By Village Missionary Movement
Friday, 08-Sep-2023దిన ధ్యానము(Telugu) 09.09.2023
అంశం: విజయపు జెండా
"గుమ్మములద్వారా రండి రండి జనమునకు త్రోవ సిద్ధపరచుడి రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి రాళ్లను ఏరి పారవేయుడి జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి" - యెషయా 62:10
పూర్వకాలంలో ఒక దేశము మరియొక దేశం మీద యుద్ధమునకు వెళ్లి గెలిచి వచ్చినప్పుడు తమ దేశపు జెండాను ఆ దేశంలో ఎగరవేసి వచ్చేవారు. అలానే ప్రభువు కూడా తన పిల్లల పైన ముద్ర వేసి తన జెండాను నాటుతున్నారు.
వేరే దేశం పైన యుద్ధము చేసి విజయాన్ని పొందుకున్న తర్వాత అక్కడ ఉన్న జెండాలను తీసివేసి తమ దేశపు జెండాలను ఎగర వేస్తారో అలానే మన యందు దేవుని గుర్తు వేయబడినప్పుడు ఆ జెండా ఎగరవేయడానికి మనలో ఉన్న రాళ్ల వంటి ఇతరులను గాయపరిచే పాపములను మన నుండి దూరం చేయాలి. కోపము ద్వేషము సనుగుకొనుట దురాశ ఇవే ఆ రాళ్లు. ఇలాంటి రాళ్లు నువ్వు తీసివేసినప్పుడు ఆత్మ స్వరూపమైన దేవుడు జెండా మనలో ఎగురవేస్తారు. పాపమును విడిచి మిమ్మును దేవుని ఆధీనంలోనికి సమర్పించుకున్నప్పుడు ఆయన జెండా ఎగురుతుంది. నా హృదయం అంతా సంపూర్ణంగా ఆయన పరిపాలన క్రింద అప్పగించినప్పుడు మన యొక్క గుణం మారుతుంది. మనల్ని చూసేవారు దేవుని పిల్లలు అని గుర్తిస్తారు. ఎందుకంటే ఆయన జెండా మనలో ఎగరవేయబడుతుంది. పాపమునకు మనం అవకాశం ఇచ్చినప్పుడు దేవుని పరిపాలన క్రింద లేని మరియొక జెండా మనలో ఉంటుంది. ప్రభువు యొక్క జెండా మనలో ఉండి నీడలా మనము చేసిన కార్యాలు అన్నీ కూడా ఆత్మ స్వరూపమైన దేవుడు మన ముందుండి ఆయన యుద్ధం చేసి మన కొరకు ఆయన జెండాను ఎగరవేస్తారు. వరద వలే శత్రువు వచ్చినప్పుడు ఆయన మనకు ముందు నిలబడతారు (యెషయా59:19).
ప్రియమైన వారలారా! మీరు ఎవరు ఆధీనంలో ఉన్నారు? ఎవరి జెండా మీలో ఎగురుతుంది? చేస్తున్న కార్యాలు అపజయమా? ఆలోచించండి. ఈ దినము ఆలోచించి చూచి మిమ్మున ఆయన ఆధీనంలోనికి సమర్పించుకోండి. దొంగకు పరదేశులో స్థానము దొరకడానికి గల కారణం నీ రాజ్యము నందు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అప్పగించాడు. మీరు కూడా అలానే అప్పగించుకొనుడి అప్పుడు పరలోకాన్ని ఈ లోకంలోనే రుచి చూడగలం. లోక శ్రమలు, ఉపద్రవాలు మనలను జయించనివ్వకుండా లోకాన్ని జయించిన వాటితో తోడుగా ఉండి మనము నడిచేటప్పుడు ఆయన మనలను గెలిపిస్తారు. లోక కార్యాలు మనలను ఓడించకపోతే కచ్చితంగా ఈ లోకంలో పరలోక జీవితం యొక్క విజయాన్ని అనుభవిస్తాం.
- శ్రీమతి. సెల్వ రాజు గారు
ప్రార్థన అంశం:
సంపూర్ణ సేవకుల యొక్క కుటుంబాలలో రక్షింపబడని ప్రజలు రక్షింపబడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250