By Village Missionary Movement
Monday, 31-Jul-2023దిన ధ్యానము(Telugu) 31.07.2023
అంశం: దయ చూపుము
"బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును" - సామెతలు 19:17
ఒక ఈస్టర్ దిన ఉదయ కాలమున దైవభక్తి కలిగిన ఒకాయన ఆరాధనకు వెళుతూ ఉన్నాడు. మార్గమధ్యంలో ఒక పేద వ్యక్తి సరియైన వస్త్రములు లేక చలిలో వణుకుతూ ఉన్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన ఆయన హృదయము కదిలించబడింది. మరియొక డ్రెస్ కొరకు వెళ్లి వచ్చేలోగా ఆయన ఆ చలిలో మరణిస్తాడేమో అని భయపడ్డాడు. వెంటనే తాను ధరించి పొడవైన కోటును విప్పి దానిని రెండు ముక్కలుగా చేసి సగభాగాన్ని చలి కొరకు తాను కప్పుకొని మిగిలిన మరియొక భాగాన్ని ఆ పేద వ్యక్తికి ఇచ్చి అలాగే ఆరాధనకు వెళ్ళాడు. హఠాత్తుగా ఆయన కన్నుల ముందు ప్రభువు వానికి ఒక దర్శనమిచ్చాడు. మహిమ కలిగిన దేవునిగా కనబడిన ఆయన శరీరంలో సగం కోటు మాత్రము ధరించుకొని ఉన్నారు. దీనిని చూచిన ఆ వ్యక్తి నేను సహాయం చేసినది యేసయ్యకా అని ఆశ్చర్యపడ్డాడు. అయ్యో ప్రభువా ఇలాగనే తెలిసి ఉంటే నా పూర్తి కోటు నీకు ఇచ్చేవాడిని అని ఆలోచించి బాధపడ్డాడు.
ఇతరుల యొక్క మేలు కరకు పనిచేసేవారు కరువైపోతున్న కాలంలో జీవిస్తున్న మనము ఇతరులకు సహాయం చేయడం వలన వచ్చే కష్టాలను ఎవ్వరూ ఇష్టపడడం లేదు. మనకు ఇబ్బంది కలుగకుండా ఇతరులకు సహాయం చేయలేము. ఈ దినము బైబిల్ భాగంలో మిక్కిలి కష్టములలో ఉండినప్పటికీ దేవునికి ఇచ్చిన మాసిదోనియా సగం గురించి చదువుతా ఉన్నాం. అవును క్రీస్తు నడిచిన మార్గంలో మనం నడవకుండా ఇతరులకు సహాయం చేయకుండా మనము సంతోషాన్ని అనుభవించలేము.
ప్రియమైన వారలారా! మనము లేమిలో కూడా ఇతరులకు సహాయం చేసే మనసు మనకు ఉందా? ఇతరులకు ఇచ్చుటవలన మనకు కష్టం వచ్చినప్పటికీ దాన్ని సహించుకుంటున్నామా? మన చేతులు గాయపడే వరకు ఇతరులకు ఇస్తూ ఉందాం.
- శ్రీమతి. జాస్మిన్ పాల్ గారు
ప్రార్థన అంశం:
మన ఫీల్డ్ కి ద్విచక్ర వాహనములు అవసరమై ఉన్నది కాబట్టి సహాయం చేసే వ్యక్తులు లేచేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250