Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.08.2023
Share:

By Village Missionary Movement

Friday, 04-Aug-2023

దిన ధ్యానము(Telugu) 04.08.2023

 

అంశం: నెమ్మదిగల జీవితం

 

"రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను" - 1 తిమోతికి 2:2

 

ఆగస్టు నెల అంటేనే స్వాతంత్ర దినోత్సవం మనకు గుర్తుకు వస్తుంది. ప్రజల యొక్క పరిపాలన అని చెప్పే మన భారతదేశంలో ప్రజలే ప్రజల కొరకు పరిపాలించుట అనే విధానం. దీనికి భిన్నముగా కార్యములు జరుగుతున్నాయి. కాబట్టి అనేక సమయాల్లో మనం వినిపిస్తున్నాం. అందుకొరకు బైబిల్ మనకు ఒక వాగ్దానం ఇస్తుంది. మీరు భక్తి గల జీవితం జీవించుటకు రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థించాలి అన్నదే ఆ నెమ్మది గల జీవితమునకు వాగ్దానం. 

 

బైబిల్లో ఎప్పుడూ దీవెనలు, వాగ్దానములు షరతులతో కూడినదిగా ఉంటుంది. అందరూ కోరుకున్నట్లు లేదా అందరికీ అవసరం అయిన ఈ వాగ్దానమును పొందుకొనుటకు సులువైన మార్గం నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించాలి. మనకు ఇది కఠినమైన కార్యము కాదు. నాయకులు, అధికారంలో గల వాళ్లు కూడా మనుషులే మనలాంటి లోపము కలవారే వాళ్ళు యొక్క లోపమును మనుషుల యొద్ద చెప్పకుండా దేవుని యొద్ద చెప్పి వాళ్లను ప్రార్థనలో ఆదుకోన్నప్పుడు మనము కలతలేని నెమ్మదిగల జీవితం జీవించవచ్చును. మనవలే ఇతరులు కూడా నెమ్మది పొందుకోవాలి అంటే నాయకులు, అధికారులు బలముగా లోపం లేకుండా ఉండు లాగున మనం ప్రార్థించాలి. ఎస్తేరు గ్రంథము దాని కొరకే ఇవ్వబడింది. మూడు దినములు ఉపవాసం ఉండి ఏక మనసు కలిగి ప్రార్ధించినప్పుడు దుఃఖము, ఏడుపు, బాధ మారిపోయింది. వెలుగు సంతోషం ఘనత ఏర్పడింది. అంతరంగమును చూసిన తండ్రి బాహ్యంగా ఫలితం ఇచ్చారు. మత్తయి సువార్త 6: 4 లో ఉన్న వాక్యానుసారముగా మనము ప్రార్థన చేసినప్పుడు కలత లేని నెమ్మదిగల జీవితాన్ని జీవించవచ్చు. 

 

ప్రియమైన వారలారా! మనము నెమ్మదిగల జీవితమును జీవించుటకు మనమందరము ఆశించినవారమే. అలాగైతే రాజుల కొరకు ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థించవలసినది మన బాధ్యత అని గ్రహిద్దాం. మనము చేస్తున్న చిన్న సాధారణ ప్రార్థన వదిలేస్తే కలత వచ్చి మనలను ఇబ్బంది పరుస్తుంది. దీవెనలతో పాటు షరతులు కూడా చెప్పి మన పిల్లలు యొక్క జీవిత దినములు విస్తారముగా ఉండుటకు తల్లిదండ్రులను సన్మానించాలి అని వాళ్లకు కలతలేని విశ్రాంతి గల జీవితమును జీవించుటకు మన నాయకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థిద్దాం. ఈరోజు నుండి కుటుంబ ప్రార్థనలో రోజు దేశం కొరకు ప్రార్థిద్దాం. స్త్రీల ఐక్యత, పురుషుల ఐక్యత అని విశ్వాసులతో కలుసుకున్నప్పుడు దేశం కొరకు ప్రార్థిద్దాం. అప్పుడు కచ్చితంగా దేశములో గొప్ప మార్పును చూస్తాము. 

- శ్రీమతి. జ్యోతి స్టాలిన్ గారు 

 

ప్రార్థన అంశం:

తిరునల్వేలి చుట్టూ ఉన్న జిల్లాలలో యవనస్తులు యవ్వనస్తుల కొరకు ఏర్పాటు చేయబడిన కూడికలో పాల్గొనేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet