By Village Missionary Movement
Saturday, 29-Jul-2023దిన ధ్యానము(Telugu) 29.07.2023
అంశం: ధనాపేక్ష
"ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి" - 1 తిమోతికి 6:10
ప్రపంచ అద్భుతాలలో ఒకటి చైనా గోడ. 4,500 పొడవు 35 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పు కలిగినది ఈ చైనా గోడ మిక్కిలి సంరక్షణ కలిగినది గాను లోకముునే ఆశ్చర్యపరిచే అంతగా ప్రఖ్యాతి గాంచినది. లోకంలో ఏ దేశం కూడా ఇలాంటి బ్రహ్మాండమైన గోడను కట్టనే కట్టలేదు. కొండమీద కట్టుబడిన ఈ గోడను జీవితంలో ఒక్కసారి అయినా చూడాలి అని అనేక దేశముల నుండి చూడడానికి ప్రజలు గుంపులు గుంపులుగా వస్తూ ఉంటారు. ఇటువంటి అద్భుతం కలిగిన గోడ కట్టబడడానికి గల కారణము ఏమిటో తెలుసా? తన దేశంలోనికి శత్రు సైన్యము దూరిపోకుండా ఉండుట కొరకే. కానీ దాన్ని అధిగమించి పారివేరియన్ అని పిలవబడుతున్న అడవి జాతి ప్రజలు చాలా సులువుగా లోనికి ప్రవేశించారు. ఎలాగు అని ఆలోచిస్తున్నారా? ఆ గోడను దాటుకొని లేక పగలగొట్టుకొని 4,500 మైళ్ళు తిరిగి లోపలికి రాలేదు కానీ కోటలో గల కాపలా కాస్తున్న వారికి లంచం ఇచ్చి ద్వారం వద్ద చైనా దేశంనకు రాగలిగారు. ఒక చిన్న ధనాపేక్ష గొప్ప అపజయానికి కారణమైంది. పొలమునకు ఉండిన కంచె ఆ పంటను మేసినట్లు ఉండిన ఈ కాపలాదారుల యొక్క ధనాపేక్ష దానికి గల కారణం.
2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో దేవుని దాసుడైన ఎలీషా యొక్క పనివాడు అయినా గేహజి ద్వారా దేవుడు మనకు ఒక కార్యాన్ని నేర్పిస్తున్నారు. ఏలియా తర్వాత ఎలీషా తన సంపూర్ణ శ్రద్ధను చూపించి అతని వద్ద నుండి రెండంతల ఆత్మను పొందుకోగలిగాడు కానీ ఎలీషా తర్వాత ఆ స్థానంలో రావలసిన గేహజి అయితే తన ఆత్మను అదుపు చేసుకోలేక ధనాపేక్ష గలవాడై వెనక్కు వెళ్లి చివరకు నామాను విడిచిపెట్టిన కుష్టి రోగాన్ని పొందుకున్నాడు అది అతనికి మాత్రమే కాదు అతని సంతతి వారందరు పొందుకున్నట్లుగా మనము చదువుతా ఉన్నాం. ఇక్కడ ఆత్మను అదుపు చేయలేని వాడు గోడ లేనటువంటి పట్టణం వలే మారిపోయాడు. మనము కూడా మనసులో సత్యము అనే దట్టిని కట్టుకుని తెలివి మరియు బుద్ధి కలిగిన వారుగా ఉండాలి. 1 పేతురు 1:13 అని బైబిల్ మనకు హెచ్చరిస్తుంది. దేవునికి ఇష్టము లేని చిన్న చిన్న ధనాపేక్షులు మన హృదయంలో ఉండిన యెడల అది గొప్ప దీవెనలకు అభ్యంతరకరంగా మారుతుంది అనే దాన్లో సందేహం లేదు. ధనాపేక్ష మన నుండి బయటకు వెళ్ళినప్పుడు సంతృప్తి గల హృదయముతో జీవించడం నేర్చుకుంటాం. దేవుడు మనలను దీవించును గాక!
ప్రార్థన అంశం:-
మన పరిచర్యను ప్రార్థనలతోనూ కానుకలతోనూ సహాయం చేసిన వారిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250