Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.03.2021
Share:

By Village Missionary Movement

Wednesday, 17-Mar-2021

దిన ధ్యానము(Telugu) 17.03.2021

రక్షణ తాడు

"తన అద్వితీయకుమారునిగా( లేక, జనిలైక కుమరుడుగా) పుట్టిన వాని  ఆయనను అనుగ్రహించెను" - యోహాను 3: 16

ఒక ప్రసంగికుడు తన ప్రసంగమును ఒక నిజ సంఘటనతో ప్రారంభించారు. తండ్రి మరియు ఆయన కుమారుడు కలిసి సముద్రంలో పడవ ప్రయాణంలో విహార యాత్రకు వెళ్ళారు. అప్పుడు హఠాత్తుగా వచ్చిన తుఫాను వలన ఆ సముద్రము యొక్క అలలు పెద్దవిగా రావడం ప్రారంభించాయి. వారి యొక్క పడవను పెద్ద అలలు కొట్టడం ప్రారంబించాయి. పడవ నడవడంలో తండ్రి మంచి నైపుణ్యత కలవారే ఒక పెద్ద అల వచ్చి ఆ పడవను తాకే సరికి  ఆ పడవ ముక్కలు అయిపోయింది. ఆ తండ్రి చూస్తుండగానే ఆ కుమారుడు, తన స్నేహితుడు సముద్రంలో పడిపోయి ప్రాణములతో కొట్టుకుంటున్నారు. అప్పుడు ఆ తండ్రి మిక్కిలి కష్టముతో ఆ పడవ నుండి ఒక తాడును తీసి ఒక చివరను ఎవరి వైపు విసరాలి అని ఆలోచించారు.ఆలస్యం చేస్తే ఇద్దరు కూడా ప్రాణములను కోల్పోతారు. కుమారుడు రక్షణ పొందిన వాడు కాని స్నేహితుడైతే రక్షణ పొందని వాడు అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని కుమారుడ్ని చూచి కుమారుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆ తాడును తన స్నేహితుని వైపు విసిరారు. దాని వలన తన స్నేహితుడు రక్షించ బడ్డాడు కాని తన కుమారుడు మరణించాడు.

పరిశుద్ధ బైబిల్ యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏమిటి అంటే దేవుడు తమ ఏకైక కుమారుడ్ని ఈ లోకమునకు పంపించారు. మానవ జాతి యొక్క పాపములను క్షమించే విధముగా తండ్రి తన ప్రియ కుమారుడ్ని సిలువ మరణము పొందుటకు అనుమతించారు. దేవుని ప్రేమ ఇదే. మానవ జాతిని రక్షించుటకు దేవుడు పెట్టుకున్న ప్రణాళిక ఇదే.

దీన్ని చదువుతున్న ప్రియ స్నేహితులరా దేవుని రక్షణ ప్రణాలికను గ్రహించిన మనము దేవుని యొక్క ఈ సువార్తను లోకమంత తీసుకొని వెళ్లుటకు ఉత్సాహంగా పనిచేద్దాం. నావికుడైన ఆ తండ్రి తన స్నేహితుణ్ణి కాపాడుటకు తన కుమారుడ్ని మరణమునకు అప్పగించారు. దేవుడు మన ప్రతి ఒక్కరి పాపమును క్షమించుటకు తన కుమారుడ్ని సిలువ మరణమునకు అప్పగించారు. దీనిని గ్రహించుకున్న వారిగా మనం దేవుని కొరకు జీవిద్దాం, దేవుని ప్రేమను లోకమునకు ప్రకటిద్దాం. 
-    బ్రదర్. టి జాకబ్ స్మిత్

ప్రార్థన అంశం:-
ఆంధ్రప్రదేశ్ లో రఘుమండ అనే గ్రామంలో త్వరగా దేవుని మందిరము కట్టబడేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet