Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.09.2023
Share:

By Village Missionary Movement

Friday, 08-Sep-2023

దిన ధ్యానము(Telugu) 08.09.2023

 

అంశం: లేమి లేదు కానీ ఉంది

 

"తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు ఇందును గూర్చినిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది" – రోమీయులకు 4:17

 

జార్జ్ ముల్లర్ అనే దేవుని సేవకుడు ఆదరణ లేని అనేకమంది పిల్లలకు హోమ్ నడిపించేవారు. ఆయన అనుదిన అవసరతల కొరకు దేవుని మీద విశ్వాసం ఉంచి వాళ్లందర్నీ పోషిస్తూ వచ్చారు. 

 

ఒక దినము ఉదయకాలపు ఆహార సమయం వచ్చింది వాళ్లకు పెట్టుటకు ఆహారం ఏమీ లేదు. కొనుటకు చేతిలో డబ్బులు కూడా లేవు. అక్కడ అన్ని ప్లేట్లు గ్లాసులు ఖాళీగా ఉన్నాయి. అయినప్పటికీ అందరిని వరుస క్రమంలో కూర్చోబెట్టి తలలోంచి తండ్రి మాకు ఆహారం ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు అని ప్రార్థన చేయించారు. ప్రార్థన ముగించే లోగా ఎవరో తలుపు కొడుతున్న శబ్దం వినబడింది. అక్కడ రొట్టెలు తయారు చేసే వ్యక్తి నిలబడి ఉన్నాడు ఆయన నాకు రాత్రంతా నిద్ర లేదు. మీకు తినడానికి ఏమీ లేదు అనే ఆలోచన నాకు కలిగింది కాబట్టి ఉదయం రెండు గంటల నుండి నేను మీ కొరకు రొట్టెలను సిద్ధపరిచాను అని చెప్పి ఆ రొట్టెలను వాళ్లకు ఇచ్చారు. 

 

ఆయన వెళ్లిపోయిన తర్వాత మరల తలుపు కొడుతున్న శబ్దం వినబడింది. తలుపు తెరిచి చూస్తే పాలు ఇచ్చే అతను అతని బండి ఈ అనాధాశ్రమం ముందు పాడైపోయింది. దానిని బాగు చేయాలి అంటే ఆ బండిలో ఉన్న పాలన్నీ ఖాళీ చేయాలి కాబట్టి ఈ పాలను మీరు తీసుకుంటారా అని అడిగాడు. దేవుడు ఎంత చక్కగా ఉదయకాలపు ఆహారాన్ని ఇచ్చారు అని ఆలోచించి అందరూ ఆశ్చర్యపడ్డారు. 

 

క్రీస్తు నందు ప్రియమైన వారలారా! మీరు కూడా లేమిగుండా నడుస్తూ వెళ్లవచ్చు అయితే కలత చెందకుడి దేవుడు శూన్యము నుండి సమస్తమును తన మాటల చేత సృష్టించారు. అలాగే పిల్లలు లేకుండా ఉండిన అబ్రహమును సారాను జనాంగములకు తల్లిగాను తండ్రిగానూ ఉంచారు. మోసగాడిగా ఉన్న యాకోబును దీవించి గోత్రములు అన్నింటికీ తండ్రిగా మార్చారు. 

 

మనము కూడా సంతోషం లేదు, ధనము లేదు అని చింతిస్తూ ఉండిన ఎడల ఈ దినమే ఒక నిర్ణయం తీసుకుందాం. సమస్తాన్ని ఇవ్వగలిగిన శక్తిమంతుడు అని ఆయనను విశ్వసిద్దాం. మన విశ్వాసాన్ని కచ్చితంగా ప్రభువు ఘనపరిచి మనకు కావాల్సిన అన్నింటిని దయ చేస్తారు. కాబట్టి దేనికొరకు చింతించకుండా దేవుని పైన విశ్వాసం ఉంచుదాం జయం పొందుకుందాం.

- శ్రీమతి. దివ్య అలెక్స్ గారు

 

ప్రార్థన అంశం:-

దెబోరా ప్రార్థనా గుంపుల ద్వారా జరుగుతున్న పరిచర్య గురించి ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet