ఉన్న వ్యక్తిని చూసి ఈ నా స్థితిలో ఉండుటకు గల కారణము ఎవరు చేసిన నేరము అని శిష్యులు అడుగుతున్నారు. యేసుక్రీస్తు అయితే ఈమె చేసిన నేరము కాదు ఈయన తల్లిదండ్రులు చేసిన నేరము కాదు గాని నా మహిమ బయలుపరచుటకే దీనిని అనుమతించాను అని చెప్పారు. అవును మనము పుట్టడాని కంటే ముందే మనము ఏమి కాబోతున్నాము అనేదాన్ని దేవుడు ముందే ఎరిగి ఉన్నారు. అందుకే మన జీవితంలో ప్రతి ఒక్క కార్యాన్ని అనుభవించాలి. మనము ఆయన కొరకు వాడబడ్డానికి మనల్ని సమర్పించేటప్పుడు మన ద్వారా అనేకులను ఆయన రాజ్యంలోనికి నడిపిస్తారు. ఆమెన్! 

- శ్రీమతి. దవమణి వైరవెల్ గారు 

 

ప్రార్థన అంశం: 

ఆమెన్ విలేజ్ టీవీ ఛానల్ శాటిలైట్ ఛానల్ గా మార్చుటకు ప్రార్థన చేద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet