By Village Missionary Movement
Wednesday, 09-Aug-2023దిన ధ్యానము(Telugu) 10.08.2023
అంశం: జార్ఖండ్
"తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" - యోహాను 12:25
బీహార్ రాష్ట్రం నుండి విభజింపబడి ఏర్పరచబడిన రాష్ట్రం జార్ఖండ్. మిషనరీల యొక్క సమాధి అని పిలవబడుతున్న బీహార్ వంటి రాష్ట్రమే జార్ఖండ్ కూడా. సువార్త చేయుటకు సవాలుతో కూడిన రాష్ట్రం. ఇది జార్ఖండ్ ప్రజల మధ్యలో వ్యతిరేకతలు అనేదానికంటే అక్కడ ఉన్న అనారోగ్య పరిస్థితులు సువార్తకు వెళ్లే ప్రతి మిషనరీలు కూడా రోగులుగా చేసి మరణించేటట్లు చేస్తుంది. పరిస్థితులు బట్టి జార్ఖండ్ పరిచర్య అంటేనే అక్కడికి వెళ్ళుటకు ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. ఈ రాష్ట్రంలో మాల్టో అనే ఆదివాసీ ప్రజలు మూడు లక్షలకు పైగా కనబడ్డారు.
తమిళనాడులో గల చివరి జిల్లాలో జరిగిన సాయంకాలపు వేల కూడికలో యేసుక్రీస్తు ప్రభువుని ఒక యవ్వనస్తుడు అంగీకరించాడు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన ఆయన మిషనరీ పరిచర్యకు తనను సమర్పించుకున్నాడు. అతడు ధర్మపురి జిల్లాలో కొన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడు. తర్వాత జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న మాల్టో ప్రజల గురించి విని ఆత్మా భారము పొందిన వాడిగా ప్రజల మధ్యకు వెళ్లాలని తన కోరికను ఆ సంస్థ నాయకుడికి చెప్పాడు. అనేక పోరాటాల తర్వాత ఆయన భార్య పిల్లలు అందరూ కలిసి జార్ఖండ్ రాష్ట్రానికి పరిచర్యకు వెళ్లారు. ఏ ప్రజలను ప్రేమించి ఆయన పరిచర్యకు వెళ్లారో అక్కడ ఆయన అనుకున్నట్లు మిషనరీ పనిలో అంత అభివృద్ధి కనిపించలేదు. మరియు అక్కడ మిషనరీ పనికి వ్యతిరేకతలు ఎక్కువయ్యాయి. ఒకసారి ఇతను చేస్తున్న పనిని వ్యతిరేకించి అతని కొట్టి అక్కడ విడిచిపెట్టి వెళ్లిపోయారు. అయినను ఆయన భయపడకుండా అదే ప్రాంతంలో మిషనరీ పని చేస్తూ వచ్చారు. ఆ సందర్భంలో మలేరియా రోగము చేత బాధపడుతూ స్వస్థత పొందకుండానే ఆయన మరియు ఆయన కుమారుడు అదే మాల్టో ప్రజల మధ్యన గోధుమ గింజ వలె మరణించారు.
ఈయన సమాధి కార్యక్రమానికి ఈయన తిరిగి పనిచేసిన ఆ ప్రాంతంలో ఉన్న నివాసులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు కన్నీరు కార్చుట దర్శనంలో చూచి ఉన్నారు. ఈ మిషనరీ పేరు జయరాజ్. ఈయన ద్వారా ఆ మాల్టో ప్రజల మధ్యలో జార్ఖండ్ రాష్ట్రంలో నిర్మించబడిన దేవాలయాలు 116. మాల్టో ప్రజల మధ్యన అనేక ఆత్మలు రక్షింపబడడానికి జయరాజ్ అనే మిషనరీ గోధుమ గింజగా విత్తబడి ఉన్నాడు. ఈయన గురించి ఈయన తర్వాత స్టాన్ అగోరి అనే మిషనరీ కూడా ఈ ప్రజల కొరకు గుంపుగా పరిచర్య చేసి అనేక సంఘములను కట్టగలిగాడు. క్రైస్తవులు లేని ఈ రాష్ట్రంలో పరిచర్య చేసి అనేక సంఘములను నిర్మించగలిగారు. 8 శాతం మంది ప్రజలు క్రైస్తవులుగా కనపడడానికి కష్టపడి పనిచేసింది ఈ మిషనరీలే. యేసుని ఎరుగని ప్రజల మధ్యకు వెళ్లి యేసుని ప్రకటించుటకు వచ్చే తరం వారు లేపబడేటట్లు ప్రార్థిద్దాం
- బ్రదర్. జాకబ్ శంకర్ గారు
ప్రార్థన అంశం:
తిరునల్వేలి లో జరగనున్న యవ్వనస్తుల ఉజ్జీవ కూటములో మైదానంలో వేయబడుతున్న స్టేజ్ మరియు సౌండ్ సెట్టింగ్ అన్ని విధాల చక్కగా అమర్చబడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250