Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 11.09.2023
Share:

By Village Missionary Movement

Monday, 11-Sep-2023

దిన ధ్యానము(Telugu) 11.09.2023

 

అంశం: త్యాగపూరితమైన కానుక

 

"సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును" - 2 కోరింథీయులకు 9:7

 

అడవిలో నివసించి ప్రభువుని ఎరగని ప్రజల కొరకు క్రీస్తు ప్రభువుని ప్రకటించడం కొరకు సహాయం చేసే వాళ్లకు మీ కానుకలను ఇవ్వవచ్చు అని ప్రకటన ఒక ఆలయంలో ఇవ్వబడింది. సంఘంలో ఉన్న ప్రజలు అందరు నిశ్శబ్దముగా ఉండిన పరిస్థితుల్లో ఆ దేవాలయమునకు ఒక మూలన కూర్చున్న బాగే అని ఒక చిన్నది ముందుకు వచ్చి తాను నడవడానికి సహాయపడుతున్న చేతి కర్రలు రెండిటిని ఆ కానుక పెట్టి పైన పెట్టింది. దానిని 600 డాలర్లకు వేలంపాడి ఆమెకు మరలా తిరిగి ఇచ్చారు ఆ వేలం పాడిన వ్యక్తి. దీనిని చూచిన ఇతరులకు కూడా త్యాగపూరితమైన దేవుని పని కొరకు ఇవ్వడం కొరకు ముందుకు వచ్చారు. దీని ద్వారా విన్సెంట్ ఫెరా అనే మిషనరీ 21 సంవత్సరాలుగా స్పెయిన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ అనే దేశాల్లో అనేక దేశస్థులను రక్షణ మార్గంలోనికి నడిపించారు. 

 

లూకా 21వ అధ్యాయంలో చెప్పబడిన పేద విధవరాలు తన యొద్ద ఉండిన రెండు నాణెములను కానుక పెట్టెలో వేసింది. తన వద్ద ఉన్న వాటిని తన కొరకని పెట్టుకొనకుండా దేవుని కొరకు ఇచ్చి వేసింది. తాను కలిగి ఉన్న సమస్తాన్ని ఇచ్చివేసింది అని యేసుప్రభువు అన్నారు. దేవుని యొక్క దీవెన పొందుకున్నది. 

 

ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును లూకా 6: 38 అని మనము సువార్త భాగమునకు పనికొరకు కానుక ఇచ్చేటప్పుడు సువార్త వేగవంతంగా విస్తరిస్తుంది. క్రూరమైన గుణము కలిగిన వారు సువార్త విని రక్షణ పొందుకుంటున్నారు. అవును ఒక పాపి మారుమనస్సు పొందితే పరలోకముల మిక్కిలి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ సంతోషంలో మీరు కూడా పాలి భాగస్తులు కావద్దా? 

 

ఒక గిన్నెడు చల్లటి నీళ్లు ఇచ్చిన దాని ప్రతిఫలము పొందకుండా పోరు అని బైబిల్ చెప్తుంది. మనము దేవుని కొరకు త్యాగపూరితముగా ఇచ్చినప్పుడు దేవుడు విడిచిపెడతాడా? 

 

ప్రియమైన వారలారా! ఇచ్చే కార్యంలో మన మనస్తత్వం ఎలా ఉంటుంది? ఇచ్చుటకు ఆశ కానీ నాకు అంత స్తోమత లేదే అని ఆలోచించడం తప్పు. దేవునికి అవసరత ఉన్నది అని గ్రహించి మన యొద్ద ఉన్న వాటిని ఆయన కొరకు దారాలముగా ఇద్దాం. విస్తారమైన దీవెనలు పొందుకుందాం. 

- శ్రీమతి. రోజ్ పాల్ జబస్టిన్ గారు 

 

ప్రార్థన అంశం: 

సంపూర్ణ సేవ కొరకు సమర్పించబడిన సేవకులు లేచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet holiganbet giriş casibom giriş bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom