By Village Missionary Movement
Friday, 25-Aug-2023దిన ధ్యానము(Telugu) 25.08.2023
అంశం: శతాధిపతి
"యేసు ఈ మాటలు విని, అతనిగూర్చి ఆశ్చర్యపడి, తన వెంట వచ్చుచున్న జనసమూహము వైపు తిరిగిఇశ్రాయేలులో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాననెను" - లూకా 7:9
కొందరు జరిపించిన అసాధారణమైన కార్యాలను చూసి లేదా విని మనం ఆశ్చర్యపోతాము. ఇక్కడ ఒకరి యొక్క గుణాతిశయమును చూసి యేసయ్య ఆశ్చర్యపోయారు అంటే అది మనల్ని కూడా ఆశ్చర్య పరుస్తుంది కదు. అవును యేసుక్రీస్తుని ఆశ్చర్యపరిచిన ఆ వ్యక్తి శతాధిపతి. ఆయన చేసిన సత్క్రియలు ఆయన కలిగి ఉన్న అర్హత. ఆయన జీవితంతో మన జీవితము పోల్చుకుని చూస్తే దేవుడు మెచ్చుకునే వారిగా జీవించుటకు మనం ప్రయాస పడదామా?
శతాధిపతి ఒక సైన్యాధిపతిగా ఉండినప్పటికీ తన పనివాడి పైన ప్రేమ చూపించే వాడిగా ఉన్నాడు. ఆయన తన భార్య బిడ్డల కొరకు యేసయ్యను వేడుకుని ఉంటే అది ఆశ్చర్యము కలిగించేది కాదు కానీ ఆయన అయితే తన పని వారి కొరకు యేసయ్యను వేడుకుంటున్నాడు. మన యొక్క ఆలోచన మనస్తత్వం ఇలా ఉంటుందా? మన గృహాలలో పనిచేసే వారి గురించి మనకు దయ ఉందా?
ఈయన అన్యుడుగా ఉన్నప్పటికీ యూదులను ప్రేమించి వారి కొరకు ఒక దేవాలయం కట్టించి ఇచ్చారు. ఈయన యొక్క విశాలమైన మనస్తత్వాన్ని చూడండి తన కులము కాని వారికి తన మతము కాని వారికి ఇలాంటి కార్యము చేయడంలో తన చేసే సత్క్రియలు ఎలాంటివో మనకి అర్థమవుతుంది. ఒక వృత్తంలో ఆలోచించి ఉండిపోకుండా మన ఆలోచనలు మార్చుకుందాం.
ప్రభువా మీరు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడనుకాను అని తన్ను తాను తగ్గించుకొని తన స్నేహితునికి చెప్పి పంపించాడు. మనం ప్రార్థించేటప్పుడు దేవుని వద్ద మనలను మనము తగ్గించుకుంటాం కానీ మన అనుదిన జీవితంలో మనుషుల వద్ద తగ్గింపు కలిగిన మనసు లేని వారిగా ఉంటున్నాం. ఒక మాట మాత్రము సెలవివ్వండి నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు అనే విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈ దినము మనము మనుషులు చెప్పే అబద్ధమైన వాగ్దానములను నమ్ముతున్నాం కానీ దేవుని వాక్యములో ఉన్న కార్యములు పైన మన విశ్వాసం పెడుతున్నామా? అని మనలను మనం ఆలోచించుకుందాం.
శతాధిపతి పేరు బైబిల్ గ్రంధంలో రాయబడనప్పటికీ జీవ గ్రంథంలో రాయబడి ఉంది. మనము కూడా ఈ లోకంలో పేరు పొందాలి అని ఆలోచన కలిగి ఉండకుండా జీవ గ్రంథములో చోటు దక్కించుకొనుటకు ప్రయాస పడదాం.
- శ్రీమతి. పుష్ప సైమన్ గారు
ప్రార్థన అంశం:
తమిళనాడు రాష్ట్రంలో దేవుని మందిరాలు లేని వెయ్యి గ్రామాలలో దేవుని మందిరాలు కట్టబడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250