Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 31.08.2023
Share:

By Village Missionary Movement

Thursday, 31-Aug-2023

దిన ధ్యానము(Telugu) 31.08.2023

 

అంశం: సిలువ యొక్క మహోన్నతం

 

"అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక; దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువవేయబడియున్నాము" - గలతియులకు 6:14 

 

ప్రభువు కొరకు యదార్థముగాను నిజమైన పరిచర్య చేసిన ఒక పెద్ద సేవకునికి ఒక ప్రశ్న వేయబడింది. మీ యొక్క వందల కొలది పాటలు పల్లెటూరులోనూ, నగరాల్లోనూ ఈదిన వరకు మ్రోగుతూ ఉన్నాయి. తమిళ క్రైస్తవుల మధ్యలోనూ, క్రైస్తవ ప్రపంచంలోను మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. పొగడ్తలు యొక్క శిఖరంనకు వెళ్ళినప్పటికీ మీ పేరు చెప్తే దీనత్వం గల సేవకుడు అని సేవకులు, విశ్వాసులు చెబుతున్నారు. దీనికి గల రహస్యం ఏమిటి? అని అడిగారు. ఆ దేవుని సేవకుడు చెప్పిన జవాబు గొప్ప చెప్పుకొనుటకు నాలో ఏమి ఉన్నది? ఏమీ లేదు. నా స్వరము గురించి నేను గొప్ప చెప్పుకోలేను ఎందుకంటే నేను క్వయర్లో చేరడానికి ఆశించినప్పుడు గాడిద స్వరముగలవాడిని అని విమర్శించబడ్డాను కాబట్టి నా యొద్ద ఉన్నవి అన్నీ కూడా ప్రభువు ఇచ్చినవే నా యొద్ద ఏమీ లేదు అన్నారు. 

 

అపోస్తులుడైన పౌలు తాను సిలువ గురించి తప్ప ఘనపరచుటకు ఏమీ లేదు అన్నారు. ఈ లోకపు ఆస్తి, అంతస్తులు, ఘనత అన్ని సిలువ ఎదుట దూలిగాను పెంటగాను ఉన్నవి. నేను క్రీస్తును ఎరుగుతున్న కార్యము కొరకు సమస్తమును నష్టముగాను పెంటగాను ఎంచుకున్నాను అని తన పత్రికలో రాస్తున్నారు. పౌలు ఎవరు? గొప్ప విద్యార్థి. తన గురించి గొప్ప చెప్పుకోవాలి అంటే ఆయన దగ్గర అనేక కార్యాలు కలవు. అయినప్పటికీ సిలువను దాంట్లో వేలాడే యేసుక్రీస్తు ప్రభువును చూసినప్పుడు ఈ ఘనతలన్నీ కూడా పెంటగా మారిపోయాయి. 

 

ప్రియమైన వారలారా మనం మన గురించి గొప్పగా తలంచుచున్నామా? మన అందము, ఆడంబరాలు, చదువు, ఆస్తులు, పలుకుబడులు మన మనసును విడిచి వెళ్లకుండా ఉండిపోతున్నాయా? అలా అయితే ఒక నిజము ఇంకను మీరు సిలువ యొక్క మహోన్నత్వమును ఆవగింజంత కూడా మీరు గ్రహించలేదు అన్నదే. తమలోక ఘనతలు అన్నీ కూడా విడిచిపెట్టి అవమానపు చిహ్నమైన సిలువలో తమ కార్యని త్యాగం చేసిన క్రీస్తు నందు ఏది కూడా గొప్పది కాదు. ఇలాంటి క్రీస్తు యొక్క ఆలోచన మన ప్రతి ఒక్కరిని కూడా పరిపాలించ నివ్వండి. ఆ విధముగా దేవుడు మనకు సహాయం చేయను గాక! 

- బ్రదర్. టీ. సామ్యూల్ గారు 

 

ప్రార్థన అంశం:-

తమిళనాడులో గల 310 మండలాలలో రెండేసి రెండేసి దేబోరా ప్రార్థన గుంపులు లేచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal milanobet bahiscasino betpas bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet betplay casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet