Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.09.2023
Share:

By Village Missionary Movement

Monday, 04-Sep-2023

దిన ధ్యానము(Telugu) 04.09.2023

 

అంశం: నిన్ను గొప్పగా చేసేదను

 

"ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును; నిజముగా భూమిమీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును; ఇదే యెహోవా వాక్క" - జెఫన్యా 3:20

 

16 శతాబ్దంలో రెండవ ఫిలిప్పు రాజు బైబిలు చదివే వారికి కఠినమైన శిక్ష విధించేవాడు. ఒక దినం అధికారులు ఒక పట్టణం యొక్క మేయర్ ఇంటిని పరిశోధించినప్పుడు ఆయన ఇంటిలో ఒక బైబిల్ ను కనుగొన్నారు. అది ఎవరు చదువుతున్నారు అని అడిగారు ఏ ఒక్కరు కూడా దానికి అంగీకరించలేదు. ఒక పని మనిషి నేనే ఆ బైబిల్ ను చదువుతున్నాను అది నా యొక్క బైబిలే అని అన్నారు. ఆ మేయర్ ఆమెను కాపాడుటకు మనసుపెట్టి ఆమె చదువు రాదు అని అన్నారు. అందుకు ఆ పనిమనిషి అయితే నేను చదవగలను అని చెప్పి చదవడం ప్రారంభించింది. ఆమెను ఇటుకలు తయారు చేసే స్థలంలో పెట్టి ఊపిరి ఆడనివ్వకుండా చేసి చంపారు. ఆమె అయితే బైబిల్ కొరకు ప్రాణమిచ్చిన ఘనతను పొందుకున్నది. 

 

బైబిల్లో అనేకులు దేవుని చేత గొప్ప ఖ్యాతి గల వారిగా ఉండటం మన చూస్తున్నాం. మొర్దికై యొక్క ఖ్యాతి విస్తారంగా విస్తరించింది అవును ఆయన నిజాయితీ యదార్థత నుండి తన కార్యాన్ని నీతి న్యాయంగా చేసినందువలన గొప్పవాడు అయ్యాడు (ఎస్తేరు 9:4). ఆయన ప్రఖ్యాతి 127 దేశాల్లో ప్రసిద్ధి అయింది. అలాగే మోషేతో పని చేసిన యెహోషువ యొక్క ప్రఖ్యాతి దేవుడు ప్రస్తావించారు. మోషే తర్వాత 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను నడిపించుటకు దేవుడు యెహోషువాతో ఉండి అద్భుతాలను ఆశ్చర్యకారులు చేసి ఆయన ఘనతను విస్తరింపజేశారు. సోలోమోను ప్రఖ్యాతి కూడా దేవుడు విస్తరింపజేశారు. జ్ఞానాన్ని అడిగిన సొలోమోను కి అమితమైన ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని దేవుడు ఇచ్చారు. ఇతర దేశముల నుండి రానులు వచ్చి ఆయన జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆయన యొక్క ఘనత దేశమంతా విస్తరించింది. 

 

అవును ప్రియమైన వారలారా 19వ శతాబ్దంలో ప్రసిద్ధిగాంచిన రాజైన నెపోలియన్ ఘనత లోకమంతా విస్తరించింది. కానీ ఈ దినమైతే ఆ ఘనత కనుమరుగయిపోయింది. కానీ దేవుడైన మన ప్రభువు తన పిల్లలను నిత్య ఘనత గలవారుగా పెట్టి ఉన్నారు. మీ ఘనత మా ద్వారా బయలుపరచబడేటట్లు మమ్మల్ని వాడుకోండి ప్రభువా.ఆమెన్! 

- శ్రీమతి. ఫాతిమా సెల్వరాజ్ గారు

 

ప్రార్థన అంశం:

పార్ట్నర్ షిప్ మిషనరీల ద్వారా ఫీల్డ్ లో జరుగుతున్న పరిచర్య గురించి ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet