By Village Missionary Movement
Sunday, 30-Jul-2023దిన ధ్యానము(Telugu) 29.07.2023 (Kids Special)
అంశం: తేనెటీగవలె
ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు
"అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి" - కీర్తనలు 19:10
విమల్ కి శుక్రవారం సాయంకాలం వస్తే చాలా సంతోషం వస్తుంది. ఎందుకంటే శని ఆదివారాలలో సెలవులు కాబట్టి పక్క గ్రామంలో ఉంటున్న తాతయ్య ఇంటికి వెళ్లాలి అంటే అతనికి చాలా ఇష్టం. మీకు కూడా తాతయ్య అమ్మమ్మ ఇల్లు అంటే ఇష్టమే కదా? మంచిది. విమల్ తాతయ్య ఇంట్లో ఉంటున్న సీజర్ అనే కుక్కతో ఆడుకుంటూ ఉంటే సమయం ఎలా గడిచి పోతుందో కూడా తెలియదు. సీజర్ కూడా తోకను ఆడిస్తూ అరుస్తూ తన ప్రేమను చూపిస్తూ ఉంటుంది. తాతయ్య ఉదయాన్నే వేగంగా లేచి ప్రార్థన చేసి బైబిల్ చదివేసి తర్వాత తన ఇంట్లో గల రెండు ఆవులను మేపడానికి తీసుకువెళ్లేవారు. విమల్ నీవు కూడా లేచి ప్రార్థన చేసి బైబిల్ చదువు అన్నారు తాతయ్య. మీరు వెళ్ళండి తాతయ్య ఈరోజు సెలవే కదా నన్ను పడుకొనివ్వండి అని అన్నాడు విమల్. కొంతసేపు తర్వాత అమ్మమ్మ కూడా లేచి ప్రార్థన చేసి బైబిల్ చదువుతూ ఉన్నారు.
నిద్రలో నుండి లేచిన విమల్ బైబిల్ చదువుతున్న అమ్మమ్మను చూసి ఆశ్చర్యపోయేవాడుగా ఏంటిది తాతయ్య అమ్మమ్మ ఇద్దరు కూడా పోటాపోటీగా బైబిల్ చదువుతున్నారే దీంట్లో ఏముంది అని ఆలోచించాడు. తాతయ్య ఆవులను కాసి ఇంటికి వచ్చారు. ఆవులకు అవసరమైన ఆహారం పెట్టి నీళ్లు పెట్టారు. సీజర్ తో ఆడుకుంటున్న విమల్ పక్కనే ఉన్న చెట్టుకు తేనె పట్టు ఉండడం చూశాడు. విమలకు తేనె తినాలని ఆశ ఉంది. తాతయ్య ఇక్కడికి రండి ఎంత పెద్ద తేనె పట్టు ఉందో చూడండి. ఏంటి పిల్లలు మీరు తేనెను ఎప్పుడైనా తిన్నారా? తినడానికి చాలా రుచిగా ఉంటుంది కదూ. తాతయ్య కూడా శ్రద్ధతో ఆ తేనె పట్టును తీసి విమల్ చేతికి ఇచ్చారు. ఇంతలో అమ్మమ్మ కూడా అక్కడికి వచ్చారు. తేనే రుచి చూసి చెప్పారు బైబిల్ వాక్యము తేనెకంటే చాలా రుచిగా ఉంటుంది విమల్ అని అన్నారు. అందుకే నేను, తాతయ్య ఉదయాన్నే లేచి బైబిల్ చదువుతూ ఉన్నాం అని చెప్పినప్పుడు విమల్, సరే అమ్మమ్మ ఇకనుండి నేను కూడా బైబిల్ చదవడం ప్రారంభిస్తాను. నాకు కూడా ఎలా చదవాలో నేర్పించండి అని సంతోషంతో చెప్పాడు విమల్. అమ్మమ్మ మొఖంలో వచ్చిన సంతోషానికి వెలకట్టలేము.
హలో పిల్లలు తేనెకంటే ఇంపైన లేఖనము మన చేతుల్లో ఉండేటప్పుడు చదవకుండా ఉండవచ్చ?
మీరు కూడా రోజు బైబిల్ ను ధ్యానించి యేసయ్య చూడండి. ఆల్ ద బెస్ట్.
- శ్రీమతి. జీవా విజయ్ గారు
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250