Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.09.2023
Share:

By Village Missionary Movement

Friday, 01-Sep-2023

దిన ధ్యానము(Telugu) 01.09.2023

 

అంశం: ఎంప్టీ బాటిల్

 

"ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొదక్రింద ఆ చిన్నవాని పడవేసి" – ఆదికాండము 21:15

 

కాళీ బాటిల్ అంటే ఇంట్లో అలమరలో ఒక మూల పడి ఉంటుంది. దానిని మనము గమనించడం మర్చిపోతాం. కానీ దేవుడు కాళీ బాటిల్ కూడా చూసి వదిలేసే దేవుడు కాదు. ఆయన దాన్ని చూచి నింపే దేవుడు. అలాంటి కార్యాన్ని చూద్దామా? 

 

బైబిల్లో హాగరు అబ్రహామును నమ్ముకుని ఉండేది. చివరికి కొంత ఆహారం, నీళ్లు ఇచ్చి అబ్రహాము చేత పంపించి వేయబడింది. అరణ్యంలో చుట్టూ తిరిగి నీళ్ల తిత్తిలో గల నీళ్లు కూడా ఖాళీ అయిపోయాయి. బిడ్డ నీళ్లు కొరకు దప్పిక కలిగి మరణించే పరిస్థితి వచ్చినప్పుడు హాగరు బిడ్డను విడిచిపెట్టి ఒంటరిగా వెళ్లి ఏడుస్తూ ఉంది. దప్పిక వలన అ బిడ్డ ఒకపక్క ఏడుస్తూ ఉంది అయితే దేవుడు ఆ బిడ్డ యొక్క స్వరాన్ని విన్నాడు. ఖాళీగా ఉన్న నీళ్ల తిత్తిని కూడా దేవుడు చూశాడు. మనుషులను నమ్మినప్పుడు మనము నిరుత్సాహంతో కన్నీరు కార్చే పరిస్థితి రావచ్చు. గమనించేవారు లేకుండా మరణించే పరిస్థితి కూడా రావచ్చు కానీ ప్రభువైతే కాళీ బాటిల్ గా ఉన్నారని ద్వేషించకుండా త్రోసివేయకుండా నిరీక్షణతో జీవించుటకు వాగ్దానం చేస్తున్నారు. చేతుల్లో గల కాళీ బాటిల్ను నింపడానికి నీటి ఊటను సిద్ధం చేసి పెట్టారు. ఆమె నీటి తిత్తిని నింపుకొనుటకు మాత్రమే కాదు హగరు యొక్క ఊటలో అనేకులు ఈ దినం వరకు వారి యొక్క దాహం తీర్చుకొనుటకు దేవుడు ఆ ఊటను ఏర్పరిచాడు. 

 

ప్రియమైన వారలారా! ఇలానే మనము మనుషులను నమ్ముకున్నప్పుడు ఒక దినము వాళ్లు మిమ్మల్ని వ్యర్థముగా పంపించేస్తారు. మీరు ప్రభువుని మీ నమ్మకముగా ఉంచుకొనిన ఎడల మనుషులను, సంఘమును, బోధకులను నమ్ముకుని ఉంటే మీరు ఖాళీ బాటలే. మీరు ఈ దినము మంచిగా ఉంటారు కానీ ఒక దినము మీకు హాజరు పరిస్థితి రావచ్చు. కాబట్టి ఈ దినమే మిమ్మల్ని మీరు సమర్పించుకొనండి. మీ కన్నీరు తుడవబడుతుంది, మీ పాత్ర పొంగి పొరలేటట్లు ఆయన చేస్తారు. అంతేకాదు అనేకులకు దీవెనకరముగా, దీవెనలు పంచేవారిగా మారుతారు. 

 

ఇదంతా ఉచితమే. ఓ దప్పిక గలవారులారా! మీరందరూ రండి ఉచితముగా పొందుకొనుడి అని యెషయా గ్రంథం 55:1 ప్రభువు పిలుస్తున్నారు. మనుషులను నమ్ముకుని కాళీ బాటిల్ గా అయిపోయారా? అయితే ఉచితంగా ఇచ్చే ప్రభువు వద్దకు రండి మీ కొరకు అరణ్యంలో ఊటను సృష్టించుటకు ఆయన సమర్థవంతుడు. రండి నింపుకొనండి. 

- బ్రదర్. డేవిడ్ గణేష్ గారు 

 

ప్రార్థన అంశం: 

ఈ నెల అంతా జరుగుతున్న పరిచర్యలో దేవుని హస్తము తోడైయుండి నడిపించేటట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet