By Village Missionary Movement
Sunday, 10-Sep-2023దిన ధ్యానము(Telugu) 10.09.2023
అంశం: కృతజ్ఞత లేని కుమారుడు
ప్రత్యేకముగా చిన్న పిల్లల కొరకు
"నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము" - సామెతలు 23:22
ఎలాంటి నాగరికత, చదువు, వ్యాపారాలు ఇలాంటి దేనిలో కూడా కూడా అభివృద్ధి చెందని ఒక చిన్న గ్రామంలో జోనీ పీటర్ దంపతులు నివసించి ఉండేవారు. ఇద్దరు కూడా పేద వ్యవసాయకులు. వీళ్లకు 20 సంవత్సరాల తర్వాత అందమైన ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకు శ్యామ్ అని పేరు పెట్టి సంతోషముగా బాబును పెంచుకున్నారు. విద్య లేని ఆ గ్రామములో తన కుమారుడు చదివి గొప్ప ప్రయోజకుడు కావాలి అని ఆలోచనతో ఐదు మైళ్ళు అవతల ఉన్న ఒక బడిలో చేర్పించారు. ఆయనను చూచిన తల్లిదండ్రులు సంతోషించారు. బడి చదువులు పూర్తి చేసుకున్న శ్యామ్ ను కాలేజీలో చేర్పించాలి అంటే 20 మైళ్ళు రైల్లో ప్రయాణం చేసి వెళ్ళాలి.
శ్యామ్ ను కాలేజీలో చేర్చుటకు సరిపడినంత ధనము లేనందున తమ యొక్క ఉదయకాలపు ఆహారాన్ని త్యాగము చేసి దానికి గల డబ్బును పొదుపు చేసి తన కుమారుడిని ఆ కాలేజీలో చేర్పించారు. చేర్పించిన నెల రోజులకు తన కుమారుడిని చూడాలి అని ఆశ కలిగింది. ప్రయాణ ఖర్చుకు సరిపడినంత డబ్బు లేనందున తన పాత గుర్రపు బండిని తీసుకుని తల్లిదండ్రులు ఇద్దరు కుమారుని చూడ్డానికి వెళ్లారు. వెళ్లే మార్గంలో బస చేయుటకు డబ్బులు లేనందున రోడ్డు పక్కన తన గుర్రపు బండిని పెట్టి ఏదో ఒకలాగా కాలేజీకి వెళ్లి చేరుకున్నారు. అక్కడికి వెళ్లి చూడగా యవ్వనస్తులు నాగరికత గల వస్త్రములు ధరించి సంతోషంగా కాలేజీకి వెళ్తున్నారు. వాళ్ళందరు ఈ మురికి బట్టలతో ఉన్న ఇతని చూసి ఇతని పాత గుర్రపు బండిని చూసి హేళన చేశారు. వీలైతే దాన్ని పట్టించుకోకుండా నా కుమారుడు శ్యామ్ ను చూశారా అని అడిగారు. అదే సమయంలో శ్యామ్ అటువైపుగా వచ్చాడు వీలైతే పరిగెత్తుకొని వెళ్లి తన ప్రియమైన కుమారుడు శ్యామును కౌగిలించుకొని ముద్దాడాడు తండ్రి. కానీ అతను అయితే వారిని దులిపేసి ముసలివాడ మీరెవరు అని చెప్పి అందరి విద్యార్థులు ఎదుట తన తండ్రిని అవమానపరిచాడు. దానిని విన్న తండ్రి దిగ్భ్రాంతికి గురి అయ్యాడు. ఆయన హృదయము ముక్కముక్కలైనట్లుంది. బహు వేదనతో ఇంటికొచ్చి తన కుర్చీలో కూర్చుని తలవాల్చారు. అంతే కృతజ్ఞతలు లేని తన కుమారుని కఠినమైన మాటలు ఆ గుండెను ముక్కలు చేసినందున అది తన పనిని నిలిపివేసింది.
ప్రియ తమ్ముడు చెల్లి మీకు కూడా శ్యామ్ ను చూస్తే కోపం వస్తుంది కాదు? నీవు కూడా ఎన్నిసార్లు తల్లిదండ్రుల మాటకు లోబడకుండా వాళ్లను దుఃఖ పరిచావు అనే దాన్ని ఆలోచించి చూడు. నీ తల్లిదండ్రులను సంతోష పెట్టు అది నీకు ఆశీర్వాదకరం.
- శ్రీమతి. జీవా విజయ్ గారు
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250