Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.08.2023
Share:

By Village Missionary Movement

Monday, 21-Aug-2023

దిన ధ్యానము(Telugu) 22.08.2023

 

అంశం: ప్రకటించే ముందు

 

"కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు" - కీర్తనలు 126:5

 

పిల్లి సందే అనే దేవుని దాసుడు తన ఒక ప్రసంగంలో క్రింద చెప్పబడిన సంఘటనను తరచుగా చెబుతూ ఉండేవాడు. అవిశ్వాసి అయిన కమ్మరి ఒకడు ఉండేవాడు. ఆయన ఎలాంటి క్రైస్తవుడు నా యొద్దకు వచ్చి క్రైస్తవ్యం గురించి మాట్లాడలేడు. నేను అలాంటి వాళ్ళతో వాదించి వాళ్ళ నోరు మూయించేస్తాను అని సవాల్ విసిరి చెప్తుండేవాడు. దీన్ని గ్రహించిన ఆ ఊరికి చెందిన సంఘలో ఉన్న వృద్ధాప్యమైన సంఘ పెద్ద ఈ మనిషిని ఎలాగైనా యేసయ్య వైపు తిరిగేటట్లు చేయాలి అని తలంచి తన భార్యతో కలిసి అతని కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. 

 

ఒక దినము ఆ సంఘ పెద్ద ఆ మనిషిని దర్శించి స్నేహితుడా నేను నా భార్య నీ కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాము అని చెప్పేటప్పుడే ఆ సంఘ పెద్ద కంట్లో నుండి కన్నీరు కారణం ప్రారంభించింది తర్వాత ఆయన ఏమీ మాట్లాడలేకపోయారు. తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు భార్యతో ఈ కార్యని చెప్పినప్పుడు మీరు విడిచిన కన్నీరు ద్వారా దేవుడు వారిలో పనిచేశారు అని చేస్తారు చెప్పినట్లుగానే ఆ సంఘ పెద్ద మాటలు కన్నీరుతో నిండిన కళ్ళు ఆ కమ్మరి హృదయాన్ని కదిలించి వేసాయి. మరలా మరలా ఆ సంఘ పెద్ద యొక్క రూపము ఆయన కనులు ఎదుట కనబడింది. కమ్మరి ఆ ఇంటికి వెళ్లి తనలో ఏర్పడిన మార్పును చెప్పి ఆయన ముందు తన్నుతాను తగ్గించుకొని మోకరించాడు. ఆ దినమే దేవుని బిడ్డగా మారాడు. 

 

మనము మన చుట్టూ ఉన్న ప్రజలకు దేవుని కొరకు చెప్పాలని ఆశిస్తున్నామా? అవకాశాన్ని వెతుకుతున్నామా? అదే సమయంలో ఆ ఆత్మల గురించి హృదయములో భారం కలిగి కన్నీటితో మనం ప్రార్థించడం చేస్తే కచ్చితంగా వారి జీవితంలో మార్పు వస్తుంది. మనము దీనిని చేయకుండా మిగిలిన ప్రయత్నాలు చేస్తే అది ఫలితం లేకుండా పోతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే పాపి అయినా ఒకని యొక్క పాపములు గురించి గద్దిస్తారు. కాబట్టి మనము చెబుతున్న సువార్త ద్వారా పరిశుద్ధాత్ముడు వారి యొక్క హృదయంలో పనిచేయాలి అంటే మన యొక్క కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. 

 

సంఘముల కొరకు వ్యక్తిగత మనుషుల యొక్క రక్షణ కొరకు పౌలు కన్నీటితో ప్రార్థించాడు. మనము కూడా సువార్త ప్రకటించుటకు ఆశిస్తున్న వ్యక్తుల కొరకు భారము కలిగి ప్రార్థిద్దాం. అప్పుడు దేవుడు కచ్చితంగా అవకాశాలు అన్నింటిని ఏర్పరిచి వారి యొక్క హృదయాన్ని సువార్త వైపు తిరిగేటట్లు చేస్తారు అనేదాంట్లో ఎంత మాత్రం సందేహం లేదు. 

- శ్రీమతి. శశికళ పరమశివం గారు 

 

ప్రార్థన అంశం:

మన వి. ఎం. ఎం. ద్వారా ఉత్తర భారత దేశంలో జరుగుతున్న మిషనరీ పరిచర్య కొరకు అక్కడ పనిచేస్తున్న సేవకుల కొరకు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal milanobet bahiscasino betpas bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet betplay casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet