Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.08.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 27-Aug-2023

దిన ధ్యానము(Telugu) 27.08.2023 (Kids Special)

 

అంశం: సారు యొక్క ప్రార్థన

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు

 

"ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు(లక్ష్యముచేయుచున్నాడు) గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి" - 1 పేతురు 5:7

 

అది ఒక సముద్ర తీరం గ్రామం. ఆ గ్రామంలో సరైన విద్యుత్ సదుపాయాలు బస్సు ప్రయాణము సదుపాయాలు లేవు. ఆ గ్రామంలో సారు అనే చిన్నది నివసిస్తూ ఉన్నది ఈమె ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి. ఈమెకు పాటలంటే చాలా ఇష్టం, చక్కగా ప్రార్థిస్తుంది. ఈమెకు అన్నయ్య అక్క చెల్లి తమ్ముడు అందరూ ఉన్నారు. 

 

ఒక దినము ఆమె యొక్క అన్నయ్య కనబడకుండా పోయారు. ఎక్కడ వెతికినను కనుగొనలేకపోయారు. ఆయనను గుర్తు చేసుకుని ఏడ్చి సారు యొక్క తల్లి అనారోగ్యంతో మంచం పట్టింది. ఆసుపత్రిలో చేర్చబడి చాలా కష్టమైన పరిస్థితికి వచ్చింది. దానిని చూచిన సారు యొక్క నాన్న హృదయం బద్దలైపోయింది. హాస్పిటల్లో ఉన్న భార్యను చూడాలా? కనబడకుండా పోయిన కుమారుని వెతకాల? ఇంట్లో ఉన్న పిల్లల్ని చూసుకోవాలా? అని కలతతో కన్నీరు కార్చారు. అది డిసెంబర్ నెల తెల్లవారితే క్రిస్మస్. క్రిస్మస్ ను సంతోషముగా జరుపుకొనవలసిన ఇల్లు అది. కానీ ఆ దినం దుఃఖముతో ఆ ఇల్లు నిండిపోయింది. ఇంత జరిగినా కూడా అదే ఊర్లో ఉంటున్న బంధువులు ఎవరు కూడా వచ్చి వీళ్లను ఏమీ అడగలేదు. ఆ సమయంలో ఆ చిన్నది సారు మోకరించి యేసయ్యకు ప్రార్థించడం ప్రారంభించింది. యేసయ్య అమ్మ ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. అమ్మ ఆరోగ్యం బాగోలేదు మరి ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూసుకుంటారు. మా అమ్మకు మంచి ఆరోగ్యము దయచేయండి, మా అన్న ఎక్కడున్నా తీసుకుని రండి అని కన్నీటితో ప్రార్థించింది. ఎంత ఆశ్చర్యం. యేసయ్య ఆమె యొక్క కన్నిటి ప్రార్థన విని ఆమెను బలపరిచి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చారు. అది మాత్రమే కాదు ఆమె తల్లి స్వస్థత పొందుకున్న వారమునకు ఆమె యొక్క అన్నయ్య కూడా ఇంటికి వచ్చి చేరుకున్నాడు. 

 

ప్రియమైన తమ్ముడు చెల్లి మీ ఇంట్లో త్రాగుడుకు బానిసైన మీ నాన్నను అనారోగ్యంతో ఉన్న మీ కుటుంబీకుల గురించి ఆలోచించి చింతిస్తున్నావా? మీ చింతలన్నీ కూడా సారు వలే యేసయ్య దగ్గర చెప్పి ప్రార్థించు. ఆమెకు సహాయం చేసిన యేసయ్య నీకు సహాయం చేస్తారు. సరేనా! 

- శ్రీమతి. సారాల్ సుభాష్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal milanobet bahiscasino betpas bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet betplay casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet