By Village Missionary Movement
Monday, 31-Jul-2023దిన ధ్యానము(Telugu) 01.08.2023
అంశం: ఉత్తర ప్రదేశ్
"అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును" - యెషయా 35:1
భారతదేశంలో గల రాష్ట్రాలలో సువార్త వాసనే లేని రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. ఒక పిన్ కొడ్ నకు ఒక్క క్రైస్తవుడు కూడా కనబడుట అరుదు. మన దేశం యొక్క ప్రజాసంఖ్యలో ఇంచుమించు 20% మంది ప్రజలు అక్కడే ఉన్నారు అని లెక్కించబడింది. భారతదేశంలో గల ఈ గొప్ప రాష్ట్రమునకు సువార్త ప్రకటించుటకు ప్రభువు ఎంచుకున్న పాత్ర అమెరికాకు చెందిన స్టాన్లీ జోన్స్ అనే వ్యక్తి.
అమెరికాలో గల మేరీ ల్యాండ్ అనే ప్రాంతములో గల బాల్ డి మోర్ భాగంలో జన్మించారు స్టాన్లీ జోన్స్. అమెరికన్ మెథడిస్ట్ దేవాలయంలో సభ్యుడిగా ఉండిన ఈయన 1907 సంవత్సరం చాలా పెద్ద ప్రయాణం చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గల లక్నోకు వచ్చారు. అమెరికన్ మిషనరీ సంఘము ద్వారా స్టాన్లీ జోన్స్ ఆదరించబడ్డారు. ఉత్తర ప్రదేశ్ లో చదువు లేని ప్రజలు మరియు సమాజంలో తక్కువ స్థాయిలో గల జాతి ప్రజలు అని అన్ని భాగాలలో కూడా తన పరిచర్య చేస్తూ వచ్చారు. ఉత్తర్ ప్రదేశ్ లో మొట్టమొదటిగా క్రైస్తవ మిషన్ హాస్పిటల్ ని స్టాన్లీ ప్రారంభించి ప్రజలకు సువార్త పరిచర్య చేశారు. మరియు అనేక స్థలాల్లో వీధుల్లో నిలబడి సువార్తను ప్రకటించారు. ఈయన యొక్క ఎడతెగని ప్రయాస వలన అక్కడక్కడ ప్రజలు రక్షించబడ్డారు. ద క్రైస్ట్ ఆఫ్ ద ఇండియన్ రోడ్స్ అనే ఈయన యొక్క పుస్తకం చదివిన అనేకమంది అన్యులు యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించె విధముగా మార్చింది. ఈయన పరిచర్యలో మన దేశ పీత అయిన మహాత్మా గాంధీ కూడా ఆకర్షించబడ్డారు. గాంధీకి మంచి స్నేహితుడిగా కూడా స్టాన్లీ జోన్స్ ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్రలో గల కొన్ని దక్షిణ భారత రాష్ట్రాల్లో కూడా ఈయన ప్రయాణం చేస్తూ పరిచరి చేశారు. క్రైస్తవ ఆశ్రమం ఒకటి నిర్మించి దాని ద్వారా వేలకోలది మంది ప్రజలకు సువార్త ప్రకటించారు. సువార్త లేని ఉత్తర్ ప్రదేశ్ స్టాన్లీ జోన్స్ యొక్క తీవ్రమైన ప్రయాసవలన సువార్త పనిచేయడం ప్రారంభించింది. స్టాన్లీ జోన్స్ ఆయన విత్తిన విత్తనం వంటి బైబిల్ వాక్యములు మొలిచి ఈ దినము ఫలితం ఇచ్చే విధంగా కనబడుతుంది. ఈ దినము ఉత్తరప్రదేశ్లో అనేకమంది మిషనరీలుగా పనిచేసినప్పటికీ వారందరికీ మార్గదర్శకుడిగా స్టాన్లీ జోన్స్ యొక్క పనులు ఉండేవి అనేదాన్ని ఎవరు కూడా మరువలేరు. ఈ గొప్ప దేవుని దాసుని కొరకు మనము దేవుని స్తుతిద్దాం.
- బ్రదర్. జాకబ్ శంకర్ గారు
ప్రార్థన అంశం:-
ఈ నెల అంతా జరగబోతున్న పరిచర్యలో దేవుని హస్తముతోడైయుండి నడిపించేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250