By Village Missionary Movement
Thursday, 10-Aug-2023దిన ధ్యానము(Telugu) 11.08.2023
అంశం: కేరళ
"నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు" – సామెతలు 11:30
ప్రభు ఏర్పరచుకున్న వారందరూ ఏదో ఒక విధానంలో సందేశాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క జీవితంలోను, వారి యొక్క మరణములోనూ మనకు ఒక సందేశాన్ని విడిచి వెళుతున్నారు. యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులలో ఒకరు బలహీనంగా ఉన్నప్పటికీ ఆయన గాయాలను చూచిన తర్వాత నమ్మినవాడైన తోమా మన భారతదేశంలో గల కేరళ రాష్ట్రంలో ఆయన చేసిన పరిచర్య మరియు ఆయన తరువాత వచ్చిన వారు చేసిన పరిచర్యను చూద్దామా?
క్రీస్తుశకం 38వ సంవత్సరంలో తోమా భారతదేశంలోకి వచ్చారు. ఆయన నావ ప్రయాణం చేసి కేరళ సముద్ర తీర ప్రాంతానికి వచ్చి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువును గురించిన సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. కేరళ రాజైన గుండా ఫారెస్ ఆయనకు ఎక్కువగా సహాయం చేశారు. అక్కడ తోమా 7 క్రైస్తవ దేవాలయములను నిర్మించాడు. 15వ శతాబ్దంలో పోర్చుగీసిలు వచ్చినప్పుడు వారు కూడా పెద్ద సంఖ్యలో పరిచర్య చేశారు. అనేకమంది ఆ సువార్తను అంగీకరించారు. ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా అందరినీ సమానంగా నడిపించారు.
మిషనరీలు సువార్తను ప్రకటించడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. వారు విద్యాసంస్థలు ఆరోగ్య కేంద్రాలు అలానే సమాజ సేవ కూడా చేశారు. సొంత ఊరిలో గల పరిపాలకుల ఆదరణ పొందుకున్నారు. హోమియోపతి వైద్య విధానమును కేరళకు మొట్టమొదటిగా మిషనరీలే పరిచయం చేశారు. బెంజమిన్ బైలీ మరియు హెన్రీ ప్యాకర్ అనేవారు 1813 నుండి 1933 వరకు కోటయంలో గల క్రైస్తవ మిషనరీ సొసైటీ(CMS) కు చెందినవారు. వీళ్లు కోటయంలో గ్రామర్ స్కూల్ లను, ఆలపలలో స్త్రీల బడిని నిర్మించారు.
హేర్మన్ కుండడ్ పాత నిబంధన హిబ్రూ భాష నుండియు, కొత్త నిబంధన గ్రీకు భాష నుండి మలయాళం లోనికి తర్జుమా చేశారు. లండన్ మిషన్ సొసైటీ(LMS) కు చెందిన రెవరెండ్ మీట్ 1817 నుండి1873 తిరుగుదాంగుర్ లో ITI బడులను ప్రారంభించారు. ఆయన భార్య స్త్రీల కొరకు అనేక బడులను ప్రారంభించారు ఇలా కేరళలో మిషనరీలు చేసిన ఉజ్జివపు కార్యాన్ని రాయలేము.
దీనిని చదువుతున్న మీరు కూడా ప్రభువును అంగీకరించి ఆయన కొరకు ఏదైనా చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్!
- సిస్టర్ మంజుల గారు
ప్రార్థన అంశం:-
మన మీడియాలో పనిచేస్తున్న ప్రతి మిషనరీలను దేవుడు బహుగా వాడుకునేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250