Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.08.2023
Share:

By Village Missionary Movement

Sunday, 13-Aug-2023

దిన ధ్యానము(Telugu) 14.08.2023

 

అంశం: నిత్య సంతోషం పరిపూర్ణ స్వాతంత్రం

 

"ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము" - రోమీయులకు 5:10

 

1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున భారతదేశమంతా కూడా సంతోషముతో ఆనందకరమైన పాటలతో మారుమోగింది. మన దేశ జెండాను ఎగరవేశారు. మిఠాయిలు తినిపించుకున్నారు. ఆట పాటలతో నిండి ఉన్నారు. కానీ ఎందుకొరకు అనేకులు శ్రమలు అనుభవించి రక్తం కార్చారు? అనేకులు తమ ప్రాణం సైతం త్యాగం చేశారు. మనము జీవించే దేశాన్ని మనదిగా చేసుకొనుటకు అనేకులు ప్రయాస పడవలసి వచ్చింది. అది చెప్పలేనంత విస్తారమైనది మరియు పచ్చికగల శ్రేష్టమైన దేశము స్వాతంత్రము పొందుకొని 76 సంవత్సరాలు అయింది. 

 

ఇతర దేశముల నుండి బానిసత్వంను విమోచన పొందుకున్నాం కానీ మనలను మనం బానిసలుగానే కట్టబడి ఉన్నాం. అందువల్ల సంతోషాన్ని కోల్పోయి ఇంకనూ బానిసలుగానే కొనసాగుతూ ఉన్నాం. ఇంకను కుల, బేధ, భాష, మతము అని కట్టబడి గొడవలతో బెదములతో జీవిస్తూ ఉన్నాం. దేశము నెమ్మది, సమాధానం లేకుండా కనబడుతున్నాం. 

 

1947 సంవత్సరం స్వతంత్రం యొక్క సంతోషము ప్రజలలో కనబడినప్పటికీ కానీ వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉన్నదా అని అడిగితే అవును అని చెప్పలేం. వ్యక్తిగత జీవితంలో చింతలు, కష్టాలు ఉంటూనే ఉన్నాయి. ఆ చింతలు కష్టాలు తీర్చాలి అంటే ఏ మనుషుడి వల్ల కాదు. మన ప్రతి ఒక్కరము పాపము, శాపము, రోగము వీటి నుండి విమోచనం పొంది నెమ్మదిగా ఉండాలి అంటే మనం సృజించిన సృష్టికర్త అయిన దేవుడే ఆయన తన అధికారం నుండి దిగివచ్చి మన శాపాన్ని కష్టాన్ని ఆయన పైన వేసుకుని మనకు రావాల్సిన శ్రమలను శిక్షలను ఆయన మీద వేసి మరణించి జయముగా మూడో దినం తిరిగి లేచి ఉన్నారు. ఈ దినము ఈ నిత్య విమోచనను అందరము పొందుకొని సంతోషముతో సమాధానముతో జీవించాలి. ఈ దినము ఇంకను ఆయన రక్తము చేత కడగబడని వారికి సంతోషము సమాధానము నిత్యజీవితము ఇవ్వడానికి ఆయన సిద్ధమే. 

 

స్వాతంత్ర దినోత్సవం అన్నది అనేక నాయకులు యొక్క త్యాగము వారి యొక్క రక్తము మనకు గుర్తుకు వస్తుంది. శాశ్వతమైన సంతోషము సమాధానము కావాలి అంటే నాకు సంతోషం కావాలని ఎప్పుడూ గ్రహిస్తున్నారో అప్పుడు నీకు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఆయన రక్తముతోనే సాధ్యమవుతుంది. దానిని మీరు అంగీకరించి పాపాన్ని ఒప్పుకొనిన యెడల పాపము కడగ బడి సంతోషాన్ని సమాధానాన్ని మీరు హృదయంలో నిండి ఉండేటట్లు విమోచన దినోత్సవాన్ని కొనియాడవచ్చు. మీరు అతనిని పిలిస్తే అతను వచ్చి మిమ్మల్ని విమోచించుటకు నిత్య ఆనందాన్ని ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నారు మరి పిలుచుటకు మీరు సిద్ధంగా ఉన్నారా? 

- శ్రీమతి. గ్రేస్ జీవమని గారు

 

ప్రార్థన అంశం: 

మన క్యాంపస్ లో జరుగుతున్న ట్యూషన్ సెంటర్ ద్వారా దర్శింపబడుతున్న విద్యార్థులు మరియు టీచర్ల కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al