Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.08.2023
Share:

By Village Missionary Movement

Wednesday, 09-Aug-2023

దిన ధ్యానము(Telugu) 09.08.2023

 

అంశం: అస్సాం

 

"ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడిన వారము" - రోమీయులకు 8:36

 

అస్సాం రాష్ట్రం వేలకొలది ఆదివాసి ప్రజలను కలిగిన మనదేశంలో గల ఒక రాష్ట్రం. వీరు మిక్కిలి నైపుణ్యత కలిగిన వేటగాళ్లు. యేసు వెంబడి వెళ్ళుటకు నిర్ణయించుకున్నాను అనే పాట ఎరుగని వారు ఎవరు ఉండకపోవచ్చు. ఈ పాట ఈ అస్సాంలో ఒక హతసాక్షి మరణ సమయంలో పాడిన పాట. ఎలాంటి శ్రమ అయినా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాయదు అని ధైర్యంతో విశ్వాసముతో జీవించి మరణించిన ఒకరి యొక్క అనుభవ పూర్వకమైన మాటలే ఈ పాట. 

 

అమెరికా బాప్టిస్ట్ మిషన్ ద్వారా పంపబడిన మిషనరీ 'కరో' అనే ఈయన ఆదివాసీ ప్రజల మధ్యన పరిచర్య చేయుటకు వెళ్లారు. అప్పుడు ఇద్దరు పిల్లలు గల ఒక కుటుంబము యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించింది. అందునుబట్టి కోపగించుకున్న ఆ గ్రామ నాయకుడు గ్రామ ప్రజలు అందరినీ పిలిపించాడు. క్రీస్తును అంగీకరించిన ఆ కుటుంబాన్ని గ్రామ ప్రజల మధ్యలో నిలబెట్టి మీ నమ్మకాన్ని విడిచిపెట్టుము లేనియెడల మరణాన్ని చవిచూస్తారు అని చెప్పాడు. కానీ ఆ వ్యక్తి అయితే నేను యేసయ్యను వెంబడించుటకు నిర్ణయించుకున్నాను అని చెప్పాడు నే వెనుతిరుగను అని చెప్పాడు. ఆయన మాటలకు కోపగించిన ఆ నాయకుడు తన ఇద్దరు బిడ్డలను కూడా బాణముతో చంపేశాడు. దానిని చూచిన తర్వాత కూడా ఆ వ్యక్తి అయినను నే వెనుదురుగను అని చెప్పాడు. అప్పుడు ఆయన భార్య కూడా చంపబడింది. తర్వాత ఇదే నీకు చివరి అవకాశం అని ఆ బాణాన్ని ఆయన వైపు గురి పెట్టినప్పుడు సిలువ నా ముందు లోకము నా వెనుక కాబట్టి నే వెనుదిరిగి చూడను అని చెప్పిన వెంటనే ఆయన కూడా చంపబడ్డాడు. 

 

ఈ వ్యక్తి యొక్క మరణము వలన క్రైస్తవ్యము మన గ్రామంలో పతనం అయిపోతుంది అని ఆ ప్రజలు తలంచారు కానీ వారు అనుకున్న విధముగా జరగలేదు. ఆ వ్యక్తి యొక్క మరణము ఆ గ్రామ నాయకుడి యొక్క హృదయాన్ని కదిలిచివేసింది. 2000 సంవత్సరాలకు మునుపు ఈ లోకానికి వచ్చిన ఒకరి కొరకు ఒక కుటుంబం మొత్తం కూడా చావడానికి సిద్ధమైతే ఇందులో ఏదో ఒక శక్తి ఉన్నది. ఇటువంటి శక్తి కలిగిన దేవున్ని నేను కూడా తెలుసుకోవాలి అని ఆ గ్రామ నాయకుడు సిద్ధపడ్డాడు. ఈ సందేశం ఆ ప్రాంతంలో గల అందరిని కూడా కదిలించింది. అందులో అనేకమంది యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించారు. అమెరికాలో పాటల రచయిత అయిన విలియం జెన్ సన్ రెనాల్ట్ 1959వ సంవత్సరంలో ఈ పాటను పాటల పుస్తకములో చేర్చుకున్నారు. 

 

దీనిని చదువుతున్న ప్రియులారా! ఉజ్జీవము ఆశిస్తున్నారా? ఉజ్జీవము కొరకు ప్రార్థిస్తున్నారా? అలా అయితే ఇలాంటి విశ్వాసము, పౌరుషము మనకు కూడా ఉండాలి. ఇవి లేనందున ఆ ఉజ్జీవము ఆలస్యం అవుతుందేమో కాబట్టి ఇలాంటి విశ్వాసము, పౌరుషము కలిగి దేవుని మీద ప్రేమతో ప్రతి ఒక్కరము కూడా ధైర్యంతో ముందుకు వెళ్దాం, ఉజ్జీవాన్ని చూద్దాం. 

- శ్రీమతి జ్యోతి స్టాలిన్ గారు

 

ప్రార్థన అంశం:-

తిరునల్వేలిలో యవ్వనస్తుల ఉజ్జీవ క్యాంపులో ప్రార్థిస్తున్న 7000 మంది వచ్చేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet giriş bets10 extrabet royalbet süperbetin jojobet padişahbet holiganbet betcio romabet giriş romabet queenbet bahiscasino markajbet bahiscasino atlasbet casibom matbet matbet giriş