Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.09.2023
Share:

By Village Missionary Movement

Sunday, 03-Sep-2023

దిన ధ్యానము(Telugu) 03.09.2023

 

అంశం: నిజాయితీ

 

ప్రత్యేకంగా చిన్న పిల్లలకు

 

"అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు" - సామెతలు 12:22

 

హాయ్ పిల్లలు కథ వినడానికి రెడీగా ఉన్నారా కదా? వినడం మాత్రమే కాదు కథలో ఉన్న మంచి కార్యాన్ని

మీరు విని దాన్ని పాటించాలి అది చాలా ప్రాముఖ్యం. సరేనా! నిజాయితీకి దొరికిన బహుమానం అనే దానిని ఈ కథ ద్వారా విందాం.

 

 సుందరం పెయింట్ వేసే పని చేసేవాడు. పేదరిక పరిస్థితుల్లో నిజాయితీగా ఉండేవాడు కానీ చేసిన పని చక్కగా చేసి ముగించేవాడు కానీ ఆయనకు పని దొరుకుట చాలా కష్టంగా ఉండేది. రాబడి ఎక్కువగా లేనందున మంచి ఆహారము, మంచి వస్త్రాలు వేసుకొనుట అరుదుగా ఉండేది. సుందరం ఉండిన ఊరిలో ఒక ధనవంతుడ ఉండేవాడు. ఆయన ఎప్పుడో ఒకసారి పనికి పిలుస్తూ ఉండేవాడు సుందరం కూడా చాలా సంతోషంగా వెళుతూ ఉండేవాడు. ఎందుకో తెలుసా? అవును సరిగా చెప్పారు. ఆ ధనవంతుడు ఇల్లు అంటే సాధారణంగా ఉండదు కదా మంచి జీతం దొరుకుతుంది కదా. మనలాగే సుందరం కూడా ఆలోచించుకొని వెళ్ళాడు. ఆ ధనవంతుడు నది పక్కనే ఉన్న ఒక పడవకు పెయింట్ చేయమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంతేనా అని తలంచుకుని అ పడవకు పెయింట్ వేశాడు. ఆ పడవ మధ్యలో ఒక రంద్రం ఉన్నది. ఆ రంద్రం కప్పుట ఒక పెయింటర్ పని కాదు అయినప్పటికీ ఆ రంధ్రాన్ని పూడ్చివేసి మంచిగా పెయింట్ పని చేశాడు.

 

 తన సొంత ఊరికి వెళ్లి వచ్చిన ఆ పడవ నావికుడు ఈ ధనవంతుడు కుటుంబంతో పాటు కలిపి ఆ పడవలో ప్రయాణించుటకు వచ్చాడు. అయ్యో పడవలో ఒక రంద్రం ఉన్నదే మరి రేపు వెళ్లడం అవుతుందా అని అడిగాడు. అందుకు ఆ పడవ నడిపే నాయకుడు ఆ రంద్రము ముయబడి చక్కగా పెయింట్ వేసి ఉంది. సుందరమునకు ఆ పని చెప్పకుండానే చక్కగా చేసి పెట్టాడే అని తలంచిన ధనవంతుడు సుందరమును వెతుకుతూ ఆ దినము మంచి జీతం ఇచ్చి ఆ ఇంట్లో పని చేసే వారందరికీ నువ్వే నాయకుడివి అని చెప్పి బాధ్యత అప్పగించాడు. ఏంటి చెప్తున్నారయ్యా అని ఆశ్చర్యపోయాడు సుందరం. అవును బాబు నీ నిజాయితీకి నిజాయితీ గల పనికి దొరికిన బహుమానమే ఇది అని చెప్పి ధనవంతుడు ఆ పడవలో ముందుకు వెళ్లాడు. దాన్ని విన్న సుందరం ఆశ్చర్యపోయాడు. తను పడిన శ్రమకు మంచి బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు అని తలంచి దేవుని కృతజ్ఞతలు చెల్లించాడు. సంతోషంగా తన ఇంటికి వెళ్ళాడు. 

 

 కథ విన్నారు కదా పిల్లలు! మీరు కూడా చేస్తున్న పని ప్రభువు గమనిస్తూ ఉన్నారు. మీ నిజాయితీగల బహుమానమును ప్రభువు కచ్చితంగా ఇస్తారు. కార్యం ఏదైనా అన్నింటిలోనూ నిజాయితీగా ఉంటారా? ఒకే పిల్లలు బాయ్! 

- శ్రీమతి. అనుభూ జ్యోతి స్టాలిన్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet