Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.08.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 20-Aug-2023

దిన ధ్యానము(Telugu) 20.08.2023 (Kids Special)

 

అంశం: బి కేర్ ఫుల్

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు. 

 

"కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు" - యోహాను 8:36 

 

ఒక అందమైన కోతి పిల్ల అటు ఇటు గెంతులు వేస్తూ చాలా సరదాగా ఆడుకుంటుంది. మనుషులందరూ పరలోకానికి వెళ్ళిపోతాము అనుకుంటున్నారే అది ఎలా అమ్మ ఉంటుంది అని తల్లిని అడిగింది ఆ కోతి పిల్ల. తల్లి ఈ విధముగా జవాబు చెప్పింది దీని కొరకు ఒక సాధు వద్దకు వెళ్లి అడిగిన ఎడల తెలుస్తుంది అన్నది తల్లి. ఆ కోతి పిల్ల ఆ సాధువు ఉన్న చోటును వెతికి కనుగొన్నది. అదే ప్రశ్నను ఆ సాధువును కూడా అడిగింది. ఆయన కొద్దిగా ఆలోచించి ఆ కోతి పిల్లకు ఒక అరటి పండు ఇచ్చి దీన్ని భద్రముగా దాచి పెట్టుకో రేపు వచ్చినప్పుడు దీనిని తీసుకుని రా అని చెప్పి పంపించాడు. ఆ కోతి పిల్ల కూడా రేపు మనకి జవాబు దొరుకుతుంది అని సంతోషముతో తన ఇంటికి వెళ్ళింది. చేతిలో గల అరటిపండును అటు ఇటు తిప్పి చూసింది దీనిని రేపు జాగ్రత్తగా తీసుకుని వెళ్లాలి అనుకుంది. కొంత సమయం తర్వాత వాసన చూసింది. అబ్బా వాసన చాలా బాగుంది అని నాకీ చూసింది తింటే కదా తప్పు. దాన్ని ఒలిచి చూస్తే తప్పు కాదు కదా అని ఒలిచి చూసింది తర్వాత దీన్ని రేపు ఆ సాధు వద్దకు తీసుకుని వెళ్లాలి అని చెప్పి దాన్ని భద్రంగా దాచింది. ఏదో ఒక పని చేస్తున్నప్పటికీ ఆ అరటి పండును చూడకుండా ఉండలేక పోతుంది. మరలా ఓలిచి చూద్దాం అని దాన్ని ఓలిచి చూసింది నోట్లో నీరు ఊరడం ప్రారంభించింది. పరలోకమా? అరటిపండా? అని ఆలోచన తన మనసులో మెదులుతూనే ఉంది. కొంతసేపటి తర్వాత తాను ఉండలేక అరటి పండును తినేసింది. మరుసటి రోజు అరటిపండు లేకుండా ఆ సాదు యొద్దకు ఎలా వెళ్లగలను? వెళ్ళలేను కదా! 

 

హలో పిల్లలు! పరలోకం గురించి తెలుసుకోవాలి అనుకున్న ఆ కోతి పిల్ల ఆ అరటిపండు ముందు ఓడిపోయినట్లు మీరు కూడా ఈ లోకంలో ఉన్న పాప కార్యాలలో ఓడిపోకూడదు. సాతాను ఎప్పుడు చిన్న అబద్ధమే కదా, చిన్న దొంగతనమే కదా, చెడు మాటలు మాట్లాడితే నిన్ను ఎవరూ చూడరు కదా అని అనేక పాప ఆశలను నీకు చూపిస్తూ ఉంటాడు. దానిని విని ఆయన మాటకు లోబడకుము. ఒక విధముగా తప్పిదము చేసినను దానిని యేసయ్య వద్ద చెప్పి క్షమాపణ అడిగి మరలా తప్పు చేయకుండా క్షమాపణ పొందుకోవాలి. సరేనా పిల్లలు! 

- శ్రీమతి: అంజలి గారు.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet