By Village Missionary Movement
Wednesday, 13-Sep-2023దిన ధ్యానము(Telugu) 13.09.2023
అంశం: జీవముగల మాట
"ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది" - హెబ్రీయులకు 4:12
ప్రసిద్ధిగాంచిన దేవుని సేవకులు జాన్ వెస్లీ ఒకసారి మధ్య రాత్రిలో గుర్రంపై వెళ్తున్నప్పుడు ఒక గంభీరమైన స్వరము ఆపు అని చెప్పటం విన్నారు. గుర్రమును ఆపినప్పుడు అతని ఎదురుగా ఒక దొంగ. ఆయన డబ్బు ఇవ్వకపోతే ప్రాణము తీసేస్తాను అని కత్తి చూపించి బెదిరించాడు. వెస్లీ తన చేతుల్లో గల డబ్బు ఇచ్చారు అతని వద్ద ఎక్కడైనా డబ్బులు ఉండి ఉంటాయి అని ఆయన గుర్రము దగ్గర వెతికేటప్పుడు ఒక పుస్తకాన్ని చూచి నిరుత్సాపడి మరలా తిరిగి పరిగెత్తడం ప్రారంభించారు. వెంటనే వెస్లీ ఆ దొంగను చూసి ఆగము నీకు ఇచ్చుటకు నా యొద్ద ఒకటి ఉన్నది అని చెప్పాడు. వెస్లీ క్రీస్తు ప్రేమతో నిండిన వాడై అతని వద్ద యొద్ద యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నిన్ను పవిత్రంగా చేస్తుందని చెప్పారు. కొన్ని సంవత్సరాల తర్వాత వెస్లీ ఒక సాయంకాలం ఆరాధన కూడికను ముగించుకొని వస్తున్న సమయంలో ఒక మనిషి అతనితో ఎలాగైనా మాట్లాడాలి అని వేచి ఉన్నారు. అవకాశం దొరికినప్పుడు ఆయన ఆ దినము మీ దగ్గర దొంగతనం చేసిన దొంగను నేనే. ఇప్పుడు నేను ఒక వ్యాపారవేత్త అని అన్నిటికంటే పైగా నేను దేవుని రక్తములో కడగబడినవాడును అని చెప్పాడు. అయ్యా మీరు మాత్రము ఆ దినము ఆ మాటలు చెప్పకుండా ఉండని యెడల నేను ఇంకను దొంగగా ఉండిపోయేవాడిని అని ప్రేమతో చెప్పాడు.
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది"
అవును ప్రియమైన వారలారా దేవుని మాటలను మనము వీలైనంతవరకు ఇతరులకు చెప్పాలి. దేవుని మాటలు ఇతరులకు చెప్పేటప్పుడు జ్ఞానంతో చెప్పాలి. ఎందుకు అంటే దేవుని మాటలు జీవము కలిగిన మాటలు అవి ఎలాంటి వ్యక్తినైన ఆకర్షించగలవు. అది మాత్రమే కాదు వాళ్ళ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మార్చి వేయగలవు. కాబట్టి మనము చెప్పవలసిన వారికి దేవుని మాటలను దేవుని జ్ఞానముతో ప్రార్థించి చెబుదాం. దేవుడు కచ్చితంగా వారి జీవితంలో పనిచేస్తారు.
- శ్రీమతి. శక్తి శంకరాజు గారు
ప్రార్థన అంశం:
మన క్యాంపస్ లో ఉన్న హాస్పిటల్ ద్వారా దర్శింపబడుతున్న ప్రజల కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250