Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.08.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 30-Aug-2023

దిన ధ్యానము(Telugu) 30.08.2023

 

అంశం: కాపాడే దేవుడు

 

"పడమటి దిక్కుననున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొనిపోవు ప్రవాహ జలమువలె ఆయన వచ్చును" - యెషయా 59:19

 

దక్షిణాఫ్రికా అడవి భాగంలో ఈ దినం వరకు నివసిస్తున్న ఆదివాసి ప్రజలు వారి యొక్క పిల్లలు ఆ అడవిలో ధైర్యంగా జీవించుటకు కొన్ని తర్ఫీదులు ఇస్తూ ఉండేవారు. దాంట్లో ఒకటి దట్టమైన అడవి భాగంలో ఆ పిల్లలను తీసుకువెళ్లి అక్కడ వదిలేసి వచ్చేసేవారు. కొంత సమయం తర్వాత అనేక జంతువులు అక్కడికి వచ్చి తిరుగుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఆ బిడ్డ ఉంటున్న చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ బిడ్డ భయంతో కేక వేస్తుంది. ఆ జంతువు ఆ బిడ్డ దగ్గరికి వచ్చే సమయంలో ఆ జంతు శరీరం మీద విషయము చేయబడిన బాణము వచ్చి దిగుతూ ఉండేది. ఎవరు ఆ బిడ్డను కాపాడుతుంది? ఎవరు ఆ జంతువును చంపింది? అని చూస్తే ఆ బిడ్డ యొక్క తండ్రి. ఆ బిడ్డ ఒంటరిగా విడవబడలేదు దూరముగా కూర్చుని బాణం పట్టుకుని బిడ్డ యొక్క తండ్రి శ్రద్ధగా గమనిస్తూ ఉన్నాడు. ఆపత్తు వచ్చే సమయంలో త్వరగా పనిచేసి తన బిడ్డను కాపాడుకునేవాడు. 

 

అవును ప్రియమైన వారలారా! మనము జీవిస్తున్న ఈ లోకము దేవుని చేత శపించబడిన భూమి. ఎక్కడ చూసినా క్రూరత్వము, కీడుతో నిండి ఉన్నదాన్ని చూడగలం. స్త్రీలకు వ్యతిరేకమైన హింసలు, ఉగ్రవాదాలు, వివాదాలు, కొట్లాటలు, దుష్ట కార్యాలు జరుగుతున్న వాటిని చూసినప్పుడు మనుషుల యొక్క హృదయాలు కలవర పడుతున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ఆలోచించి కలదు చెందుతూ ఉన్నారు. ఇలాంటి లోక పరిస్థితుల్లో దేవుడు తన పిల్లల కొరకు చేస్తున్నది ఏమిటి అని చూద్దామా? అడవిలో తన బిడ్డను ఎలాంటి కీడు రాకుండా తండ్రి ఎలాగా కాపాడుతున్నాడో అలాగు మన తండ్రి అయిన దేవుడు ఈ కఠినమైన లోకము నుండి కాపాడుటకు మనతోనే ఉన్నారు. ఆ మహోన్నతమైన దేవుని చాటున మనం ఉండిన యెడల ఆయన మనలను ఎలాంటి రోగము నుండి అయిన మనల్ని కాపాడుతారు. వేటగాని ఊరిలో నుండి మనము తప్పించబడతాం. కీడు మనకు సమీపించదు, ఎలాంటి రోగము మన దరి చేరదు. మనం వెళ్లే మార్గంలో మనల్ని కాపాడుటకు తన దూతలను కాపలా ఉంచుతారు. సింహం వంటి క్రూరమైన సమస్యలు, సర్పము వంటి సాతాను యొక్క తంత్రాలు వీటన్నిటిని మనం నలగ ద్రొక్కగలము. ఆపదలో ఆయనే మనతో ఉండి మనల్ని విడిపిస్తారు. హల్లెలూయ! 

 

మీరు ఆయనను మీ సొంత తండ్రిగా కలిగి ఉన్నారా? అది ప్రాముఖ్యం. తండ్రి బిడ్డలకు మధ్యన ఉన్న బంధము ఐక్యత మీలో ఉన్నదా ఆలోచించండి? 

- శ్రీమతి. దవమని వైరవెల్ గారు 

 

ప్రార్థన అంశం: 

మన యొద్ద బైబిల్ పొందుకున్న ప్రతి వ్యక్తి కూడా దేవుని కొరకు జీవించేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal milanobet bahiscasino betpas bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet betplay casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet