Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.09.2023
Share:

By Village Missionary Movement

Thursday, 14-Sep-2023

దిన ధ్యానము(Telugu) 14.09.2023

 

అంశం: విధేయత

 

"బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు" - సామెతలు 22:6

 

సాధారణమైన కుటుంబంలో జన్మించిన ఒక స్త్రీ రాణి వలె ఎలా మారింది అనేది చూద్దాం. యెరుషలేము నుండి ఖైదీగా పట్టుబడి గుంపులో ఉండిన ఈ అందమైన స్త్రీయే ఎస్తేరు. ఎస్తేరు గురించి చెప్పాలి అంటే ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేదు. అనాదిగా విడవబడిన పరిస్థితి అలాంటి పరిస్థితుల్లోనే మొర్దెకై అనే తన యొక్క బంధువు తనను దత్తత తీసుకున్నాడు. ఎస్తేరు మహారాణిగా సిద్ధపరచుటలో ఆయన చూపించిన పనితనము ఆయన బాధ్యత ఎంతో గొప్పది. రాజు యొక్క ప్రధాని హేగే చేతుల్లో ఆమెను అప్పగించినప్పుడు ఆమె తీసుకున్న ప్రయాస చాలా గొప్పది. స్త్రీలను కాపాడవలసిన బాధ్యతను ఆయన తీసుకున్నారు. మంచి అందము చేత నింపబడిన ఎస్తేరు తగిన వ్యక్తి దగ్గరకు చేర్చబడాలి అంటే దానికి మొర్దెకై బాధ్యత వహించాడు. ఎస్తేరు మొర్దెకై వద్దకు వచ్చినప్పుడు ఆయన మాట విని ఆయనకు లోబడి వచ్చింది. అలానే కోటలో హేగే చేతిలో ఉన్నప్పుడు కూడా ఆయన మాట ప్రకారం లోబడి నడిచింది. ఆ కన్యకలను స్త్రీలను సంరక్షించే స్థానంలో ఈమె ఏమి అడిగిందో అన్ని ఇవ్వడానికి సిద్ధమై ఉన్నారు. అయినప్పటికీ హేగే నియమించినవి తప్ప మరి ఏమీ అడగలేదు. 

 

ఈనాడు యవ్వన స్త్రీలు లిప్స్టిక్లు, మేకప్ లు, కంటికి రంగులు, నెయిల్ పాలిష్లు అలంకరణతో కూడిన బట్టలు, ఆభరణాలు అని ఎక్కువగా ఆశించడం ఇలాంటి మనస్తత్వం కలిగిన యవ్వన స్త్రీల మధ్యలో తనకు అనుభవించుటకు సమస్త కార్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఎస్టేరు వేరుపరచబడిన జీవితము జీవించింది. కారణము మొర్దెకై యొక్క పెంపకమే. 

 

ప్రియమైన వారలారా బైబిల్ ఇలా హెచ్చరిస్తుంది. అందము వ్యర్థము యెహోవాకు భయపడుతున్న స్త్రీయే కొనియాడబడుతుంది. ఈ వాక్యము ఎంత యదార్థమైనది. ప్రియమైన యవ్వన సహోదరి సహోదరులారా లోబడి సమర్పించి జీవించడం నేర్చుకుందాం. తల్లిదండ్రులారా మీరు కూడా మీ పిల్లలను సరైన మార్గం నడిపించుటకు బాధ్యులై ఉన్నారు. లోకకార్యంలో ఎదురీత వేసిన ఎస్తేరు, దేబోరా, యెహోషువ, డానియేలు వలె దేవుని కొరకు జీవించుటకు మీ పిల్లలను దేవుని కొరకు సమర్పించండి. 

- శ్రీమతి. రూబీ అరుణ్ గారు 

 

ప్రార్థన అంశం: 

మన ప్రార్థన అంశములకు ప్రార్ధన చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన యోధులను దేవుడు దీవించు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al