By Village Missionary Movement
Thursday, 27-Jul-2023దిన ధ్యానము(Telugu) 28.07.2023
అంశం: ఆత్మల రక్షణ
"నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు" - సామెతలు 11:30
మన దేశంలో గల ఉత్తర భారత దేశంలో ఒక హాస్పిటల్ చాలా రద్దీగా పనిచేస్తూ ఉండేది. దానిలో ప్రమాదంలో చిక్కుకొని కొన ఊపిరితో ఉన్న ఒక చిన్న బాబు చేర్చబడ్డాడు. ఆయనకు 11 సంవత్సరాలు వయస్సు కలిగి అతని పేరు స్టీఫెన్ అని అతని బంధువులు చెప్పారు. అతనికి చికిత్స జరుగుతూ ఉంది. అయినప్పటికీ గాయము పెద్దదిగా ఉన్నందువలన ఆయన బ్రతికి ఉండడం కష్టమని వైద్యులు చెప్పారు. కానీ అక్కడ పనిచేసిన నర్స్ అతని వద్దకు వెళ్లి తమ్ముడు భయపడకము నీ దేవుడు నిన్ను స్వస్థపరుస్తారు అని ధైర్యపరిచారు. స్టీఫెన్ అక్క నేను మరణిస్తే పరలోకానికి వెళ్లి యేసయ్యను చూస్తాను అని సంతోషకరమైన ముఖముతో ఆమెకి సమాధానం ఇచ్చాడు.
కొంత సమయం తర్వాత ఆమె మరలా స్టీఫెన్ వద్దకు వెళ్లేసరికి స్టీఫెన్ ఏడుస్తూ ఉన్నాడు. దాన్ని చూసి నర్స్ మిక్కిలి ఆదరణగా మాట్లాడింది. అందుకు స్టీఫెన్ అక్క నేను మరణిస్తాను అని బాధపడడం లేదు నేను ఇంతవరకు నా వయసుకు తగ్గట్టుగా పదిమందిని యేసయ్య దగ్గరికి నడిపించాను. నాకు ఈ నెలలో 11 సంవత్సరాలు పూర్తి అవుతాయి 11వ వ్యక్తిగా మీరు యేసయ్యను అంగీకరిస్తారా అని అడిగాడు. సరే చూద్దాం అని చెప్పి నర్స్ వెళ్ళపోయింది. కానీ ఆ బాబు అడిగిన ప్రశ్న ఆమెను ఆలోచింపజేసింది. ఆ మధ్యలో స్టీఫెన్ కు చికిత్స అందించిన ఒక డాక్టర్ కు కూడా స్టీఫెన్ సువార్త అందించాడు. ఆ వైద్యుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించినవాడిగా ఇంట్లో ఇటు అటు నడుస్తూ ఉన్నాడు. దానిని చూచిన తన భార్య ఏమైంది అని అడిగినప్పుడు ఆ బాబు మరణించాడు అని సందేశం వచ్చింది. ఆ వైద్యుడు హాస్పిటల్ కి వెళ్లి చూసినటువంటి దృశ్యం ఆయన హృదయాన్ని కదిలింపజేసింది. ఎందుకంటే ఆ చిన్న బాబు దగ్గర ఆ నర్స్ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. డాక్టర్ స్టీఫెన్ కోరికను నేను కూడా అంగీకరిస్తాను అని చెప్పాడు.
మరణ పరిస్థితిలో కూడా 11 సంవత్సరాల బాబుకు ఇలాంటి ఆత్మల పట్ల భారము, ఆత్మల పట్ల దప్పిక ఉన్నది. అలానే ఇశ్రాయేలీయుల యొక్క రక్షణ అపోస్తులుడైన పౌలు యొక్క హృదయ వాంఛగా ఉండేది. మరి మన కోరిక ఏమిటి? ఈ దిన ధ్యాన భాగంలో చెప్పబడిన విధంగా అన్ని శ్రమలలోను సంఘము గూర్చిన చింత నన్ను రోజు దేవుని దగ్గర చేరేటట్లు చేస్తుంది అని అపోస్తులుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. మనకు మన సంఘ ప్రజలకు ఆత్మల వాంఛ కలగనివ్వండి. ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడదాం, మన దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని చూద్దాం.
- శ్రీ. భాగ్యనాదన్ గారు
ప్రార్థన అంశం:
మన సేవకులు యొక్క ప్రయాణంలో దేవుని సంరక్షణ ఉండేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250