Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.08.2023
Share:

By Village Missionary Movement

Monday, 07-Aug-2023

దిన ధ్యానము(Telugu) 07.08.2023

 

అంశం: వెస్ట్ బెంగాల్

 

"మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి" - మార్కు 16:15

 

క్రీస్తు కొరకు విత్తబడిన గోధుమ గింజలో ఒకరు విలియం కేరి. ఆయన వెస్ట్ బెంగాల్ ప్రాంతమునకు చేసిన పని చాలా గొప్పది. ఇంగ్లాండ్లో జన్మించిన ఈయన అనేక భాషల్లో నైపుణ్యత గలవాడిగా బోధకుడిగా ఉండి ప్రభువు యొక్క పిలుపునకు లోబడి తన భార్య పిల్లలతో డ్యానిష్ నావలో కలకత్తా వచ్చి చేరుకున్నారు. తన యొక్క ప్రాణాత్మ శరీరాలను మన భారతదేశమునకు కానుకగా సమర్పించారు. ఆయన మరలా తిరిగి తన సొంత దేశమునకు వెళ్ళనే వెళ్ళలేదు. 

 

కొత్త దేశము, కొత్త ప్రకృతి, నూతనమైన అలవాట్లు, కొత్త భాష ఇలాంటి పరిస్థితులలో బెంగాలీ భాషను నేర్చుకుని సువార్త పనిని ప్రారంభించాలి అనుకున్నారు. మాల్ట అనే ప్రాంతంలో ఒక జూట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ బెంగాలీ భాషను మరియు మరాఠీ భాషను నేర్చుకున్నారు. 

 

1800 వ సంవత్సరం విలియం కేరి, విలియం వాడ్, యోష్వా మాస్ మాన్ అనేవారు డ్యానిష్ నగరమైన సిరంపూర్ అనే స్థలమునకు వచ్చి సువార్త పనిని ప్రారంభించారు. తరువాత దినాలలో అనారోగ్యం వలన తన భార్యను తన పిల్లలను కూడా కోల్పోయినప్పటికీ సువార్త పనిని, విద్యను కొనసాగించారు. 1801వ సంవత్సరం కొత్త నిబంధనను బెంగాలీలో తర్జుమా చేశారు. దానిని ముద్రించే పనిలో విలియం వాడ్ యోష్వా మాస్ మాన్ మరియు ఆయన భార్య హన్న కలిసి పని చేశారు. దినాజ్పూర్ లో 40 మంది విద్యార్థులతో ప్రారంభించబడిన విద్యాసంస్థను నడిపిస్తూ వచ్చారు. వాళ్లు ప్రారంభించిన సిరంపూర్ ప్రస్తుతం యూనివర్సిటీగా మారింది. క్రైస్తవ ప్రపంచానికి ఆయన విత్తనం వేసిన వ్యక్తిగా ఉన్నారు. భారత సమాజపు పనిలో ముందుండి 'సతి' భర్త మరణిస్తే అతనితోపాటు భార్య కూడా మరణించాలి అనే క్రూరమైన మూఢ నమ్మకాన్ని నిలిపి వేయుటకు కారణమయ్యారు. యేసుక్రీస్తు ప్రభువు అన్య దేశ ప్రజలకు మాత్రమే కాదు అన్ని దేశస్థులకు చెందిన దేవుడు అనే నిజానికి తగినట్టు బెంగాలీలో ఆయన మాట్లాడిన మాటలు ఇతర మతస్తులను కూడా ఆకర్షించాయి. అనేక భాషలు నేర్చుకుని ఆయా భాషల్లో బైబిల్ తర్జుమా చేయడమే ఆయన పనిగా ఉండేది. చాలా ప్రయాసపడి తర్జుమా చేసిన పత్రికలు మరియు ప్రింటింగ్ ప్రెస్ అంతా కూడా కాలిపోయింది కానీ సోలిపోకుండా మరలా తర్జుమా పనిని ప్రారంభించారు. బైబిల్ చదవడానికి చదువు అవసరమని గ్రహించిన ఆయన స్కూల్స్ ప్రారంభించారు అవి ఇప్పుడు యూనివర్సిటీగా రూపుదిద్దుకున్నాయి. ఈ విధముగా ఆయన వేసిన విత్తనాలు వెస్ట్ బెంగాల్లో అనేకులు దేవుని ప్రేమను ఎరిగేటట్లు చేశాయి. దేవుని యొద్ద నుండి గొప్ప కార్యములు ఎదురు చూడుము దేవుని కొరకు గొప్ప కార్యములు చేయుము. ఆమెన్

- శ్రీమతి. భువన ధన బాలన్ గారు 

 

ప్రార్థన అంశం: 

తిరునల్ వేలి లో యవ్వనస్తుల క్యాంపు జరుగుతున్న మైదానంలో దేవుని క్రియ బలముగా జరిగేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet güncel giriş holiganbet holiganbet giriş casibom giriş casibom casibom giriş casibom matbet matbet giriş casibom casibom giriş supertotobet supertotobet giriş imajbet imajbet giriş perabet perabet giriş coinbar coinbar giriş klasbahis klasbahis giriş ngsbahis ngsbahis giriş matbet matbet giriş casibom casibom giriş nakitbahis nakitbahis giriş marsbahis marsbahis giriş interbahis interbahis giriş mariobet mariobet giriş betpas betpas giriş artemisbet artemisbet giriş betsmove betsmove giriş restbet restbet giriş egebet egebet giriş https://yourfilterconnection.com/ jojobet jojobet giriş Hiltonbet Hiltonbet giriş jojobet alobet alobet giriş betcio betcio giriş grandpashabet grandpashabet giriş holiganbet holiganbet giriş jojobet jojobet giriş jojobet jojobet giriş pashagaming tarafbet editörbet perabet perabet giriş grandbetting hitbet xslot sweet bonanza betkom giriş sweet bonanza betkanyon giriş perabet perabet giriş jojobet holiganbet jojobet cratosroyalbet betgit jojobet betpuan gameofbet grandpashabet grandpashabet teosbet holiganbet Hiltonbet Hiltonbet giriş grandpashabet imajbet matbet