By Village Missionary Movement
Monday, 07-Aug-2023దిన ధ్యానము(Telugu) 08.08.2023
అంశం: గుజరాత్
"భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవాతట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారము చేసెదరు" - కీర్తనలు 22:27
భారతదేశంలో గల గుజరాత్ రాష్ట్రంలో క్రైస్తవులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. అనగా వందల సంవత్సరాల మునుపు గుజరాత్ లో గల సముద్ర తీరమున దామన్ మరియు డయూ పోర్చుగీసియులు తమ ఆధీనంలో పెట్టుకునేవారు. వారి వలన క్యాథలిక్ మతము భారతదేశంలోనికి వచ్చింది. 16వ శతాబ్దంలో గుజరాత్ లో మొట్టమొదటిసారిగా క్రైస్తవులతో పరిచయం ఏర్పడింది. ఫ్రెంచ్ మిషనరీ జోర్డాన్స్ గేడాలాని 1320 సంవత్సరం సూరత్ కు వచ్చారు. ఆయన గుజరాత్ లో పరిచర్య ప్రారంభించిన మొట్టమొదటి ఐరోపియుడు.
బ్రిటిష్ పార్లమెంట్లో 1800ల సంవత్సరమున ఏర్పరచబడిన బ్రిటిష్ సమస్త ఆధీనంలో గల క్రైస్తవ మిషనరీలు రావడానికి అనుమతించబడింది. మిషనరీలు జాన్. డీలర్ 1821, జోసెఫ్ టైలర్ 1852వ సంవత్సరం జే. వి. ఎస్ టైలర్ 1881 మరియు డాక్టర్ జి.పి టైలర్ అనేవారు మిషనరీలుగా వచ్చారు. మిషనరీలు 20వ శతాబ్దం మొదలుకొని మొదటి భాగంలో స్కూల్స్ నిర్మించారు. గుజరాత్ లో అనేక ఉత్తర భారత దేశ సంఘాలు గల డైసిస్ ఉన్నది. ఇది సి.ఎన్.ఐ మరియు సి.ఎస్.ఐ చర్చిలతొ కలిసి గొప్ప ప్రొటెస్టెంట్ సంఘముగా ఉన్నది. సాల్వేషన్ ఆర్మీ మరియు ఆలయన్స్ సంఘాలు కూడా ఈ రాష్ట్రంలో చూడవచ్చు.
గుజరాత్ ప్రజలు క్రీస్తుని తెలుసుకోవాలని అనేక పరిచర్యలను దేవుడు ఇక్కడ లేపి ఉన్నాడు. అలా పరిచర్య చేసినప్పుడు అనేక వ్యతిరేకతలను సేవకులు ఎదుర్కొన్నారు. ఒక దినము సాయంకాల కూడిక కొరకు ఇద్దరు సేవకులు కొండ ప్రాంతాల్లో నడుస్తూ వెళ్తున్నారు. ఆ ఇద్దరు సేవకులను ఎలాగైనా చంపాలి అని చెప్పి ఒక గుంపు వారు తుపాకీలతో వేచి ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ల పైన గురిపెట్టి కాల్చడం ప్రారంభించారు. దేవుడు వారికి సంరక్షకుడిగా ఉండి ఆ తుపాకీలలో నుండి ఒక్క తూట కూడా బయటకు రాకుండా వాళ్లను సంరక్షించారు. తుపాకీలతో కాల్చుటకు వచ్చిన గుంపు వారు ఏమిటి వింత అని భయపడి ఆ సేవకుల యొక్క పాదాలు పైన పడి మీ దేవుని కొరకు మాతో చెప్పండి. ఆయనను మేము అంగీకరిస్తాము అని చెప్పి అక్కడే యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. ఇలా అనేక అద్భుతాలు యేసుప్రభు ఈ దినము వరకు కూడా గుజారత్ రాష్ట్రంలో జరిగిస్తున్నారు. ఆమెన్! హల్లెలూయ!
- శ్రీమతి. బెర్లిన్ సెల్లబాయి గారు.
ప్రార్థన అంశం:
తిరునల్ వేలిలో జరగబోతున్న యవ్వనస్తుల ఉజ్జీవ కూడికలో వాక్య పరిచర్య చేయబోతున్న దేవుని దాసులను దేవుడు బలముగా వాడుకునేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250