Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.09.2023
Share:

By Village Missionary Movement

Tuesday, 12-Sep-2023

దిన ధ్యానము(Telugu) 12.09.2023

 

అంశం: దిగులు పడకుము

 

"నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును" - యెహోషువ 1:9 

 

దక్షిణ భారత దీవిలో గల క్రికెట్ జట్టులో క్లైవ్ లైవ్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఆ టీం చాలా విజయాలు సాధించింది. అది క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ జట్టు యొక్క ఆటగాల్లను క్లైవ్ ఉత్సాహపరిచి ఆట ఆడుటకు ప్రోత్సహించేవాడు. ఆయన తెలివైన నడిపింపు వలన ఆ జట్టు ఎక్కువగా విజయాన్ని సాధించింది. 

 

ఇలాగే ప్రభువు యెహోషువాతో తోడుగా ఉండి నడిపించారు. ఎన్ని అద్భుతాలు చూచినను చిన్నపాటి కొదువ వచ్చినప్పుడు సనుగుకొని వ్యతిరేకించి తిరుగుబాటు చేస్తున్న ఇశ్రాయేలు జనాంగమును ఎలా నడిపించాలి అని దిగులు పడుతూ నిలబడిన యెహోషువతో దిగులు పడకుము నేను నీతోనే ఉన్నాను అని చెప్పి దేవుడు తోడుగా ఉండి ఆశ్చర్యకరమైన రీతిగా నడిపించి దేశాన్ని వాళ్ల చేతికి ఇచ్చారు. అలాగే పౌలు కొరింతి పట్టణమునకు వచ్చినప్పుడు వ్యతిరేకముగా ప్రభుత్వం ఒకపక్క వ్యతిరేకమైన ప్రజలు మరొక పక్క ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభువు భయపడకుండా మాట్లాడుము మౌనముగా ఉండకము నేను నీకు తోడైయున్నాను అన్నారు. అదేవిధంగా పౌలు ఆ పట్టణంలో , ఒకటిన్నర సంవత్సరము ఉండి సువార్త పరిచర్య చేశారు. అది మాత్రమే కాదు అనేక ఉపద్రవాలు దెబ్బలు చెరసాల అనుభవాల మధ్యలో వెళ్లిన ధైర్యంగా సువార్త ప్రకటించారు. నేను మీతోనే ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవుడు అన్నింటిలో ఆయనకు ధైర్యాన్ని, బలాన్ని కృపను ఇచ్చి నడిపించారు. ఎందుకంటే దేవుడు మాట తప్పని వాడు. మంచి పోరాటము పోరాడితిని నా పరుగును తుద ముట్టించితిని అని 2 తిమోతి 4:7 లో మరణమును కూడా ధైర్యంగా ఎదుర్కొనుటకు ధైర్యమును దేవుడు దయ చేశారు. అందువలన ధైర్యముగా నేను క్రీస్తుని వెంబడిస్తున్నట్లు మీరు కూడా నన్ను వెంబడించుడి ఒకటవ కొరింది11: 1 అని సవాలు విసురుతున్నారు. 

 

ప్రియమైన వారులారా! మీరు కూడా పరిస్థితులను చూసి వ్యతిరేకంగా ఉన్న ప్రజలను చూసి భయపడుతూ కలత చెందుతూ ఏమి చేయాలో తోచక దిగులు పడుతూ ఉన్నారా? మిమ్మల్ని చూసి దేవుడు ఈ దినము చెబుతున్నారు దిగులు పడకుము నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి మన దేవుడు సర్వశక్తిగల దేవుడు కాబట్టి ఆయనను గట్టిగా పట్టుకొనిన యెడల దిగులు పడి నిలబడిపోయినా యెహోషువాను వాడుకున్న ప్రభువు మిమ్మల్ని కూడా కచ్చితంగా వాడుకుంటారు. పరిస్థితులను దాటి వచ్చుటకు ప్రభువు మీకు సహాయం చేస్తారు. పౌలు వలె నన్ను వెంబడించుడి అని చెప్పదగినంత మాదిరిగా మిమ్ములను నడిపిస్తారు. నేను మీతోనే ఉన్నాను అని చెప్పిన ప్రభువును పట్టుకొని ముందుకు నడవండి హెచ్చింపబడతారు. 

- బ్రదర్. శామ్యూల్ మోరిస్ గారు 

 

ప్రార్థన అంశం:

ఫీల్డ్ లో జరుగుతున్న ఇంటి ప్రార్థన కూడికల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al