Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.08.2023 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 06-Aug-2023

దిన ధ్యానము(Telugu) 06.08.2023 (Kids Special)

 

అంశం: అల్లరి చిన్నది పాళీ

 

ప్రత్యేకముగా చిన్న పిల్లల కొరకు

 

"అడుగు ప్రతివానికియ్యబడును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను" - లూకా 11:10

 

హలో బుజ్జి పిల్లలు ఎలా ఉన్నారు? స్కూల్ ప్రారంభించి రెండు నెలలు అయిపోయాయి ఎలా చదువుతున్నారు? సంతోషంగా స్కూల్ కి వెళ్తున్నారా? మీతో పాటు చదువుతున్న ఇతర పిల్లలను చూసిన వెంటనే మీకు కూడా వాలాంటివే కొత్త డ్రెస్సు, కొత్త పెన్ను, కొత్త బ్యాగు, ఇలా అన్ని కొత్తగా కొనాలి అని ఆశగా ఉంది కదూ? ఇలాగే మూడవ తరగతి చదువుతున్న పాళీకి కూడా ఒక ఆశ కలిగింది. ఆమె యొక్క ఆశను ఎవరి వద్ద చెప్పిందో ఇదే ఈరోజు కథలో మనం నేర్చుకుందాం. 

 

పాళీ చాలా అల్లరి గల చిన్నది. చక్కగా చదువుతాది, పాడతాది, డాన్స్ వేస్తాది మరియు తల్లిదండ్రులకు మంచిగా లోబడుతుంది. పాళీకి పళ్ళు అంటే చాలా ఇష్టం. ఆ దినము ఇంట్లో స్నాక్స్ ఏవీ లేనందువలన స్కూల్ కి లంచ్ బాక్స్ మాత్రమే తీసుకొని వెళ్ళింది. సాయంత్రం స్నాక్స్ టైమ్ వచ్చింది. అందరూ స్నాక్స్ తినడం ప్రారంభించారు. వాళ్లను చూసి పాళీకి చాలా ఆశ కలిగింది. పళ్ళు తినాలి అనే ఆలోచన వచ్చింది. అలాగని ఆ పండ్లు కొరకు పాళీకి ఎవరి దగ్గర చేయి చాపడానికి ఇష్టం లేదు. అందుకని కళ్ళు మూసుకుని తన హృదయములో యేసయ్య నాకు అంజూర పండ్లు తినాలి అని ఆశ కలుగుతుంది అని ప్రార్థించింది. స్కూల్ అయిపోయింది. 

 

స్కూల్ నుండి ఇంటికి వచ్చిన పాళీకి ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఆమె ఆశగా కోరుకున్న అంజూర పండ్లు ఒక బల్ల మీద పెట్టి ఉంచబడ్డాయి. దానిని చూచిన వెంటనే పాళీకి చాలా సంతోషం అనిపించింది. వెంటనే అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ నేను స్కూల్ కి వెళ్ళినప్పుడు మన ఇంట్లో ఎలాంటి పండ్లు లేవు కదా మరి ఇప్పుడు ఎలా వచ్చాయి అని అడిగింది. మధ్యాహ్నం ఒక తాతయ్య ఈ పండ్లను తీసుకుని వచ్చి నాకు ఇచ్చి మీ పిల్లలు వచ్చినప్పుడు ఇది వాళ్లకు ఇవ్వండి అని చెప్పారు. వెంటనే పాళీకి స్కూల్లో తను చేసిన ప్రార్థనను తన అమ్మకు చెప్పి ఆ పండ్లను తిన్నది. 

 

ప్రియమైన తమ్ముడు, చెల్లి పాళీని చూశారా? తన కోరికను ఎవరి దగ్గర చెప్పింది? అవును తన కోరికను యేసయ్య దగ్గర చెప్పడం వలన ఆమె కోరికను యేసయ్య నెరవేర్చారు. ఇలాగే మీయొక్క కోరికను కూడా యేసయ్య దగ్గర చెప్పండి యేసయ్య ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఓకేనా! 

- శ్రీమతి సారాల్ సుభాష్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al