Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.09.2023
Share:

By Village Missionary Movement

Tuesday, 05-Sep-2023

దిన ధ్యానము(Telugu) 06.09.2023

 

అంశం: సొంతం చేసుకొనుడి

 

“ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి” - ఎఫెసీయులకు 4:32

 

ఒక దినము ఒక స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు పోరాటము అనే అంశం క్రింద మాట్లాడమని చెప్పారు. కొందరు జీవిత పోరాటమనియు, మరికొందరు పోరాటం అనే విధ్వంసం అని చాలా చక్కగా మాట్లాడారు. 

 

విశ్వాసము గల విద్యార్థి ఒకడు యేసుక్రీస్తు ప్రేమ మార్గాన్ని వెంబడించిన మార్టిన్ లూథర్, అబ్రహం లింకన్, మహాత్మా గాంధీ వీళ్లు జరిపిన పోరాటం గూర్చి దాని ప్రధాన ఉద్దేశం ఫలితాన్ని నొక్కి చెప్పి మొదటి బహుమానాన్ని పొందుకున్నాడు. 

 

ఎందుకు ఒక మోషే ఇశ్రాయేలు ప్రజలను ఫరోయోద్దునుండి రక్షించుటకు దేవుని బలాన్ని పొందుకొనలేదా? కానానులలో ప్రవేశించుటకు బయపడిన యెహోషువాను కాలేబును భయపడవద్దు అని చెప్పిన దేవుడు మార్గము చూపించలేదా? దేవుని మార్గము విస్తరించుటకు సాతాను కొట్టివేయబడాలి. 

 

18వ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశంలో అనేకులు తాగుబోతులుగా మారిపోయి గొడవలు, కొట్లాటలు విస్తారంగా జరిపేవారు. ఆ సమయంలో దేవుడు జాన్ వెస్లీని లేపారు. ఆయన యొక్క సందేశము ప్రజల యొక్క హృదయాన్ని మార్చింది. అనేకుల పాపము కొరకు కన్నీరు కార్చారు. ఇంగ్లాండ్ దేశాన్ని మార్చుటకు ఒక వెస్లీ సరిపోయిన ఎడల భారతదేశంలో గల మూఢనమ్మకం నుండి రక్షించుటకు రక్షణ అనుభంలోని నడిపించుటకు నీవు సరిపోవా? 

 

సమీప కాలంలో కుటుంబముగా పనిచేస్తూ పరిచర్య చేస్తున్నవారు గుడార పరిచర్య అనే అంశము కింద పరిచర్య చేస్తూ వస్తున్నారు. ఇలాంటి వారు ప్రజల యొక్క మేలుని పొందుకొని సువార్త ప్రకటిస్తున్నారు. నశించిపోతున్న వారిని దేవుని కొరకు సంపాదించుకోనండి. 

 

తన యొద్ద నమ్మి ఇచ్చిన పనిని తగిన సమయంలో చేసి ముగించినప్పుడు ఆశ్చర్యపోతున్న వాళ్లకు సువార్త చెబుతున్నారు. ధనాశ లేనివారుగా చిన్న స్కూల్ ప్రారంభించి మంచి విశ్వాసులను పనికి పెట్టి పిల్లలకు చక్కని బోధను ఇచ్చి ఆ తల్లిదండ్రులతో ప్రేమతో మాట్లాడి సత్యాన్ని ప్రకటించి వాళ్లను దేవుని కొరకు సొంతం చేయవచ్చు కదా? 

 

# ఆత్మల సంపాదన చేద్దాము. ఇది దేవునికి ప్రియము అందువల్ల మనం దీవెన పొందుకుందాం. 

- శ్రీమతి. జాస్మిన్ పాల్ గారు 

 

ప్రార్థన అంశం:

మన రాగ్ ల్యాండ్ బైబిల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల కొరకు ప్రార్థన చేద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet